అంతర్జాతీయ క్రికెట్‌కు క్రిస్ గేల్ గుడ్ బై!
వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్‌బై చెప్పాడు. టీమిండియాతో జరిగే హోం టెస్ట్ సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు గేల్ ప్రకటించాడు. ఐసీసీ ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌కి గుడ్ బై చెబుతానని గేల్ గతంలోనే ప్రకటించాడు. అయితే తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు గేల్ ప్రకటించాడు. ఒక మంచి ఫేర్ వెల్ సిరీస్ లభించాలనే ఉధ్దేశంతోనే టీం ఇండియా సిరీస్ తర్వాత రిటైర్ కావాలని గేల్ భావిస్తున్నట్లు […]
వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్‌బై చెప్పాడు. టీమిండియాతో జరిగే హోం టెస్ట్ సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు గేల్ ప్రకటించాడు. ఐసీసీ ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌కి గుడ్ బై చెబుతానని గేల్ గతంలోనే ప్రకటించాడు. అయితే తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు గేల్ ప్రకటించాడు. ఒక మంచి ఫేర్ వెల్ సిరీస్ లభించాలనే ఉధ్దేశంతోనే టీం ఇండియా సిరీస్ తర్వాత రిటైర్ కావాలని గేల్ భావిస్తున్నట్లు సమాచారం.
జమైకాలోని కింగ్స్‌స్టన్‌లో పుట్టిన గేల్ 1999లో అంతర్జాతీయ జట్టులోకి ఆరంగేట్రం చేశాడు. టీం ఇండియాతో జరిగిన వన్డే మ్యాచ్‌తో తాను క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. తన కెరీర్‌లో 103 టెస్టులు, 295 వన్డేలు, 58 టీ-20 మ్యాచులు ఆడాడు. టెస్టుల్లో 7,214, వన్డేల్లో 10,345, టెస్టుల్లో 1,627 పరుగులు చేశాడు. తన విధ్వంసకరమైన బ్యాటింగ్‌తో గేల్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. కాగా, వెస్టిండీస్ ఆగస్టులో టీం ఇండియాతో మూడు టీ-20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. వెస్టిండీస్, అమెరికాలో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి.