CSK vs RR, IPL 2024: రాజస్థాన్‌ను చిత్తు చేసిన చెన్నై.. మెరుగైన ప్లే ఆఫ్ అవకాశాలు

Chennai Super Kings vs Rajasthan Royals: టోర్నీప్రారంభంలో అదరగొట్టిన రాజస్థాన్ రాయల్స్ క్రమంగా తడబడుతోంది. తాజాగా చెన్నైతో జరిగిన మ్యాచ్ లోనూ సంజూశామ్సన్ సేన 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. రాజస్థాన్ జట్టుకు ఇది వరుసగా మూడో పరాజయం.

CSK vs RR, IPL 2024: రాజస్థాన్‌ను చిత్తు చేసిన చెన్నై.. మెరుగైన ప్లే ఆఫ్ అవకాశాలు
Chennai Super Kings vs Rajasthan Royals

Updated on: May 12, 2024 | 7:52 PM

Chennai Super Kings vs Rajasthan Royals: టోర్నీప్రారంభంలో అదరగొట్టిన రాజస్థాన్ రాయల్స్ క్రమంగా తడబడుతోంది. తాజాగా చెన్నైతో జరిగిన మ్యాచ్ లోనూ సంజూశామ్సన్ సేన 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. రాజస్థాన్ జట్టుకు ఇది వరుసగా మూడో పరాజయం. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. కానీ కెప్టెన్ పెట్టుకున్న నిర్ణయాన్ని ఆ జట్టు బ్యాటర్లు వమ్ము చేశారు. రియాన్ పరాగ్ 35 బంతుల్లో 3 సిక్సర్లు, ఒక ఫోర్ సాయంతో అజేయంగా 47 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతను మినహా మిగిలిన బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయకపోవడంతో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 18.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. కెప్టెన్‌ రుతురాజ్ గైక్వాడ్‌ (42 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. రచిన్ రవీంద్ర (27), డారిల్ మిచెల్‌ (22), శివమ్ దుబే (18) ఓ మోస్తరుగా రాణించగా, మొయిన్‌ (10), జడేజా (5) నిరాశ పరిచారు. రిజ్వీ 15 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. రాజస్థాన్ బౌలర్లలో అశ్విన్‌ 2 వికెట్లు పడగొట్టగా, బర్గర్‌, చాహల్‌ చెరో వికెట్ తీశారు.

కెప్టెన్ రుతురాజ్ విన్నింగ్ షాట్..

ఇరు జట్లు:

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(కీపర్), శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, సిమర్‌జీత్ సింగ్, మహేశ్ తీక్షణ.

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్, కీపర్), రియాన్ పరాగ్, శుభమ్ దూబే, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజువేంద్ర చాహల్.

రెండు జట్లకు ఇంపాక్ట్ ప్లేయర్లు..

రాజస్థాన్ రాయల్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు: రోవ్‌మన్ పావెల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, నాంద్రే బర్గర్, తనుష్ కోటియన్, కేశవ్ మహారాజ్.

చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు: అజింక్యా రహానే, సమీర్ రిజ్వీ, ప్రశాంత్ సోలంకి, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..