AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SA vs IND: టీమిండియాకు గుడ్‌న్యూస్.. కోలుకున్నన స్టార్ ప్లేయర్.. రెండో టెస్ట్ బరిలోకి రెడీ..

Shardul Thakur Injury: డిసెంబర్ 30న సెంచూరియన్‌లో నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో శార్దూల్ భుజానికి బంతి తగిలింది. అయితే, అతని గాయం తీవ్రత అప్పటికి తెలియదు. అయితే, అతని గాయం జట్టుకు పెద్ద నష్టంగా పరిగణిస్తున్నారు. జనవరి 3 నుంచి కేప్‌టౌన్‌లో భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది.

SA vs IND: టీమిండియాకు గుడ్‌న్యూస్.. కోలుకున్నన స్టార్ ప్లేయర్.. రెండో టెస్ట్ బరిలోకి రెడీ..
Indian Cricket Team
Venkata Chari
|

Updated on: Dec 31, 2023 | 7:26 PM

Share

SA vs IND: టీమిండియా బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ గాయం తీవ్రంగా లేదు. శనివారం రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్‌లో శార్దూల్ గాయపడ్డాడు. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, శార్దూల్ పూర్తిగా క్షేమంగా ఉన్నాడని భారత జట్టు మూలాలు తెలిపాయి. అతని గాయం తీవ్రంగా లేదని, స్కాన్ అవసరం లేదని తెలిపింది.

డిసెంబర్ 30న సెంచూరియన్‌లో నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో శార్దూల్ భుజానికి బంతి తగిలింది. అయితే, అతని గాయం తీవ్రత అప్పటికి తెలియదు. అయితే, అతని గాయం జట్టుకు పెద్ద నష్టంగా పరిగణిస్తున్నారు. జనవరి 3 నుంచి కేప్‌టౌన్‌లో భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది.

గాయం తర్వాత నెట్స్‌లో కనిపించని శార్దూల్..

నెట్ సెషన్ ప్రారంభమైన 15 నిమిషాల తర్వాత ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ త్రోడౌన్ ప్రాక్టీస్ చేస్తుండగా శార్దూల్ గాయపడ్డాడు. షార్ట్ బాల్ ఆడలేక శార్దూల్ భుజానికి తగిలింది.

బంతి తగిలిన తర్వాత శార్దూల్ చాలా అసౌకర్యంగా ఉన్నాడు. అయితే, ముంబై ఆల్ రౌండర్ నెట్స్‌లో బ్యాటింగ్ కొనసాగించాడు. అతను బ్యాటింగ్ ముగించిన తర్వాత, ఫిజియో అతని భుజంపై ఐస్ ప్యాక్ స్లింగ్‌ను ఉంచాడు. దీని తర్వాత అతను నెట్స్‌లో ఎక్కువ పాల్గొనలేదు. బౌలింగ్ చేయలేదు.

హెల్మెట్‌కు తగిలిన బంతి..

తొలి టెస్టులో భారత్ ఎనిమిదో నంబర్ బ్యాట్స్‌మెన్ శార్దూల్ మంచి ఫామ్‌లో కనిపించగా, 44వ ఓవర్ మూడో బంతి అతని హెల్మెట్‌కు తగిలింది. గెరాల్డ్ కోయెట్జీ నుంచి వచ్చిన బౌన్సర్ అతని తలపై తగిలింది. శార్దూల్ తన హెల్మెట్‌పై బంతి తగిలిన తర్వాత ఇబ్బంది పడుతున్నట్లు కనిపించాడు. అతను కంకషన్ ప్రోటోకాల్‌ను చేయించుకున్నాడు. దీనిలో వైద్య బృందం అతని గాయాన్ని గమనించింది. ప్రోటోకాల్ సమయంలో, ఠాకూర్ తలపై వాపు కనిపించింది.

గాయపడినప్పటికీ శార్దూల్ మళ్లీ బ్యాటింగ్ ప్రారంభించాడు. 47వ ఓవర్లో కగిసో రబాడ వేసిన బంతి కూడా అతని చేతికి తగిలింది. ఈసారి కూడా వైద్య బృందం అతడిని తనిఖీ చేసింది. శార్దూల్ బ్యాటింగ్ ప్రారంభించాడు. కానీ, తర్వాతి బంతికే క్యాచ్ ఔట్ అయ్యాడు.

రెండో టెస్టుకు భారత జట్టులోకి అవేశ్‌..

దక్షిణాఫ్రికా పర్యటనలో జనవరి 3 నుంచి కేప్‌టౌన్‌లో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌లో మహ్మద్ షమీ స్థానంలో ఫాస్ట్ బౌలర్ అవేశ్ ఖాన్‌ను భారత జట్టులోకి తీసుకున్నారు.

దక్షిణాఫ్రికా పర్యటన కోసం రెండు టెస్టుల సిరీస్‌కు మహ్మద్ షమీని జట్టులోకి తీసుకున్నారు. సిరీస్ ప్రారంభానికి ముందే, మహ్మద్ షమీ ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోవడంతో పర్యటనకు దూరంగా ఉన్నాడు. అయితే, అతని స్థానంలో ఏ ఆటగాడినీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చేర్చలేదు. ఇప్పుడు తొలి మ్యాచ్ ముగిసిన తర్వాత షమీ స్థానంలో అవేశ్ ఖాన్‌ను జట్టులోకి తీసుకున్నారు.

సిరీస్‌లో 1-0తో వెనుకబడిన భారత్..

రెండు టెస్టుల ఈ సిరీస్‌లో భారత జట్టు 1-0తో వెనుకంజలో ఉంది. సెంచూరియన్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్‌ ఇన్నింగ్స్‌ 32 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు ఇరు జట్లు జనవరి 3 నుంచి 7 వరకు కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌లో ఆడనున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..