AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shubman Gill : రూ.100 నుంచి రూ.50 కోట్లు.. అసలు శుభ్‌మన్ గిల్ అంత డబ్బు ఎలా సంపాదించాడంటే ?

భారత క్రికెట్ యువ సంచలనం శుభ్‌మన్ గిల్ తన 26వ పుట్టినరోజును దుబాయ్‌లో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంలో, ఆయన ఆర్థిక విజయం గురించి ఒక ఆసక్తికరమైన వార్త బయటికొచ్చింది. ప్రస్తుతం గిల్ నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 50 కోట్లు అని ఒక నివేదిక వెల్లడించింది. ఇంత భారీ సంపదను ఆయన ఎలా సంపాదించారో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు.

Shubman Gill : రూ.100 నుంచి రూ.50 కోట్లు.. అసలు శుభ్‌మన్ గిల్  అంత డబ్బు ఎలా సంపాదించాడంటే ?
Shubman Gill (2)
Rakesh
|

Updated on: Sep 08, 2025 | 11:13 AM

Share

Shubman Gill : భారత క్రికెట్ జట్టు యువ సంచలనం శుభ్‌మన్ గిల్ ఈ రోజు తన 26వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఆసియా కప్ కోసం దుబాయ్‌లో ఉన్న శుభ్‌మన్ తన పుట్టినరోజును జట్టు సభ్యులతో కలిసి జరుపుకోనున్నాడు. ఈ సందర్భంగా అతని ఆస్తుల గురించి ఒక ఆసక్తికరమైన నివేదిక వెలువడింది. ప్రస్తుతానికి శుభ్‌మన్ గిల్ నికర విలువ దాదాపు రూ.50 కోట్లు అని ఆ నివేదిక వెల్లడించింది. ఇంత పెద్ద మొత్తంలో అతను ఎలా సంపాదిస్తున్నాడనేది చాలా మందికి ఆసక్తికరమైన విషయం. కానీ, ఈ ప్రయాణం కేవలం రూ.100 నుండి మొదలైందంటే ఆశ్చర్యపోక తప్పదు.

క్రికెట్‌పై శుభ్‌మన్ గిల్‌కు ఉన్న పిచ్చికి అతని తండ్రి లఖ్విందర్ సింగ్ గిల్ ఎంతగానో మద్దతు ఇచ్చారు. శుభ్‌మన్ చిన్నప్పుడు అతని తండ్రి తమ గ్రామంలో సొంతంగా ఒక పిచ్ తయారు చేశారు. అక్కడ శుభ్‌మన్‌కు ప్రాక్టీస్ చేయించడానికి గ్రామ యువకులను పిలిచేవారు. అప్పుడు ఒక షరతు పెట్టేవారు. గిల్‌ను అవుట్ చేసిన వారికి రూ.100 బహుమతిగా ఇస్తానని చెప్పేవారు. ఈ ప్రోత్సాహం శుభ్‌మన్‌ను మెరుగైన క్రికెటర్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించింది. ఆ రూ.100 ప్రోత్సాహంతో మొదలైన ప్రయాణం ఇప్పుడు ఏకంగా రూ.50 కోట్ల ఆస్తికి దారితీసింది.

శుభ్‌మన్ గిల్ తన సంపాదనకు కేవలం క్రికెట్‌పై మాత్రమే ఆధారపడటం లేదు. అతని ఆదాయానికి ప్రధాన వనరు క్రికెట్ అయినప్పటికీ, అతను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న 20 బ్రాండ్లు కూడా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించిపెడుతున్నాయి. ఈ 20 బ్రాండ్ల ద్వారానే అతను భారీ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు.

శుభ్‌మన్ గిల్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్

NIKE, జిల్లెట్, CEAT, క్యాసియో, బజాజ్ అలియాంజ్ లైఫ్, కోకా కోలా, మై సర్కిల్, బీట్స్ బై డ్రే, ఆక్లే, ది స్లీప్ కంపెనీ, మషల్ బ్లేజ్, ITC ఎంగేజ్, TVS, JBL, టాటా క్యాపిటల్, సింథాల్, ఫియామా మెన్, వింగ్స్, క్యాప్రీ లోన్స్, గేమ్స్ 24×7.

క్రికెట్ నుండి గిల్ ఆదాయం

శుభ్‌మన్ గిల్ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్‎తో A గ్రేడ్ వార్షిక కాంట్రాక్ట్ కలిగి ఉన్నాడు. దీని ప్రకారం.. అతనికి ప్రతి సంవత్సరం రూ.5 కోట్లు లభిస్తాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్నందుకు అతనికి రూ.16.50 కోట్లు లభిస్తాయి. ఇవి కాకుండా, ప్రతి మ్యాచ్ ఫీజు, అతని ప్రదర్శన ఆధారంగా వచ్చే బోనస్‌లు అదనం. మొత్తంమీద అతను సంపాదిస్తున్న డబ్బులో సగం క్రికెట్ ద్వారా వస్తే మిగిలిన సగం బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా వస్తుందని తెలుస్తోంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై