Ind vs Aus: టీమిండియాతో టెస్ట్ సీరిస్..ఆసీస్‌కు బిగ్ షాక్
వచ్చే నెలలో ప్రారంభమయ్యే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా భారత్ సీరిస్‌కు కామెరాన్ గ్రీన్ బ్యాటర్‌గా అందుబాటులో ఉంటాడని ఆసీస్ క్రికెట్ బోర్డు భావిస్తుంది. అయితే అతను ఒకవేళ మ్యాచ్ వరకు అందుబాటులోకి వచ్చిన బౌలింగ్ చేసే అవకాశం లేదని తెలుస్తుంది.
వచ్చే నెలలో ప్రారంభమయ్యే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా భారత్ సీరిస్‌కు కామెరాన్ గ్రీన్ బ్యాటర్‌గా అందుబాటులో ఉంటాడని ఆసీస్ క్రికెట్ బోర్డు భావిస్తుంది. అయితే అతను ఒకవేళ మ్యాచ్ వరకు అందుబాటులోకి వచ్చిన బౌలింగ్ చేసే అవకాశం లేదని తెలుస్తుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఆరంభ మ్యాచ్‌లకు గ్రీన్ దూరం కానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గ్రీన్ వెన్ను గాయానికి సంబంధించిన వివరాలను క్రికెట్ ఆస్ట్రేలియా ఈ వారం అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది.
ఒక్కవేళ నవంబర్ టీమిండియా టెస్ట్ సీరిస్‌కు కామెరాన్ గ్రీన్ దూరం అయితే బౌలింగ్ బాధ్యతలు మిచ్ మార్ష్‌పై పడతాయి. బౌలింగ్ భారాన్ని నాథన్ లియాన్ భుజానకెత్తుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా పెర్త్, అడిలైడ్, బ్రిస్బేన్ వేదికలపై నాథన్ లియాన్‌కు మంచి రికార్డులే ఉన్నాయి.