David Warner: కొత్త సంవత్సరం వేళ.. వార్నర్ సంచలన నిర్ణయం.. ఇకపై టెస్టులు, వన్డేలకు.!

న్యూఇయర్ వేళ ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై టెస్టులతో పాటు వన్డేలకు గుడ్‌బై చెప్పినట్టు ప్రకటించాడు. ఈ విషయాన్ని సోమవారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

David Warner: కొత్త సంవత్సరం వేళ.. వార్నర్ సంచలన నిర్ణయం.. ఇకపై టెస్టులు, వన్డేలకు.!
David Warner
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 01, 2024 | 9:03 AM

న్యూఇయర్ వేళ ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై టెస్టులతో పాటు వన్డేలకు గుడ్‌బై చెప్పినట్టు ప్రకటించాడు. ఈ విషయాన్ని సోమవారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఒకవేళ 2025లో ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టుకు తన అవసరం ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తే.. తిరిగి జట్టుతో చేరుతానని చెప్పాడు.

‘టెస్టులతో పాటు వన్డే క్రికెట్‌కు కూడా రిటైర్ అవ్వాలని నిర్ణయించాను. భారత్‌పై వన్డే ప్రపంచకప్ గెలిచిన తరుణమే రిటైర్ కావడానికి సరైన సమయమని భావించాను. ఇదే నా కెరీర్‌లో అతిపెద్ద విజయం. టెస్టులు, వన్డే ఫార్మాట్ల నుంచి తప్పుకోవడం వల్ల ఫ్రాంచైజీ క్రికెట్ ఆడేందుకు ఎక్కువ సమయం లభిస్తుంది. కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు’ వార్నర్ తెలిపాడు. రెండేళ్లలో ఛాంపియన్స్ ట్రోఫీ ఉందన్న సంగతి తనకు తెలుసన్న వార్నర్.. రిటైర్‌మెంట్ ప్రకటించినప్పటికీ.. అప్పటివరకు పూర్తి ఫిట్‌గా ఉండటానికి ప్రయత్నిస్తానన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టుకు తన అవసరం కచ్చితంగా ఉంటే.. తిరిగొస్తానని వార్నర్ అన్నాడు.

ఆస్ట్రేలియా తరపున వార్నర్ 161 వన్డేల్లో 6932 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడు 22 సెంచరీలు, 33 హాఫ్‌ సెంచరీలు సాధించాడు. తన వన్డే కెరీర్‌లో రెండు ప్రపంచకప్‌లు గెలిచిన జట్లలో ఉన్న వార్నర్.. వన్డే ప్రపంచకప్ 2023ను ఆస్ట్రేలియా సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో 528 పరుగులు చేసిన డేవిడ్‌ భాయ్‌.. ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కాగా, సిడ్నీ టెస్ట్ తనది చివరి టెస్టుగా ప్రకటించిన వార్నర్.. ఇటీవలే టెస్టులకు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

టెస్టులకు వార్నర్ గుడ్ బై..

వన్డేలకు గుడ్ బై..