ODI Record : ఇంగ్లాండ్ దూకుడు.. భారత్ రికార్డు బద్దలు.. అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్లు ఇవే !
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు దక్షిణ ఆఫ్రికాపై 342 పరుగుల తేడాతో విజయం సాధించి ఒక ప్రపంచ రికార్డును సృష్టించింది. ఇది వన్డే క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా అత్యధిక తేడాతో సాధించిన విజయం. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 414 పరుగులు చేసింది. దక్షిణ ఆఫ్రికా జట్టు కేవలం 72 పరుగులకే ఆలౌట్ అయి, 342 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది.

ODI Record : వన్డే క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. సౌతాఫ్రికాను 342 పరుగుల భారీ తేడాతో ఓడించి అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఇంతకు ముందు ఈ రికార్డు భారత్ పేరున ఉండేది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసి 414 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీనికి జవాబుగా సౌత్ ఆఫ్రికా జట్టు కేవలం 72 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాజయం చవిచూసింది. ఇంగ్లాండ్ తరఫున జోఫ్రా ఆర్చర్ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు.
మ్యాచ్ ఎలా జరిగింది?
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 414 పరుగుల భారీ స్కోరు సాధించింది. జో రూట్ 100 పరుగులు, జాకోబ్ బెథెల్ 110 పరుగులు చేసి జట్టు స్కోరును 400కు పైగా చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే, జోస్ బట్లర్ చివరి 10 ఓవర్లలో 32 బంతుల్లో 62 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన సౌతాఫ్రికా జట్టులో 8 మంది బ్యాటర్లు కనీసం పది పరుగుల మార్కును కూడా దాటలేకపోయారు.
భారత్ రికార్డు బ్రేక్!
సౌత్ ఆఫ్రికాను 342 పరుగుల తేడాతో ఓడించడం ద్వారా వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా ఇంగ్లాండ్ రికార్డు సృష్టించింది. ఇంతకుముందు ఈ రికార్డు భారత్ పేరున ఉండేది. భారత్ 2023లో శ్రీలంకను 317 పరుగుల తేడాతో ఓడించి ఈ రికార్డును నెలకొల్పింది. వన్డే క్రికెట్ చరిత్రలో, ఒకే జట్టును రెండుసార్లు 300 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడించిన ఏకైక దేశం భారత్ మాత్రమే. టీమిండియా ఈ ఘనతను రెండు సార్లు సాధించింది.
వన్డేలలో అత్యధిక పరుగుల తేడాతో విజయాలు
342 పరుగులు – ఇంగ్లండ్ (దక్షిణ ఆఫ్రికాపై)
317 పరుగులు – భారత్ (శ్రీలంకపై)
309 పరుగులు – ఆస్ట్రేలియా (నెదర్లాండ్స్‌పై)
304 పరుగులు – జింబాబ్వే (యూఎస్ఏపై)
302 పరుగులు – భారత్ (శ్రీలంకపై)
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




