CSK vs LSG, IPL 2023 Highlights: చెపాక్ లో బోణి కొట్టిన చెన్నై.. లక్నోపై 12 పరుగుల తేడాతో విజయం
Chennai Super Kings vs Lucknow Super Giants IPL 2023 Highlights in Telugu: ఇండియన్ ప్రీమియర్ లీగ్-16లో భాగంగా లక్నో సూపర్ జెయింట్‌తో జరుగుతున్న ఆరో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 218 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. చెపాక్ స్టేడియంలో లక్నో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 217 పరుగులు చేసింది.

CSK vs LSG Highlights : ఇండియన్ ప్రీమియర్ లీగ్-16లో భాగంగా లక్నో సూపర్ జెయింట్‌తో జరుగుతున్న ఆరో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 218 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. చెపాక్ స్టేడియంలో లక్నో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 217 పరుగులు చేసింది. జట్టుకు ఓపెనర్లు తుఫాన్ ఆరంభాన్ని అందించారు. ఆఖరి ఓవర్లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. రితురాజ్ గైక్వాడ్ 31 బంతుల్లో 57 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. కాగా, డ్వేన్ కాన్వే 47 పరుగులు చేశాడు. శివమ్ దూబే 27 పరుగులు చేశాడు.
చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ ట్రోఫీని నాలుగు సార్లు గెలుచుకుంది. అయితే ఈ జట్టు చివరి సీజన్ చాలా పేలవంగా ముగిసింది. IPL-2023 మొదటి మ్యాచ్‌లో కూడా ఈ జట్టు గుజరాత్ చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు ఈ టీమ్ నేడు సొంత మైదానం చెపాక్‌లో లక్నో సూపర్ జెయింట్‌తో తలపడనుంది. 2019 తర్వాత చెన్నై తొలిసారిగా స్వదేశంలో ఐపీఎల్ మ్యాచ్ ఆడనుంది. ఇటువంటి పరిస్థితిలో విజయం సాధించేందుకు ప్రయత్నిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ఈ మ్యాచ్‌లో గెలిచి చెన్నై తన ఖాతా తెరవాలనుకుంటోంది. అదే సమయంలో లక్నో జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. ఈ జట్టు తమ విజయాల పరంపరను కొనసాగించడానికి ప్రయత్నిస్తుంది. అయితే చెన్నై అభిమానుల ముందు సీఎస్కేను ఓడించడం లక్నోకు అంత సులభం కాదు.
ఇరుజట్లు..
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, క్రునాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ (కీపర్), ఆయుష్ బడోని, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, అవేష్ ఖాన్.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, MS ధోని(కీపర్, కెప్టెన్), శివమ్ దూబే, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ఆర్‌ఎస్ హంగర్గేకర్.
LIVE Cricket Score & Updates
-
లక్నో ముందు భారీ లక్ష్యం..
ఇండియన్ ప్రీమియర్ లీగ్-16లో భాగంగా లక్నో సూపర్ జెయింట్‌తో జరుగుతున్న ఆరో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 218 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. చెపాక్ స్టేడియంలో లక్నో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 217 పరుగులు చేసింది. జట్టుకు ఓపెనర్లు తుఫాన్ ఆరంభాన్ని అందించారు. ఆఖరి ఓవర్లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. రితురాజ్ గైక్వాడ్ 31 బంతుల్లో 57 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. కాగా, డ్వేన్ కాన్వే 47 పరుగులు చేశాడు. శివమ్ దూబే 27 పరుగులు చేశాడు.
-
15 ఓవర్లకు చెన్నై స్కోర్..
చెన్నై 15 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. క్రీజులో మొయిన్ అలీ, బెన్ స్టోక్స్ ఉన్నారు.
27 పరుగుల వద్ద శివమ్ దూబే అవుటయ్యాడు. రితురాజ్ గైక్వాడ్ 57 పరుగులు చేసిన తర్వాత ఔట్ అయ్యాడు. గైక్వాడ్ 12వ హాఫ్ సెంచరీ చేయగా, ప్రస్తుత సీజన్‌లో అతనికిది వరుసగా రెండో అర్ధ సెంచరీ. 47 పరుగుల వద్ద డ్వేన్ కాన్వే అవుటయ్యాడు.
-
-
9 ఓవర్లకు చెన్నై స్కోర్..
9 ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై టీం వికెట్ నష్టపోకుండా 110 పరుగులు చేసింది. రుతురాజ్ 57, కాన్వే 40 పరుగులతో ఆడున్నారు.
-
6 ఓవర్లకు చెన్నై స్కోర్..
6 ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై టీం వికెట్ నష్టపోకుండా 79 పరుగులు చేసింది. రుతురాజ్ 46, కాన్వే 23 పరుగులతో ఆడున్నారు.
-
ఇరుజట్ల ప్లేయింగ్ XI..
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, క్రునాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ (కీపర్), ఆయుష్ బడోని, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, అవేష్ ఖాన్.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, MS ధోని(కీపర్, కెప్టెన్), శివమ్ దూబే, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ఆర్‌ఎస్ హంగర్గేకర్.
-
-
CSK vs LSG: టాస్ గెలిచిన లక్నో..
చెన్నైతో జరగనున్న కీలక మ్యాచ్‌లో లక్నో టీం టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై సేన ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
-
CSK vs LSG: చెపాక్‌లో ధోని రికార్డులు..
చెపాక్‌లో ధోనీ రికార్డు అద్భుతంగా ఉంది. ఇక్కడ 48 ఇన్నింగ్స్‌లు ఆడి 1363 పరుగులు చేశాడు. అలాగే 143.17 స్ట్రైక్ రేట్, 43.97 సగటుతో ఉన్నాడు. ధోనీ స్వదేశంలో ఏడు అర్ధ సెంచరీలు చేశాడు.
-
CSK vs LSG: 4 ఏళ్ల తర్వాత చెన్నైలో..
ఈ రోజు చెన్నై అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వారి అభిమాన జట్టు – చెన్నై సూపర్ కింగ్స్ 2019 తర్వాత తిరిగి సొంతమైదానంలో ఆడనుంది. చెన్నై జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ కూడా తిరిగి వస్తున్నాడు. దీంతో స్టేడియం మొత్తం పసుపు రంగులోకి మారిపోయింది. నేడు చెపాక్‌లోని వాతావరణం అంతా పసుపుమయమైంది. తొలి మ్యాచ్‌లో గెలిచిన లక్నో సూపర్ జెయింట్‌తో చెన్నై తలపడాల్సి ఉంది. కానీ చెన్నై అభిమానుల ముందు ఈ జట్టును ఓడించడం అంత సులభం కాదు.
-
CSK vs LSG: చెన్నైలో గెలవడం రాహుల్‌కు సవాలే..
లక్నో జట్టును గెలిపించుకోవడం కేఎల్ రాహుల్‌కు సవాల్‌గా మారింది. కారణం చెన్నై తన సొంత మైదానంలో ఆడుతోంది. చెన్నై అభిమానులను ఎదుర్కోవడం రాహుల్‌కు సవాలుగా మారింది. చెన్నై అభిమానులు ఏ ప్రత్యర్థి జట్టుకైనా మనోధైర్యాన్ని తగ్గించగలరు. ఇలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం రాహుల్‌కు సవాలుగా మారనుంది.
Published On - Apr 03,2023 6:34 PM




