లార్డ్స్: ఆతిధ్య ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు ఆదివారం లార్డ్స్ వేదికగా వరల్డ్‌కప్ 2019 ఫైనల్‌లో తలబడనున్నాయి. సెమీస్‌లో భారత్‌ను ఓడించి కివీస్.. ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లాండ్ ఫైనల్‌కు చేరుకున్నాయి. ఇరు జట్లలో ఎవరు గెలిచినా.. వారు తొలిసారి విశ్వవిజేతలుగా నిలవనున్నారు. ఇది ఇలా ఉండగా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన కేన్ విలియమ్సన్, జానీ బెయిర్‌స్టోలు ఫైనల్‌లో ప్రత్యర్థులుగా తలబడనున్నారు. ఇకపోతే ఇరు జట్లకు వాళ్ళు కీలక ఆటగాళ్లు కాగా.. లీగ్ స్టేజిలో ఈ ప్లేయర్స్ అద్భుతమైన ఆటతీరు కనబరిచారు.
కాగా, సొంతగడ్డపై జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో ఎలాగైనా కప్పు గెలవాలని మోర్గాన్ నేతృత్వంలో ఇంగ్లాండ్ జట్టు కసి మీద ఉండగా.. 2015 వరల్డ్‌కప్ ఫైనల్‌లో జరిగిన తప్పిదాలను పునరావృతం చేయవద్దని కివీస్ భావిస్తోంది.