IPL 2026 Auction: కామెరాన్ గ్రీన్‌ వద్దు.. ఆ ముగ్గురే ముద్దు.. వేలానికి ముందే హింటిచ్చిన చెన్నై..

ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ కోసం అన్ని జట్లు పోటీ పడే అవకాశం ఉంది. కానీ, సీఎస్‌కే విడుదల చేసిన వీడియోలో మస్కట్ 'పచ్చి కూరగాయలు, పచ్చి మిరపకాయలను' పక్కన పెట్టి ముందుకు వెళ్తుంది. దీన్ని బట్టి సీఎస్‌కే గ్రీన్ కోసం పోటీ పడకపోవచ్చని, అతని కోసం భారీ మొత్తం వెచ్చించడానికి సిద్ధంగా లేదని అభిమానులు భావిస్తున్నారు.

IPL 2026 Auction: కామెరాన్ గ్రీన్‌ వద్దు.. ఆ ముగ్గురే ముద్దు.. వేలానికి ముందే హింటిచ్చిన చెన్నై..
Csk Ipl 2026

Updated on: Dec 11, 2025 | 2:11 PM

IPL 2026 Auction: ఐపీఎల్ 2026 మినీ వేలానికి (Auction) సమయం ఆసన్నమవుతుండటంతో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తన వ్యూహాలను సోషల్ మీడియా వేదికగా చెప్పకనే చెప్పింది. తాజాగా సీఎస్‌కే తన మస్కట్ ‘లియో’ (Leo)తో కూడిన ఒక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో వేలంలో తమ టార్గెట్లు ఎవరో సింబాలిక్‌గా చూపించారు.

కామెరాన్ గ్రీన్‌పై ఆసక్తి లేదా?

ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ కోసం అన్ని జట్లు పోటీ పడే అవకాశం ఉంది. కానీ, సీఎస్‌కే విడుదల చేసిన వీడియోలో మస్కట్ ‘పచ్చి కూరగాయలు, పచ్చి మిరపకాయలను’ పక్కన పెట్టి ముందుకు వెళ్తుంది. దీన్ని బట్టి సీఎస్‌కే గ్రీన్ కోసం పోటీ పడకపోవచ్చని, అతని కోసం భారీ మొత్తం వెచ్చించడానికి సిద్ధంగా లేదని అభిమానులు భావిస్తున్నారు.

సీఎస్‌కే టార్గెట్ ఆ ముగ్గురేనా?

వీడియోలో మస్కట్ మూడు వస్తువులను ఎంచుకుంది. వాటి అర్థాలు ఇలా ఉండే అవకాశం ఉంది:

ఇవి కూడా చదవండి

కాశ్మీరీ యాపిల్స్ (Kashmiri Apples): మస్కట్ కాశ్మీరీ యాపిల్స్ తీసుకుంది. దీన్ని బట్టి జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఆటగాడిని సీఎస్‌కే టార్గెట్ చేసిందని తెలుస్తోంది. అతను ఉమ్రాన్ మాలిక్ లేదా అబ్దుల్ సమద్ అయ్యే అవకాశం ఉంది.

మిక్చర్ (Mixture): తమిళనాడు ప్రసిద్ధ స్నాక్ అయిన మిక్చర్‌ను ఎంచుకుంది. ఇది తమిళనాడుకు చెందిన స్థానిక ఆటగాడిని (లోకల్ బాయ్) సూచిస్తోంది. బహుశా వాషింగ్టన్ సుందర్, టి. నటరాజన్ లేదా షారుఖ్ ఖాన్ వంటి వారిపై సిఎస్‌కే కన్నేసి ఉండవచ్చు.

కీవీ పండు (Kiwi Fruit): చివరగా కీవీ పండును తీసుకుంది. క్రికెట్ పరిభాషలో ‘కీవీ’ అంటే న్యూజిలాండ్ ఆటగాళ్లు. దీన్ని బట్టి తమ మాజీ ఓపెనర్లు డెవాన్ కాన్వే లేదా రచిన్ రవీంద్రలను తిరిగి కొనుగోలు చేయడానికి లేదా కేన్ విలియమ్సన్ వంటి సీనియర్ ప్లేయర్ కోసం సిఎస్‌కే ప్రయత్నించవచ్చని అర్థమవుతోంది.

డిసెంబర్ 16న వేలం:

మొత్తానికి సీఎస్‌కే రూ. 43.40 కోట్ల పర్స్‌తో వేలానికి వెళ్తోంది. డిసెంబర్ 16న అబుదాబిలో జరగనున్న వేలంలో ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.