IPL 2023: భారీ స్కోర్ చేసినా నిరాశే.. ఐపీఎల్ చరిత్రలో ఓడిన టాప్ 5 టీంలు ఇవే..
IPL Records: ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. రివైండ్‌లో భాగంగా అత్యధిక పరుగులు చేసిన తర్వాత కూడా ఓటమిని ఎదుర్కొన్న ఐదు మ్యాచ్‌లు, జట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
IPL Records: ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. IPL 16వ సీజన్ అంటే IPL 2023 మార్చి 31 నుంచి ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో రివైండ్‌లో భాగంగా అత్యధిక పరుగులు చేసిన తర్వాత కూడా ఓటమిని ఎదుర్కొన్న ఐదు మ్యాచ్‌లు, జట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ జాబితాలో మొదటి పేరు పంజాబ్ కింగ్స్ టీం నిలిచింది. 27 సెప్టెంబర్ 2020న, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రాజస్థాన్ రాయల్స్‌కి 224 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించింది. అయితే రాజస్థాన్ 4 వికెట్ల తేడాతో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.
ఈ జాబితాలో రెండో జట్టు పేరు చెన్నై సూపర్ కింగ్స్‌దే కావడం గమనార్హం. 1 మే 2021న ముంబైపై చెన్నై జట్టు 218 పరుగులు చేసింది. అయితే ముంబై మొత్తం 20 ఓవర్లలో 219 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో ఆ మ్యాచ్‌లో విజయం సాధించింది.
ఈ జాబితాలో డెక్కన్ ఛార్జర్స్(అంటే ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్) పేరు మూడో స్థానంలో ఉంది. 24 ఏప్రిల్ 2008న, ఈ జట్టు రాజస్థాన్ ముందు 215 పరుగుల లక్ష్యాన్ని అందించింది. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ జాబితాలో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ పేరు మరోసారి నాలుగో స్థానంలో నిలిచింది. 31 మార్చి 2022న లక్నో ముందు చెన్నై 211 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ జాబితాలో గుజరాత్ లయన్స్ పేరు ఐదవ స్థానంలో ఉంది. మార్చి 4, 2017న, ఢిల్లీ డేర్‌డెవిల్స్ ముందు గుజరాత్ లయన్స్ జట్టు 209 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఢిల్లీ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.