ఐపిఎల్ 2019లో తొలి హ్యాట్రిక్

చండీగఢ్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆల్‌రౌండర్ శ్యామ్ కరన్ బౌలింగ్‌లో అదరగొట్టాడు. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించాడు. ఇది ఈ ఐపిఎల్ సీజన్‌లోనే తొలి హ్యాట్రిక్ కావడం విశేషం. మోహలీ స్టేడియంలో ఢిల్లీ ఆటగాళ్లు హర్ష పటేల్, కగిసో రబాడా, సందీప్ లించ్‌హానేలను వరుసగా ఔట్ చేసి ఈ ఫీట్ సాధించాడు. ఇది మొత్తంగా ఐపిఎల్‌లో ఇప్పటి వరకు నమోదైన 18వ హ్యాట్రిక్. 20వ ఓవర్ చివరి మూడు బంతుల్లో వికెట్లు […]

ఐపిఎల్ 2019లో తొలి హ్యాట్రిక్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 02, 2019 | 1:25 PM

చండీగఢ్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆల్‌రౌండర్ శ్యామ్ కరన్ బౌలింగ్‌లో అదరగొట్టాడు. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించాడు. ఇది ఈ ఐపిఎల్ సీజన్‌లోనే తొలి హ్యాట్రిక్ కావడం విశేషం. మోహలీ స్టేడియంలో ఢిల్లీ ఆటగాళ్లు హర్ష పటేల్, కగిసో రబాడా, సందీప్ లించ్‌హానేలను వరుసగా ఔట్ చేసి ఈ ఫీట్ సాధించాడు.

ఇది మొత్తంగా ఐపిఎల్‌లో ఇప్పటి వరకు నమోదైన 18వ హ్యాట్రిక్. 20వ ఓవర్ చివరి మూడు బంతుల్లో వికెట్లు తీసిన కరన్ మొత్తంగా 2.2 ఓవర్లు మాత్రమే వేసి, 11 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. భారత లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఐపిఎల్‌లో అందరి కంటే ఎక్కువగా ఐపిఎల్‌లో మూడు సార్లు హ్యాట్రిక్ సాధించాడు.

శ్యామ్ కరన్ ధాటికి ఢిల్లీపై పంజాబ్ జట్టు 14 పరుగుల తేడాతో నెగ్గింది.

స్కోర్ వివరాలు.. పంజాబ్ జట్టు: 166/9(20 ఓవర్లలో) ఢిల్లీ జట్టు: 152/10(19.2 ఓవర్లలో)