Video: 6,6,6,6,6,6,6.. 39 సిక్సర్లు, 14 ఫోర్లు.. టీ20 క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ.. భారత బ్యాటర్ బీభత్సం చూశారా?
ఇప్పుడు చెప్పబోయే ఆటగాడు భారతదేశానికి చెందినవాడు. అతను టీ20 క్రికెట్‌లోనే 300 పరుగులు చేశాడు. భారత బ్యాట్స్‌మన్ మోహిత్ అహ్లావత్ 2017లో జరిగిన టీ20 మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్‌లో అతను టీ20 క్రికెట్‌లో విధ్వంసం సృష్టించాడు. 39 సిక్సర్లు, 14 ఫోర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో బౌలర్లు భారత బ్యాటర్ ముందు తేలిపోయారు.

క్రికెట్ ప్రపంచంలో, ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో పరుగుల వరద పారడం మనం చూస్తూనే ఉంటాం. కానీ, తాజాగా జరిగిన ఒక మ్యాచ్‌లో నమోదైన గణాంకాలు చూస్తే క్రీడాభిమానులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే, ఆ మ్యాచ్‌లో 20 ఓవర్లలో ఒక జట్టు ఏకంగా 416 పరుగులు చేసింది. అంతకంటే మరో విశేషం ఏమిటంటే, ఈ మ్యాచ్‌లో ఒకే ఒక్క బ్యాటర్ 300 పరుగుల మైలురాయిని దాటేయడం గమనార్హం.
వీడియో గేమ్ తరహాలో బ్యాటింగ్.. ఒక్కడే 300 పరుగులు..
ఇప్పుడు చెప్పబోయే ఆటగాడు భారతదేశానికి చెందినవాడు. అతను టీ20 క్రికెట్‌లోనే 300 పరుగులు చేశాడు. భారత బ్యాట్స్‌మన్ మోహిత్ అహ్లావత్ 2017లో జరిగిన టీ20 మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్‌లో అతను టీ20 క్రికెట్‌లో విధ్వంసం సృష్టించాడు. 39 సిక్సర్లు, 14 ఫోర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో బౌలర్లు భారత బ్యాటర్ ముందు తేలిపోయారు.
మావి XI వర్సెస్ ఫ్రెండ్స్ 11 మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్బుతం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో, 21 ఏళ్ల మోహిత్ అహ్లావత్ ట్రిపుల్ సెంచరీ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ టీ20 మ్యాచ్ ఢిల్లీలో జరిగిన స్థానిక క్రికెట్ టోర్నమెంట్‌లో జరిగింది.
ఫ్రెండ్స్ 11తో జరిగిన మ్యాచ్‌లో మోహిత్ అహ్లావత్ 72 బంతుల్లో 300 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో, మోహిత్ అహ్లావత్ కేవలం సిక్సర్ల ద్వారానే 234 పరుగులు చేశాడు. 56 పరుగులు ఫోర్ల ద్వారా వచ్చాయి. అంటే, తన పరుగులలో ఎక్కువ భాగం సిక్సర్ల ద్వారానే సాధించాడు.
మోహిత్ అహ్లావత్ అద్భుతమైన ఇన్నింగ్స్..
మావి ఎలెవెన్ ఈ T20 మ్యాచ్‌లో 20 ఓవర్లలో 416 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా ఫ్రెండ్స్ 11 జట్టు 216 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఆ జట్టు ఘోర పరాజయాన్ని ఎదుర్కోవలసి వచ్చింది.
రిషబ్ పంత్‌తో కలిసి రంజీ ట్రోఫీ బరిలో మోహిత్ అహ్లావత్..
రికార్డు సృష్టించిన టీ20 క్రికెట్ ఆటగాడు మోహిత్ అహ్లవత్ గురించి మాట్లాడితే, అతను భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌తో కలిసి రంజీ ట్రోఫీలో ఆడాడు. పంత్ కంటే ముందు రంజీ ట్రోఫీలో ఆడే అవకాశం అతనికి లభించింది. కానీ, అతని కెరీర్ ముందుకు సాగలేదు. ఆర్థిక పరిమితులు దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో..
గతంలో, టీ20 క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (175* ఐపీఎల్‌లో) పేరిట ఉండేది. అంతర్జాతీయ టీ20లలో ఆరోన్ ఫించ్ (172) పేరిట ఉంది. అలాగే, ఇటీవలే నేపాల్ జట్టు అంతర్జాతీయ టీ20లో 314 పరుగులు చేసి రికార్డు సృష్టించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




