AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: పంజాబ్‌పై ఓటమి.. డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్తున్న ధోనిని ఆపి మాట్లాడిన CSK ఓనర్‌! ధోని అవసరం లేదంటూ..

ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన, ప్లేఆఫ్స్‌కు చేరలేకపోవడం, ధోని భవిష్యత్తు, జట్టు తీసుకోవాల్సిన చర్యల గురించి ధోనితో సీఎస్కే సీఈఓ మాట్లాడారు. రుతురాజ్ గాయం, ధోని కెప్టెన్సీ, సీఎస్కే యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలపై షాన్ పొలాక్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అవేంటంటే..?

IPL 2025: పంజాబ్‌పై ఓటమి.. డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్తున్న ధోనిని ఆపి మాట్లాడిన CSK ఓనర్‌! ధోని అవసరం లేదంటూ..
Dhoni With Csk Ceo
SN Pasha
|

Updated on: May 01, 2025 | 1:30 PM

Share

ఐపీఎల్‌ 2025లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫేలవ ప్రదర్శన కొనసాగుతోంది. బుధవారం చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సీఎస్‌కే ఓటమి పాలైంది. రెగ్యులర్‌ కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ గాయంతో జట్టుకు దూరమవ్వడంతో ధోని కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. ధోని కెప్టెన్‌ అవ్వడంతో సీఎస్‌కే తలరాత మారుతుందని ఆశపడిన సీఎస్‌కే అభిమానులకు నిరాశే ఎదురైంది. ధోని కెప్టెన్సీలో కూడా సీఎస్‌కే ప్రదర్శన ఏం మారలేదు. ఇక పంజాబ్‌పై ఎదురైన ఓటమితో సీఎస్‌కే అధికారికంగా ఐపీఎల్‌ ప్లే ఆఫ్‌ రేసు నుంచి తప్పుకుంది. ఐపీఎల్‌ 2025 నుంచి ఎలిమినేట్‌ అయిన తొలి టీమ్‌గా చెత్త రికార్డును సీఎస్‌కే సొంతం చేసుకుంది. అయితే పంజాబ్‌పై ఓటమి తర్వాత సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథ్‌.. గ్రౌండ్‌లో ధోనితో మాట్లాడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

మ్యాచ్‌ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్తున్న ధోనిని ఆపి మరీ బౌండరీ లైన్‌ వద్ద మాట్లాడంతో అందరికీ లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఓనర్‌ సంజీవ్‌ గోయెంకా గుర్తుకు వచ్చారు. సీఎస్‌కే ఓటములకు ధోనిని బాధ్యుడిని చేసి, గ్రౌండ్‌లోనే చివాట్లు పెడతారేమో అని అంతా భయపడ్డారు. కానీ, ధోనికి, సీఎస్‌కే ఓనర్‌ నవ్వుతూ మాట్లాడుకోవడం అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పటికే మెగా వేలంలో సరైన స్ట్రాటజీ ఉపయోగించలేదని ఫిక్స్‌ అయిపోయిన సీఎస్‌కే ఓనర్లు.. ఆ విషయాన్ని ఇక పదే పదే మాట్లాడదల్చుకోలేదని వాళ్లను చూస్తే అర్థం అవుతుంది. అయినా.. ఐదు సార్లు ఛాంపియన్‌, అత్యధిక సార్లు ప్లే ఆఫ్స్‌కు వెళ్లిన టీమ్‌కు.. ఒకటి రెండు సీజన్లు బ్యాడ్‌గా వెళ్తే పెద్ద నష్టమేమి లేదని సీఎస్‌కే ఫ్యాన్స్‌ కూడా అంటున్నారు. ఈ క్రమంలోనే సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌ షాన్‌ పొలాక్‌ ధోని గురించి షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో ధోని ఆడతాడని తాను అనుకోవడం లేదని అన్నాడు.

అయినా.. సీఎస్‌కేకు ఇక ధోని అవసరం లేదని, రుతురాజ్‌ గైక్వాడ్‌ కెప్టెన్సీలో వచ్చే సీజన్‌లో సీఎస్‌కే పటిష్టంగా బరిలోకి దిగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ధోని ఇప్పటికే చాలా సాధించాడు, అతను కొత్తగా చేయాల్సిందేం లేదు. అయినా సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌ ధోనికి కావాల్సినంత ఫ్రీడమ్‌ ఇచ్చారు. ఎంత కాలం కావాలంటే అంత కాలం ఆడుకోవచ్చు అనే ఒక నమ్మకం వాళ్లు ఇచ్చారు. కానీ, ధోనికి తెలుసు ఎప్పుడు తప్పుకోవాలో అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ధోని వయసు 43 ఏళ్లు. అయినా కూడా ఇప్పటికీ సీఎస్‌కే కోసం తన వంత ప్రయత్నం చేస్తున్నాడు. కానీ, బ్యాడ్‌లక్‌ ఏంటంటే.. వాళ్లకు ఏదీ కలిసి రావడం లేదు. మరి చూడాలి.. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో సీఎస్‌కే ఎలా ఆడుతుంది? ధోని రిటైర్మెంట్‌పై ప్రకటన చేస్తాడా లేడా? అన్నది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి