1995 Tragedy : భారత క్రికెట్ చరిత్రలో చీకటి రోజు..స్టేడియంలో 9 మంది మృతి, అయినా కొనసాగిన మ్యాచ్
నవంబర్ 25, 1995... భారత క్రికెట్ చరిత్రలో ఈ తేదీని ఎప్పటికీ మరచిపోలేరు. సరిగ్గా 30 ఏళ్ల క్రితం నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ మైదానంలో ఒక హృదయ విదారక సంఘటన జరిగింది. క్రికెట్ అభిమానుల దృష్టి ఆ రోజు భారత్, న్యూజిలాండ్‌ల మధ్య జరుగుతున్న ఐదో వన్డే మ్యాచ్ మీద ఉంది. 2-2తో సమంగా ఉన్న సిరీస్‌లో గెలుపు కోసం రెండు జట్లు పోరాడుతున్నాయి.

1995 Tragedy : నవంబర్ 25, 1995… భారత క్రికెట్ చరిత్రలో ఈ తేదీని ఎప్పటికీ మరచిపోలేరు. సరిగ్గా 30 ఏళ్ల క్రితం నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ మైదానంలో ఒక హృదయ విదారక సంఘటన జరిగింది. క్రికెట్ అభిమానుల దృష్టి ఆ రోజు భారత్, న్యూజిలాండ్‌ల మధ్య జరుగుతున్న ఐదో వన్డే మ్యాచ్ మీద ఉంది. 2-2తో సమంగా ఉన్న సిరీస్‌లో గెలుపు కోసం రెండు జట్లు పోరాడుతున్నాయి. కానీ లంచ్ బ్రేక్ సమయంలో జరిగిన ప్రమాదం ఆ మ్యాచ్‌ను ఒక పెద్ద విషాదంగా మార్చేసింది.
గోడ కూలి 9 మంది మృతి
ఆ కీలకమైన వన్డే మ్యాచ్‌కు ముందు, ప్రేక్షకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్టేడియంలో కొత్తగా ఒక స్టాండ్ ఎక్స్‌టెన్షన్ గోడను కట్టారు. లంచ్ బ్రేక్ సమయంలో వేలాది మంది ప్రేక్షకులు భోజనం చేయడానికి, అటు ఇటు తిరుగుతున్న సమయంలో ఆ కొత్త గోడ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ గోడ కింద పడటం వల్ల తొమ్మిది మంది ప్రేక్షకులు చనిపోయారు. 70 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా కొంతమంది ప్రేక్షకులు దాదాపు 70 అడుగుల ఎత్తు నుంచి కిందపడి మరణించారు. మట్టి, ఇటుకల కింద చిక్కుకున్న వారి అరుపులు, హాహాకారాలు స్టేడియం అంతా వినిపించాయి.
ఆటగాళ్లకు తెలియని నిజం
అంత దారుణమైన ప్రమాదం జరిగినా కూడా భారత్, న్యూజిలాండ్‌ల మధ్య జరుగుతున్న ఆ మ్యాచ్‌ను నిర్వాహకులు ఆపలేదు కొనసాగించారు. ఈ ప్రమాదం గురించి ఆటగాళ్లకు లేదా స్టేడియంలో ఉన్న ప్రేక్షకులకు తెలిస్తే, మ్యాచ్ రద్దు అవుతుందని, లేదా అక్కడున్న 30 వేల మందికి పైగా జనం అల్లరి చేస్తారని నిర్వాహకులు భయపడ్డారు. అందుకే ఆటగాళ్లకు ఈ భయంకరమైన విషయం చెప్పకూడదని దాచిపెట్టారు. ఆ రోజు సచిన్ టెండూల్కర్, అజయ్ జడేజా, వినోద్ కాంబ్లి, అనిల్ కుంబ్లే వంటి దిగ్గజాలు ఆడుతున్నారు.
విషాదాంతమైన మ్యాచ్ ఫలితం
నిజం దాచినా, మ్యాచ్‌ను మాత్రం కొనసాగించారు. చివరికి ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 66 పరుగుల తేడాతో విజయం సాధించి, 3-2తో సిరీస్‌ను గెలుచుకుంది. తరువాత జరిగిన విచారణలో గోడ నిర్మాణానికి వేసిన పునాది బలహీనంగా ఉందని, అలాగే నాసిరకం మెటీరియల్‌ను ఉపయోగించారని, భద్రతా ప్రమాణాలను కూడా పాటించలేదని తేలింది. ఈ విషాదం భారత క్రికెట్‌లో స్టేడియం భద్రతా ప్రమాణాలపై చాలా తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది. దీని తర్వాత స్టేడియం నిర్మాణాల పర్యవేక్షణ పెరిగి, ప్రేక్షకుల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మొదలైంది.
