AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపిఎల్‌లో ఢిల్లీ జట్టు డకౌట్ల రికార్డు

చండీగఢ్: ఐపిఎల్ – 2019లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడ్డాయి. ఢిల్లీ జట్టు మీద పంజాబ్ జట్టు 14 పరుగుల తేడాతో గెలుపొందింది. తేలికగా గెలవాల్సిన మ్యాచ్‌ను ఢిల్లీ జట్టు చేజార్చుకుంది. చివరి 24 బంతుల్లో 30 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. పైగా చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. ఈ స్థితిలో కచ్చితంగా గెలవడం ఖాయం. కానీ ఓడిపోయింది. ఆలౌటై 14 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే ఢిల్లీ బ్యాటింగ్‌లో […]

ఐపిఎల్‌లో ఢిల్లీ జట్టు డకౌట్ల రికార్డు
Vijay K
| Edited By: |

Updated on: Apr 02, 2019 | 1:24 PM

Share

చండీగఢ్: ఐపిఎల్ – 2019లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడ్డాయి. ఢిల్లీ జట్టు మీద పంజాబ్ జట్టు 14 పరుగుల తేడాతో గెలుపొందింది. తేలికగా గెలవాల్సిన మ్యాచ్‌ను ఢిల్లీ జట్టు చేజార్చుకుంది. చివరి 24 బంతుల్లో 30 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. పైగా చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. ఈ స్థితిలో కచ్చితంగా గెలవడం ఖాయం. కానీ ఓడిపోయింది. ఆలౌటై 14 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే ఢిల్లీ బ్యాటింగ్‌లో ఐదు డకౌట్లు ఉండటం విశేషం. ఇది ఐపిఎల్‌లోనే రికార్డు. ఇప్పటి వరకూ జరిగిన ఐపిఎల్‌ సీజన్లలో ఇది రెండో అత్యధిక డకౌట్ల ఇన్నింగ్స్‌గా నిలిచింది.

ముందుగా పంజాబ్ బౌలర్ శ్యామ్ కరన్ గురించి చెప్పుకోవాలి. ఇతను 2.2 ఓవర్లు మాత్రమే వేసి 11 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఇందులో హ్యాట్రిక్ కూడా ఉంది. చివరి మూడు బంతుల్లో వరుసగా హర్షల్ పటేల్, కగిసో రబాడా, సందీప్ లమిచనే‌లను పడగొట్టాడు. ఆ మూడు వికెట్లు కూడా డకౌట్లే. ఈ ముగ్గురితోపాటు ఢిల్లీ ఓపెనర్ పృధ్వి షాను క్యాచ్ రూపంలో, క్రిస్ మోరిస్‌ను రనౌట్ రూపంలో పంజాబ్ కెప్టెన్ అశ్విన్ సున్నా పరుగుల వద్దే ఔట్ చేశాడు.

ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక డకౌట్లు 2011లో నమోదయ్యాయి. ఆ ఏడాదిలో కోచి టస్కర్స్ కేరళ, డెక్కన్ ఛార్జర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అది జరిగింది. ఆ ఏడాది తర్వాత మళ్లీ ఒకే ఇన్నింగ్స్‌లో అధిక డకౌట్లు అయ్యింది ఈ మ్యాచ్‌లోనే కావడం విశేషం.

మ్యాచ్ స్కోర్ వివరాలు.. పంజాబ్ జట్టు: 166/9(20 ఓవర్లలో) ఢిల్లీ జట్టు: 152/10(19.2 ఓవర్లలో)

పెళ్లాం కాదు.. భర్త ఊరెళితే.. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' రివ్యూ
పెళ్లాం కాదు.. భర్త ఊరెళితే.. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' రివ్యూ
అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న డ్రమ్స్ ప్లేయర్ శివమణి..
అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న డ్రమ్స్ ప్లేయర్ శివమణి..
మద్యం ప్రియులకు మత్తెంకించే కాంబో..! ఇలా తాగితే కిక్కే కిక్కు
మద్యం ప్రియులకు మత్తెంకించే కాంబో..! ఇలా తాగితే కిక్కే కిక్కు
అక్కడ పిజ్జా ఆర్డర్లు పెరిగాయా.. ప్రపంచంలో ఎక్కడో యుద్ధం ..
అక్కడ పిజ్జా ఆర్డర్లు పెరిగాయా.. ప్రపంచంలో ఎక్కడో యుద్ధం ..
జియోలో 36 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్‌ వచ్చిందని మీకు తెలుసా?
జియోలో 36 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్‌ వచ్చిందని మీకు తెలుసా?
జూనియర్ బాక్సర్‌తో మేరీ కోమ్‌కు ఎఫైర్.. మాజీ భర్త సంచలన ఆరోపణలు
జూనియర్ బాక్సర్‌తో మేరీ కోమ్‌కు ఎఫైర్.. మాజీ భర్త సంచలన ఆరోపణలు
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పాలిటెక్నిక్‌లో 9 కొత్త కోర్సులు!
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పాలిటెక్నిక్‌లో 9 కొత్త కోర్సులు!
సందీప్‌ని గుర్తుచేసిన గీతూ...అంతకు మించి అంటున్న ఆడియన్స్
సందీప్‌ని గుర్తుచేసిన గీతూ...అంతకు మించి అంటున్న ఆడియన్స్
చికెన్‌లోని ఈ పార్ట్స్ యమ స్పెషల్.. తిన్నారంటే ఆ రోగాల మాటే ఉండదు
చికెన్‌లోని ఈ పార్ట్స్ యమ స్పెషల్.. తిన్నారంటే ఆ రోగాల మాటే ఉండదు
మురుగు కాలువను క్లీన్ చేస్తున్న కార్మికులు.. కాళ్ల కింద కనిపించిన
మురుగు కాలువను క్లీన్ చేస్తున్న కార్మికులు.. కాళ్ల కింద కనిపించిన