IPL 2025: ధోనికి షాకింగ్ న్యూస్.. ఐపీఎల్ 2025లో భారీగా పడిపోయిన శాలరీ.. లాస్ ఎంతంటే?
MS Dhoni Salary if Retained as Uncapped Player: మహేంద్ర సింగ్ ధోనీ, IPL చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్. ప్రతి సీజన్‌లోనూ ధోని భారీగానే జీతం తీసుకుంటున్నాడు. కానీ, వచ్చే సీజన్‌లో మాత్రం జీతంలో భారీ కోత పడనుంది.
MS Dhoni Salary if Retained as Uncapped Player: మహేంద్ర సింగ్ ధోనీ, IPL చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్. ప్రతి సీజన్‌లోనూ ధోని భారీగానే జీతం తీసుకుంటున్నాడు. కానీ, వచ్చే సీజన్‌లో మాత్రం జీతంలో భారీ కోత పడనుంది. నిజానికి, BCCI బహుశా దాని పాత నిబంధనలలో ఒకదాన్ని మళ్లీ అమలు చేయాలని యోచించడమే ఇందుకు కారణం. ఈ నియమం ప్రకారం, ఒక ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యి 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం గడిచినట్లయితే, అతను అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ల జాబితాలో లెక్కించబడతాడు. BCCI ఈ నియమం 2021 IPL వరకు వర్తిస్తుంది. కానీ, ఆ తర్వాత అది తీసివేశారు. అదే సమయంలో, ఇప్పుడు ఈ నియమం తిరిగి రావచ్చు అని అంటున్నారు.
BCCI మళ్లీ IPL 2025 కోసం ఈ నియమాన్ని అమలు చేస్తే , మహేంద్ర సింగ్ ధోనిని చెన్నై సూపర్ కింగ్స్ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా కొనసాగించవచ్చు. దీని వల్ల CSK టీం నుంచి ధోనికి తక్కువ డబ్బు వస్తుంది.
CSK మాజీ కెప్టెన్ జీతంలో భారీగా తగ్గుదల..
2022 ఐపీఎల్ సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఒక్కో సీజన్‌కు రూ. 12 కోట్ల చొప్పున ధోనీని అట్టిపెట్టుకుంది. అయితే, అతను అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రిటైన్ చేస్తే, అతని జీతం ఒక్కో సీజన్‌కు రూ. 4 కోట్లు అవుతుంది. ఇది ఐపీఎల్‌లో అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు ఇస్తున్న జీతం అన్నమాట. ఈ కారణంగా, ధోనీ నేరుగా సీజన్‌కు మూడు సార్లు అంటే రూ. 8 కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది.
ఎంఎస్ ధోని రూ. 15 కోట్ల రూపాయల రెమ్యునరేషన్..
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు ఛాంపియన్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించిన భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, 2008 ఐపీఎల్‌లో తొలిసారిగా సీఎస్‌కే ఫ్రాంచైజీతో సీజన్‌కు రూ. 6 కోట్ల జీతంతో చేరాడు. ఆపై అతను ఈ జట్టుకు కెప్టెన్‌గా మారాడు. తన నైపుణ్యంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడు. 2018, 2021 మధ్యకాలంలో ధోనీ CSK నుంచి అత్యధిక వేతనాన్ని అందుకున్నాడు. అతనికి ఒక్కో సీజన్‌కు రూ.15 కోట్లు ఇచ్చారు.
IPL 2024కి ముందు ధోని CSK కెప్టెన్సీని విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. దీని కారణంగా ఫ్రాంచైజీ రుతురాజ్ గైక్వాడ్‌ను జట్టుకు కొత్త కెప్టెన్‌గా నియమించింది. అయితే రుతురాజ్ సారథ్యంలో చెన్నై జట్టు ప్లేఆఫ్‌కు కూడా చేరుకోలేకపోయింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..