AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champions Trophy 2025: 8 ఏళ్ళ తరువాత జరుగుతున్న మెగా టోర్నీ రూల్స్ ఇవే! మీకు గుర్తున్నాయా?

2025 ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే క్రికెట్‌ను మరింత ఆసక్తికరంగా మార్చనుంది. పాకిస్తాన్ ఈ మెగా టోర్నమెంట్‌ను నిర్వహిస్తుండగా, భారతదేశం తన మ్యాచ్‌లను యుఎఇలో ఆడనుంది. ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి సెమీ-ఫైనల్ బెర్త్ కోసం పోటీపడతాయి. టై బ్రేకింగ్ నిబంధనలతో పాటు, ఆసక్తికరమైన మ్యాచ్‌ల కారణంగా ఈ టోర్నమెంట్ క్రికెట్ అభిమానులకు గొప్ప అనుభూతిని అందించనుంది. 

Champions Trophy 2025: 8 ఏళ్ళ తరువాత జరుగుతున్న మెగా టోర్నీ రూల్స్ ఇవే! మీకు గుర్తున్నాయా?
Icc Champions Trophy
Narsimha
|

Updated on: Feb 17, 2025 | 8:50 PM

Share

ఒక్కో ఐసీసీ టోర్నమెంట్ క్రికెట్ అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని తెస్తుంది. 2017 తర్వాత తిరిగి 2025లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం క్రికెట్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ వన్డే ఫార్మాట్ టోర్నమెంట్‌లో ఎనిమిది అత్యుత్తమ జట్లు పోటీపడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ పాకిస్తాన్ ఈసారి ఈ మెగా ఈవెంట్‌ను ఆతిథ్యం ఇస్తోంది.

భారతదేశం దుబాయ్‌లో మ్యాచ్‌లు, ప్రారంభ తేదీలు:

ఈ టోర్నమెంట్ 2025 ఫిబ్రవరి 19న కరాచీలో పాకిస్తాన్ vs న్యూజిలాండ్ మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. భారత జట్టు తన మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో దుబాయ్‌లో ఆడనుంది. భారతదేశం తన అన్ని మ్యాచ్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో ఆడుతుండటం విశేషం.

టోర్నమెంట్ ఫార్మాట్ & గ్రూప్‌లు

2006లో ఎనిమిది జట్లు పాల్గొన్నప్పటి నుండి ఛాంపియన్స్ ట్రోఫీ ఫార్మాట్ పెద్దగా మారలేదు. జట్లను రెండు గ్రూపులుగా విభజించారు: గ్రూప్ Aలో: పాకిస్తాన్, భారతదేశం, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు ఉండగా, గ్రూప్ Bలో: ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి. ప్రతి జట్టు తమ గ్రూప్‌లోని ఇతర మూడింటి జట్లతో ఒకసారి తలపడుతుంది. గ్రూప్ దశ ముగిసిన తర్వాత, టాప్-2 జట్లు సెమీ-ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.

పాయింట్ల లెక్కింపు & సమాన పాయింట్ల కేసులు

ప్రతి విజయానికి 2 పాయింట్లు జట్టుకు లభిస్తాయి. ఒక వేళా మ్యాచ్ రద్దు లేదా టై అయితే జట్టుకు 1 పాయింట్ అందుతుంది.

ఒకే సంఖ్యలో పాయింట్లు సాధించిన జట్ల అర్హతను నిర్ణయించే నియమాలు ఈ విధంగా ఉంటుంది. ఎక్కువ విజయాలు సాధించిన జట్టు ముందు ఉంటుంది. సమాన విజయాలు ఉన్న జట్లలో, నికర రన్ రేట్ (NRR) ఆధారంగా ర్యాంకింగ్ నిర్ణయించబడుతుంది. ఈ రూల్ కూడా సమానంగా వస్తే, హెడ్-టు-హెడ్ ఫలితాన్ని పరిగణించబడుతుంది. పైనివన్నీ సరిపోకపోతే, అసలు గ్రూప్ సీడింగ్ ఆధారంగా జట్ల ర్యాంకింగ్ నిర్ణయించబడుతుంది.

సెమీఫైనల్ మ్యాచ్లు:

సెమీఫైనల్1: గ్రూప్ A లో టాప్ జట్టు vs గ్రూప్ B లో రెండో జట్టు సెమీఫైనల్2: గ్రూప్ B లో టాప్ జట్టు vs గ్రూప్ A లో రెండో జట్టు

భారతదేశం సెమీ-ఫైనల్‌కు అర్హత సాధిస్తే, మార్చి 4న దుబాయ్‌లో మ్యాచ్ ఆడనుంది. పాకిస్తాన్ సెమీ-ఫైనల్‌కు చేరితే, మార్చి 5న లాహోర్‌లో ఆడుతుంది.

పీక వేళ మ్యాచ్ టైగా ముగిస్తే, జట్లు సూపర్ ఓవర్ ఆడతాయి. సూపర్ ఓవర్ కూడా టై అయితే, గ్రూప్ దశలో ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టే ఫైనల్‌కు అర్హత పొందుతుంది. ఏదైనా అకాల వర్షం వల్ల మ్యాచ్ పూర్తిగా రద్దయితే కూడా, గ్రూప్ దశ టాప్ జట్టే ముందుకు వెళ్తుంది.

2025 ఛాంపియన్స్ ట్రోఫీ మరింత రసవత్తరంగా సాగనుంది. పాకిస్తాన్ హోస్టింగ్ చేయడం, భారతదేశం యుఎఇలో మ్యాచ్‌లు ఆడటం, గ్రూప్ దశలో ఆసక్తికరమైన పోటీలు క్రికెట్ అభిమానులకు మజాను పంచనున్నాయి. టోర్నమెంట్‌ను గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకునే జట్టు ఎవరో చూడాలి!

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..