క్రికెటర్‌పై 20 ఏళ్ల నిషేధం.. అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

|

Sep 19, 2024 | 6:57 PM

Dulip Samaraweera Banned from Coaching in Australia: ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ జట్టు రెండు టెస్టుల సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టుకు ఆతిథ్యం ఇస్తోంది. సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ గాలె వేదికగా జరుగుతోంది. ఇదిలా ఉంటే శ్రీలంక జట్టు అభిమానులకు ఓ చేదువార్త వచ్చింది. నిజానికి, శ్రీలంక మాజీ క్రికెటర్ దలీప్ సమరవీరపై 20 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఎలాంటి పదవిని చేపట్టకుండా నిషేధం విధించారు .

క్రికెటర్‌పై 20 ఏళ్ల నిషేధం.. అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Dulip Samaraweera Banned
Follow us on

Dulip Samaraweera Banned from Coaching in Australia: ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ జట్టు రెండు టెస్టుల సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టుకు ఆతిథ్యం ఇస్తోంది. సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ గాలె వేదికగా జరుగుతోంది. ఇదిలా ఉంటే శ్రీలంక జట్టు అభిమానులకు ఓ చేదువార్త వచ్చింది. నిజానికి, శ్రీలంక మాజీ క్రికెటర్ దలీప్ సమరవీరపై 20 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఎలాంటి పదవిని చేపట్టకుండా నిషేధం విధించారు .

దులీప్ సమరవీరపై 20 ఏళ్ల నిషేధం..

సమరవీర తన పదవీ కాలంలో CA ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు దోషిగా తేలాడు. తన పదవీకాలంలో మహిళా క్రీడాకారిణితో అసభ్యంగా ప్రవర్తించాడు. CA సమగ్రత విభాగం విచారణ తర్వాత, అతను 20 సంవత్సరాల పాటు నిషేధించబడ్డాడు.

తన అంతర్జాతీయ కెరీర్‌లో, దులీప్ సమరవీర 1993, 1995 మధ్య శ్రీలంక తరపున ఏడు టెస్టులు, ఐదు వన్డేలు ఆడాడు. చాలాకాలం పాటు మహిళల బిగ్ బాష్ లీగ్‌లో విక్టోరియా, మెల్‌బోర్న్ జట్లకు అసిస్టెంట్ కోచ్‌గా ఉన్నాడు. సంవత్సరం ప్రారంభంలో విక్టోరియా మహిళల జట్టుకు ప్రధాన కోచ్‌గా కూడా మారాడు. అయితే, అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో రెండు నెలల్లో రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

CA ప్రవర్తనా నియమావళిలోని సెక్షన్ 2.23ని ఉల్లంఘిస్తూ సమరవీర అనుచితంగా ప్రవర్తించారని CA కమిషన్ గుర్తించింది. ప్రవర్తన ఒక ఆటగాడితో ముడిపడి ఉందని నివేదించారు. సమరవీర ప్రవర్తనను ఖండిస్తూ క్రికెట్ విక్టోరియా సీఈవో నిక్ కమిన్స్ ఒక ప్రకటన విడుదల చేశారు.

కమిన్స్ మాట్లాడుతూ, ‘దలీప్ సమరవీరపై 20 ఏళ్ల నిషేధం విధించిన ప్రవర్తనా నియమావళి కమిషన్ ఈ రోజు తీసుకున్న నిర్ణయానికి మేం మద్దతు ఇస్తున్నాం. ఈ ప్రవర్తన పూర్తిగా ఖండించదగినది అంటూ తెలిపాడు.

ఈ కేసులో బాధితురాలు ధైర్యంగా మాట్లాడిందని ఆయన అన్నారు. ఆమె మైదానంలో, వెలుపల తన లక్ష్యాలను సాధించడంలో మా నిరంతర మద్దతును పొందుతూనే ఉంటుందని తెలిపాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..