Gautam Gambhir: గౌతమ్ గంభీర్‌ ప్రపోజల్ రిజక్ట్.. ఊహించని షాకిచ్చిన బీసీసీఐ.. అదేంటంటే?

Gautam Gambhir: టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత టీమ్‌ఇండియాకు కొత్త ప్రధాన కోచ్‌‌గా గౌతమ్ గంభీర్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇదే క్రమంలో సహాయక సిబ్బంది నియామకానికి రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన జాబితాను గంభీర్ సిద్ధం చేశాడు. అయితే, ఇక్కడే ఓ చిక్కు వచ్చి పడింది. దీంతో అప్పుడే బీసీసీఐకి, గౌతమ్ గంభీర్‌కు ఘర్షణ లాంటి వాతావరణం మొదలైంది. గంభీర్ చెప్పిన ప్రతిపాదన నచ్చని బీసీసీఐ.. ఆయనకు బిగ్ షాక్ ఇచ్చింది.

Gautam Gambhir: గౌతమ్ గంభీర్‌ ప్రపోజల్ రిజక్ట్.. ఊహించని షాకిచ్చిన బీసీసీఐ.. అదేంటంటే?
Bcci Gautam Gambhir

Updated on: Jul 12, 2024 | 3:12 PM

Gautam Gambhir: టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత టీమ్‌ఇండియాకు కొత్త ప్రధాన కోచ్‌‌గా గౌతమ్ గంభీర్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇదే క్రమంలో సహాయక సిబ్బంది నియామకానికి రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన జాబితాను గంభీర్ సిద్ధం చేశాడు. అయితే, ఇక్కడే ఓ చిక్కు వచ్చి పడింది. దీంతో అప్పుడే బీసీసీఐకి, గౌతమ్ గంభీర్‌కు ఘర్షణ లాంటి వాతావరణం మొదలైంది. గంభీర్ చెప్పిన ప్రతిపాదన నచ్చని బీసీసీఐ.. ఆయనకు బిగ్ షాక్ ఇచ్చింది. కాగా, గంభీర్ తన సహాయక సిబ్బందిలో మాజీ పాకిస్తాన్ కోచ్‌ని నియమించాలని BCCIని కోరుతున్నాడు. పాకిస్థాన్ టీమ్‌కి కోచ్‌గా ఉన్న మోర్నీ మోర్కెల్‌ను టీమిండియా బౌలింగ్ కోచ్‌గా చేయాలనుకుంటున్నాడు. మోర్కెల్ పేరు వచ్చిన వెంటనే కలకలం రేగింది. ఎందుకంటే ఒక నివేదిక ప్రకారం, బోర్డు కేవలం భారతీయులనే సహాయక సిబ్బందిలో ఉంచాలని కోరుకుంటుంది. అందుకే జాంటీ రోడ్స్‌ను తీసుకురావాలనే గంభీర్ డిమాండ్‌ను తిరస్కరించింది. మోర్కెల్ పేరు తెరపైకి రావడంతో, బౌలింగ్ కోచ్ రేసు కూడా చాలా ఉత్కంఠగా మారింది.

గంభీర్‌ జాబితాలో మోర్కెల్‌ పేరు రావడంతో చర్చ జోరందుకుంది. దక్షిణాఫ్రికాకు చెందిన వెటరన్ బౌలర్ మోర్కెల్ నవంబర్ 2023 వరకు పాకిస్థాన్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు. వినిపిస్తున్న వార్తల ప్రకారం, మోర్కెల్ కాకుండా, గంభీర్ కోరికల జాబితాలో మరికొన్ని పేర్లు ఉన్నాయి. గంభీర్ ఎంట్రీ తర్వాతే బౌలింగ్ కోచ్ పేరుపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకుంటుంది. టీమ్ ఇండియా తొలి బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే. ఈయన కోచింగ్‌లో బౌలర్లు ప్రపంచకప్‌లో అద్భుతాలు చేశారు. గంభీర్‌ పదవీకాలంలో ఈయన స్థానంలో ఎవరు వస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

రెండు డిమాండ్లను తిరస్కరించిన బీసీసీఐ..

అయితే, దీనికి ముందు బీసీసీఐ గంభీర్ రెండు డిమాండ్లను తిరస్కరించింది. ఒక నివేదిక ప్రకారం, గంభీర్ జాంటీ రోడ్స్‌ను టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా చేయాలని కోరుకున్నాడు. అయితే, బోర్డు మాత్రం కేవలం భారతీయులనే సహాయక సిబ్బందిలో ఉంచాలని కోరుతోంది. గతంలో ఈ పోస్టుకు వినయ్ కుమార్ పేరు కూడా తెరపైకి వచ్చినప్పటికీ ఆయన పేరుపై బోర్డు ప్రత్యేక ఆసక్తి చూపలేదు.

ఇలాంటి పరిస్థితుల్లో టీం ఇండియా ఫీల్డింగ్ కోచ్‌గా టి దిలీప్ కొనసాగుతారని, గంభీర్‌తో కలిసి పని చేస్తారని భావిస్తున్నారు. ఇప్పుడు బీసీసీఐ బౌలింగ్ కోచ్ కోసం విదేశీ కోచ్‌ని తీసుకువస్తుందా లేదా మాంబ్రే స్థానంలో భారతీయుడిని తీసుకుంటుందా అనేది చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..