
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ గా టీమిండియా మాజీ కెప్టెన్, లెజెండరీ ప్లేయర్ సౌరవ్ గంగూలీ అగ్ర స్థానంలో ఉన్నాడు. ఈ మినీ వరల్డ్ కప్ లో దాదా మొత్తం 13 మ్యాచ్‌లలో 11 ఇన్నింగ్స్‌లలో 73 సగటుతో 665 పరుగులు చేశాడు. మొత్తం 17 సిక్సర్లు బాదాడు. వెస్టిండీస్ మాజీ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ లాంగ్ సిక్సర్లు కొట్టడంలో బాగా నేర్పరి. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన రెండవ ప్లేయర్ గా ఈ కరేబియన్ దిగ్గజం నిలిచాడు . అతను 17 మ్యాచ్‌ల్లో 791 పరుగులు చేయగా, 15 సిక్సర్లు కొట్టాడు. ఇంగ్లాండ్‌కు చెందిన ఇయాన్ మోర్గాన్ (14 సిక్సర్లు) మూడో స్థానంలో, ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వాట్సన్ (12 సిక్సర్లు) నాలుగో స్థానంలో, ఇంగ్లాండ్‌కు చెందిన పాల్ కాలింగ్‌వుడ్ 11 సిక్సర్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ఆరో స్థానంలో ఉన్నాడు. ఈ భారత ఆటగాడు ఒకే ఒక్క ఛాంపియన్స్ ట్రోఫీ (2017) ఆడాడు. అతను ఐదు మ్యాచ్‌లలో మూడు ఇన్నింగ్స్‌లలో 105 పరుగులు చేశాడు. అదే సమయంలో హార్దిక్ మొత్తం 10 సిక్సర్లు కొట్టాడు. సౌరవ్ గంగూలీ రికార్డును బద్దలు కొట్టడానికి అతనికి ఇంకా 8 సిక్సర్లు అవసరం. అయితే, ఈ రికార్డును హార్దిక్ బద్దలు కొట్టడం చాలా సులభం. ఎందుకంటే అతని ముందున్న బ్యాటర్లు అందరూ ఇప్పటికే రిటైర్ అయ్యారు.
No time to waste 🇮🇳 pic.twitter.com/920QEso0LF
— hardik pandya (@hardikpandya7) February 17, 2025
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు కీలక ప్లేయర్లలో హార్దిక్ పాండ్యా కూడా ఒకడు. మిడిల్ ఆర్డర్‌లో వచ్చి దూకుడుగా బ్యాటింగ్ చేయడం, ఆపై బౌలింగ్‌లోనూ రాణిస్తుండడంతో పాండ్యాపై భారీ అంచనాలు ఉన్నాయి. 50 ఓవర్ల ఫార్మాట్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో అతను బ్యాట్‌తోనూ, బంతితోనూ విధ్వంసం సృష్టించే అవకాశమంది. హార్దిక్ బ్యాట్ తన దైన శైలిలో రాణిస్తే ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఒక పెద్ద ఘనత ను అందుకుంటాడు. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ గా నిలిచేందుకు అతను కేవలం 8 సిక్సర్ల దూరంలో ఉన్నాడు.
📍 Dubai
The preps have begun for #ChampionsTrophy 2025 🙌 #TeamIndia pic.twitter.com/wRLT6KPabj
— BCCI (@BCCI) February 16, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..