AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iconic Baggy Green Cap: ఓరి నాయనో ఒక్క క్యాప్ ధర 2.63 కోట్ల! ఇంతకీ ఆ క్యాప్ ఎవరిదో తెలుసా?

డాన్ బ్రాడ్‌మాన్ 1947-48 సిరీస్‌లో ధరించిన ప్రసిద్ధ 'బ్యాగీ గ్రీన్' క్యాప్ $479,700కి విక్రయించబడింది. ఇది బ్రాడ్‌మాన్ స్వదేశంలో ఆడిన చివరి టెస్టు సిరీస్‌లో ఉపయోగించబడింది. భారత టూర్ మేనేజర్ పంకజ్ గుప్తాకు బహుమతిగా ఇచ్చిన ఈ అరుదైన టోపీ వేలంలో చారిత్రాత్మక కీర్తిని సాధించింది.

Iconic Baggy Green Cap: ఓరి నాయనో ఒక్క క్యాప్ ధర 2.63 కోట్ల! ఇంతకీ ఆ క్యాప్ ఎవరిదో తెలుసా?
Don Bradman's Iconic Green Cap
Narsimha
|

Updated on: Dec 04, 2024 | 10:35 AM

Share

1947-48 సిరీస్‌లో భారత్‌తో జరిగిన టెస్టుల్లో ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్‌మాన్ ధరించిన ప్రఖ్యాత ‘బ్యాగీ గ్రీన్’ టెస్ట్ క్యాప్ అరుదైన చరిత్రాత్మక రికార్డు సృష్టించింది. వేలంలో ఈ క్యాప్ 10 నిమిషాల కంటే తక్కువ సమయంలో అద్భుతమైన $479,700 (రూ. 2.63 కోట్లు)కి విక్రయించబడింది. బ్రాడ్‌మాన్ తన కెరీర్‌లో చివరిసారిగా స్వదేశంలో టెస్టు సిరీస్‌లో పాల్గొన్న సమయంలో ధరించిన ఈ క్యాప్ ఎంతో ప్రత్యేకంగా భావించబడింది.

ఆ సిరీస్‌లో బ్రాడ్‌మాన్ ఆస్ట్రేలియా జట్టుకు నాయకత్వం వహిస్తూ కేవలం ఆరు ఇన్నింగ్స్‌లలో 178.75 సగటుతో 715 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ కూడా ఉన్నాయి. అతని ప్రదర్శన కేవలం రికార్డులపైనే కాదు, క్రికెట్ అభిమానుల గుండెల్లో కూడా చెరగని ముద్రవేసింది.

ఫాక్స్ స్పోర్ట్స్ నివేదిక ప్రకారం, ఈ ప్రత్యేకమైన టోపీని భారత టూర్ మేనేజర్ పంకజ్ “పీటర్” కుమార్ గుప్తాకు బ్రాడ్‌మాన్ స్వయంగా బహుమతిగా ఇచ్చారు. బోన్‌హామ్స్ వేలం నిర్వహణ సంస్థ ఈ టోపీని అరుదైన కళాఖండంగా అభివర్ణించింది. ఈ వేలంలో ప్రముఖులు పోటీ పడగా, టోపీ చివరకు $390,000 (ప్రారంభ ధర)కి విజేత బిడ్ సాధించి, తరువాత చార్జెస్ తో కలిపి మొత్తం విలువ పెరిగింది.

బ్రాడ్‌మాన్ క్రికెట్ చరిత్రలో అగ్రగణ్య బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతాడు. 52 టెస్టుల్లో 29 సెంచరీలు, 13 అర్ధసెంచరీలతో 6996 పరుగులు చేసిన బ్రాడ్‌మాన్ బ్యాటింగ్ సగటు 99.94 అందనంత ఎత్తులో ఉంది. అతని 12 డబుల్ సెంచరీలు, 2 ట్రిపుల్ సెంచరీలు ఇప్పటికీ ప్రత్యేకమైన రికార్డులుగా ఉన్నాయి.

“ది డాన్” అని పిలవబడే బ్రాడ్‌మాన్ క్రికెట్ ప్రపంచానికి క్రీడా స్ఫూర్తిగా నిలిచాడు. బ్రాడ్‌మాన్ 2001లో 92 ఏళ్ల వయసులో మృతి చెందాడు, కానీ అతని చరిత్రాత్మక ఆటతీరు, మైదానంలో చూపిన అద్భుత ప్రదర్శనలు ఎప్పటికీ మరిచిపోలేని విజయగాథలుగా నిలుస్తాయి.