AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ఐపీఎల్ రద్దయినా, బీసీసీతోపాటు ఫ్రాంచైజీలకు నో లాస్.. ఆ ప్లాన్‌తో సేఫ్ జోన్‌‌లో..

IPL 2025 Postponed: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా బీసీసీఐ 2025 IPLను ఒక వారం వాయిదా వేసింది. ఒకవేళ వారం తర్వాత కూడా ఐపీఎల్ ముందుకుసాగకపోతే, బీసీసీఐతోపాటు ఫ్రాంచైజీలకు ఎంత నష్టం వస్తుంది, అసలు బీసీసీఐ ఏం ప్లాన్ చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..

IPL 2025: ఐపీఎల్ రద్దయినా, బీసీసీతోపాటు ఫ్రాంచైజీలకు నో లాస్.. ఆ ప్లాన్‌తో సేఫ్ జోన్‌‌లో..
Bcci
Follow us
Venkata Chari

|

Updated on: May 10, 2025 | 10:54 AM

IPL 2025 Postponed: భారత్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని, 2025 ఐపీఎల్‌ను వారం పాటు వాయిదా వేయాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ సీజన్‌లో మొత్తం 57 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. 58వ మ్యాచ్ సగంలోనే ఆగిపోయింది. ఈరోజు తదుపరి ఐపీఎల్ (IPL 2025) మ్యాచ్‌లను ప్రకటించిన బీసీసీఐ, టోర్నమెంట్‌ను వారం పాటు వాయిదా వేసింది. అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ రద్దు చేస్తే.. బీసీసీఐ, ఫ్రాంచైజీలు ఎంత నష్టపోతారనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. దీనికి సమాధానం ఏమిటంటే, ఐపీఎల్ రద్దు అయితే, బీసీసీఐకి లేదా ఫ్రాంచైజీలకు ఎటువంటి నష్టం ఉండదు.

బీసీసీఐకి ఎలాంటి నష్టం లేదు..

ఐపీఎల్ 2025 ఒక వారం పాటు నిలిపివేసిన సంగతి తెలిసిందే. వారం తర్వాత పరిస్థితి స్పష్టంగా ఉంటే, ఈ సీజన్ కొత్త విండోలో పూర్తవుతుంది. అంటే, మిగిలిన మ్యాచ్‌లకు బీసీసీఐ కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తుంది. అయితే, వచ్చే వారం పరిస్థితి మెరుగుపడకపోతే, టోర్నమెంట్ నిర్వహించలేకపోతే, ఐపీఎల్ రద్దు చేసినా, ఎవరికీ ఎటువంటి నష్టాలు జరగవు. దీని వెనుక ఉన్న కారణం BCCI బీమా పాలసీ.

IPL‌కు బీమా..

ఇటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ముందుగానే అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ప్రజలు వైద్య చికిత్స కోసం, కార్లు, బైక్‌లకు లేదా ఖరీదైన మొబైల్ ఫోన్‌లకు బీమా తీసుకున్నట్లే, IPLకు కూడా బీసీసీఐ బీమా చేసింది. దీంతో పాటు, జట్లు తమ ఆటగాళ్లకు బీమాను కూడా పొందుతాయి. ఫలితంగా ఆటగాళ్ళు గాయపడితే, వారి మొత్తం చికిత్స బీమా పరిధిలోకి వస్తుంది. దీని వలన ఏ ఫ్రాంచైజీకి కూడా ఎటువంటి నష్టం జరగదు.

ఇవి కూడా చదవండి

ఇది మాత్రమే కాదు, ఐపీఎల్‌లోని ప్రతి మ్యాచ్, ఆటగాడికి బీమా ఉంటుంది. దీనివల్ల ఏదైనా నష్టాన్ని భర్తీ చేయవచ్చు. అందువల్ల, ఏ ఫ్రాంచైజీకి ఎటువంటి నష్టాలు జరగవు. అదే సమయంలో, మ్యాచ్ రద్దు చేస్తే, స్పాన్సర్ల నుంచి వచ్చే డబ్బుకు బీసీసీఐకి పరిహారం కూడా లభిస్తుంది. ఏదైనా మ్యాచ్ రద్దు అయితే, సంబంధిత జట్లకు బీమా ద్వారా నష్ట మొత్తాన్ని చెల్లిస్తారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు.! వచ్చే 3 రోజులు పిడుగుల వర్షాలు
తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు.! వచ్చే 3 రోజులు పిడుగుల వర్షాలు
పీరియడ్స్ టైంలో స్త్రీలకు ఎందుకు విశ్రాంతినిచ్చారో తెలుసా..
పీరియడ్స్ టైంలో స్త్రీలకు ఎందుకు విశ్రాంతినిచ్చారో తెలుసా..
IPL 2025లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ స్టార్లు వీరే.. లిస్ట్‌లో మనోళ్లు
IPL 2025లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ స్టార్లు వీరే.. లిస్ట్‌లో మనోళ్లు
వెళ్లి నాన్న కాళ్ళు పట్టుకోవాలనుంది.. కానీ
వెళ్లి నాన్న కాళ్ళు పట్టుకోవాలనుంది.. కానీ
జాతకంలో గురు పుష్య యోగం ఎప్పుడు? ఎలా ఏర్పడుతుంది?
జాతకంలో గురు పుష్య యోగం ఎప్పుడు? ఎలా ఏర్పడుతుంది?
టీమిండియా పాలిట విలన్‌లా మారనున్న ఇంగ్లండ్ ఆల్ రౌండర్
టీమిండియా పాలిట విలన్‌లా మారనున్న ఇంగ్లండ్ ఆల్ రౌండర్
ఢిల్లీ ఈ ప్రసిద్ధ శని దేవాలయాలను సందర్శించండి.. ఆనందం మీ సొంతం
ఢిల్లీ ఈ ప్రసిద్ధ శని దేవాలయాలను సందర్శించండి.. ఆనందం మీ సొంతం
థియేటర్స్ బంద్ వెనకాల కుట్ర.. ఆ నలుగురే కారణం
థియేటర్స్ బంద్ వెనకాల కుట్ర.. ఆ నలుగురే కారణం
ఆర్‌సీబీ ఓటమితో కోహ్లీకి దిమ్మ తిరిగే షాక్.. ఆ లిస్ట్ నుంచి ఔట్..
ఆర్‌సీబీ ఓటమితో కోహ్లీకి దిమ్మ తిరిగే షాక్.. ఆ లిస్ట్ నుంచి ఔట్..
ఈ రోజు రావి చెట్టుని ఇలా పూజించండి.. శనీశ్వరుడి అనుగ్రహం మీ సొంతం
ఈ రోజు రావి చెట్టుని ఇలా పూజించండి.. శనీశ్వరుడి అనుగ్రహం మీ సొంతం