AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli : విరాట్-అనుష్కకు పాములను వడ్డించిన చెఫ్.. అసలు విషయం తెలిసి షాకైన అభిమానులు!

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల పెళ్లి రోజు కోసం వారి ప్రైవేట్ చెఫ్ హర్ష్ దీక్షిత్ ఒక ఆసక్తికరమైన వంటకం తయారు చేశారు. వీగన్‌లైన ఈ జంటకు పాములను పోలి ఉండే పొట్లకాయతో వియత్నామీస్ వంటకం ఫోని వడ్డించారు. ఇది వారికి చాలా నచ్చిందని చెఫ్ వెల్లడించారు. ఈ ప్రత్యేకమైన ఆలోచనతో వారి పెళ్లి రోజు డిన్నర్‌ను మరచిపోలేనిదిగా మార్చారు.

Virat Kohli : విరాట్-అనుష్కకు పాములను వడ్డించిన చెఫ్.. అసలు విషయం తెలిసి షాకైన అభిమానులు!
Virat Kohli
Rakesh
|

Updated on: Aug 08, 2025 | 9:24 AM

Share

Virat Kohli : విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతుల ఆహారపు అలవాట్ల గురించి అందరికీ తెలిసిందే. దాదాపు పదేళ్లుగా వాళ్లు కఠినంగా వీగన్ డైట్ పాటిస్తున్నారు. కోహ్లీ తన అద్భుతమైన ఆటతీరుకు తన వీగన్ డైటే కారణమని చెబుతుంటారు. అనుష్క కూడా ఆరోగ్యకరమైన ఆహారం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి ఎప్పటినుంచో చెబుతున్నారు. అలాంటి ఈ సెలబ్రిటీల కోసం ఒక స్పెషల్ డిన్నర్ తయారు చేయాలంటే ఒక ప్రైవేట్ చెఫ్‌కి పెద్ద సవాలే. ప్రముఖ ప్రైవేట్ చెఫ్ హర్ష్ దీక్షిత్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ జంట కోసం వంట చేయడం గురించి, ముఖ్యంగా వారి పెళ్లి రోజున పాములను వడ్డించడం గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మలు దాదాపు పదేళ్లుగా కఠినమైన వీగన్ డైట్‌ను పాటిస్తున్నారు. వీళ్లు తమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి వీగన్ ఫుడ్ కావాలని కోరారు. అయితే, ఆ సమయంలో వారికి వంట చేసిన షెఫ్ హర్ష్ దీక్షిత్ కు ఒక సవాలు ఎదురైంది. అసలు ఏం జరిగింది, ఆ షెఫ్ ఏం చేశాడనేది ఇప్పుడు తెలుసుకుందాం.

అనుష్క శర్మ, విరాట్ కోహ్లీలు 2019లో వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఒక ప్రైవేట్ డిన్నర్ కోసం వారిని కలిసినప్పుడు, వారికి ప్రత్యేకంగా వంట చేయాల్సిన షెఫ్ హర్ష్ దీక్షిత్‌కు ఒక సవాలు ఎదురైంది. సాధారణంగా ఫిష్ లేదా చికెన్‌తో చేసే ఫో అనే డిష్‌ను హర్ష్ దీక్షిత్ తయారు చేయాలనుకున్నాడు. కానీ అనుష్క, విరాట్ వీగన్స్ కాబట్టి వారికి చికెన్ లేదా బీఫ్ వేయడం సాధ్యం కాదు. దీనికి తోడు వియత్నాం వంటకాల్లో పాము మాంసం, పాము వైన్ ఎక్కువగా వాడతారు. ఈ విషయం గుర్తించిన హర్ష్ ఒక ఫన్నీ ఐడియా ఆలోచించాడు. వీగన్లకు పాములను ఎలా వడ్డించాలా అని ఆలోచించి పొట్లకాయతో ఫో తయారు చేశాడు.

హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్ష్ మాట్లాడుతూ.. “అనుష్క, విరాట్ వివాహ వార్షికోత్సవం కోసం నేను ఫో తయారు చేశాను. ఫో అంటే సంప్రదాయబద్ధంగా చికెన్ లేదా బీఫ్ తో తయారు చేస్తారు, కానీ వారు వీగన్స్ కాబట్టి పొట్లకాయతో ఫో తయారు చేశాను. డిష్‌ను రుచికరంగా చేస్తూనే, వారి ఆహార నియమాలను కూడా పాటించడం అనేది ఒక మంచి ఆలోచన. ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడమే ఒక ప్రైవేట్ షెఫ్ పని” అని చెప్పాడు.

అనుష్క, విరాట్‌కు వంట చేయమని తనకు చాలా తక్కువ సమయంలో కాల్ వచ్చిందని హర్ష్ చెప్పాడు. “అవార్డు ఫంక్షన్‌కు కొన్ని గంటల ముందు కాల్ వచ్చింది. మెనూ తయారు చేసి పంపాను. వారి వార్షికోత్సవం బుధవారం రాత్రి కావడంతో బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు కన్ఫర్మేషన్ వచ్చింది” అని హర్ష్ వివరించాడు.

హర్ష్ దీక్షిత్ వారికి ఐదు కోర్సుల వీగన్ డిన్నర్‌ను వారి ఇంట్లోనే ప్రైవేట్‌గా ఏర్పాటు చేశాడు. ఈ అవకాశం తనకు ప్రొఫెషనల్‌గా ఒక పెద్ద విజయమని, బయట రెస్టారెంట్లలో స్వేచ్ఛగా తినలేని క్రీడాకారులకు ఇలాంటి పర్సనలైజ్డ్ డైనింగ్ సేవలు అందించడం చాలా ముఖ్యమని హర్ష్ పేర్కొన్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..