డేవిడ్ వార్నర్ ఇంట్లో ఉంటే.. అందులోనూ వీకెండ్ అయితే.. ఇలా ఉంటుందంటున్న వార్నర్ భార్య…
David Warner House: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు తన కుటుంబం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆటలో ఎంత బిజీగా ఉన్నా.. తన అల్లారు ముద్దుల ముగ్గురు చిన్నారులు
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు తన కుటుంబం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆటలో ఎంత బిజీగా ఉన్నా.. తన అల్లారు ముద్దుల ముగ్గురు చిన్నారులు అంటే ప్రాణం. కాస్త సమయం దొరికితే చాలు భార్య క్యాండీస్‌తో పాటు ముగ్గురు కుమార్తెలతో సరదాగా గడుపుతాడు. టోర్నీ ఏదైనా వారితో సమయం గడపడానికి ఇష్టపడుతాడు. అంతేకాదు అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తన ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. మరోవైపు వార్నర్ సతీమణి క్యాండీస్ కూడా తమ విశేషాలను అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేసి వార్నర్ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది.
View this post on Instagram
ఐపీఎల్ అర్ధంతరంగా ఆగిపోవడంతో ఇంటికి చేరుకున్న వార్నర్ ఈ వీకెండ్‌ను తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ వీకెండ్ ప్లాన్స్ ఏంటని అందరూ నన్ను అడుగుతుంటారు. ‘సూపర్ డాడ్’ డేవిడ్ వార్నర్ ఇంట్లో ఉంటే.. ఆ రోజు ఇలా ఉంటుంది. మాకు వీకెండ్స్ అంటే పిల్లల సంతోషమే. అవన్నీ ఇప్పుడు మిస్ అవుతున్నాం. కానీ రాబోయే రోజుల్లో వార్నర్ ఇంట్లో ఉండటం తలచుకుంటే సంతోషంగా ఉంది’ అని క్యాండీస్ వార్నర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. దీంతోపాటు గతంలో వార్నర్ ఇంట్లో ఉన్న సమయంలో తమ పిల్లలతో కలిసి సరదాగా గడిపిన క్షణాలను అభిమానులతో పంచుకుంది.