ICC U19 World Cup: మొదటి అండర్ 19 వుమెన్స్ వరల్డ్ కప్.. టీమిండియా సారథిగా సెన్సేషనల్‌ ఓపెనర్‌

దక్షిణాఫ్రికా వేదికగా జరిగే ఈ ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టుకు టీమిండియా యంగ్ అండ్‌ సెన్సేషనల్ ఓపెనర్ షెఫాలీ వర్మ సారథ్యం వహించనుంది. ఈ మేరకు బీసీసీఐ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

ICC U19 World Cup: మొదటి అండర్ 19 వుమెన్స్ వరల్డ్ కప్.. టీమిండియా సారథిగా సెన్సేషనల్‌ ఓపెనర్‌
Shafali Verma
Follow us

|

Updated on: Dec 05, 2022 | 2:58 PM

ఐసీసీ తొలిసారిగా నిర్వహించనున్న మహిళల అండర్-19 ప్రపంచకప్‌కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. దక్షిణాఫ్రికా వేదికగా జరిగే ఈ ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టుకు టీమిండియా యంగ్ అండ్‌ సెన్సేషనల్ ఓపెనర్ షెఫాలీ వర్మ సారథ్యం వహించనుంది. ఈ మేరకు బీసీసీఐ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రపంచకప్ జనవరి 14 నుంచి 29 వరకు జరగనుంది. ఇది కాకుండా, ప్రపంచ కప్ ముందు ఆతిథ్య దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కూడా బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్సీని కూడా షెఫాలీ వర్మకు అప్పగించారు. ప్రపంచకప్‌కు ముందు డిసెంబర్-జనవరిలో ఈ సిరీస్ జరగనుంది. షెఫాలీ తో పాటు సీనియర్ జట్టులో ఆడిన స్టార్‌ బ్యాటర్ రిచా ఘోష్ కూడా అండర్‌-19 మహిళల ప్రపంచకప్‌కు ఎంపికైంది. షెఫాలీ భారత సీనియర్ జట్టు తరఫున రెండు టెస్టులు, 21 వన్డేలు, 46 టీ20 మ్యాచ్‌లు ఆడింది. అలాగే రిచా టీమిండియా తరఫున 17 వన్డేలు, 25 టీ20 మ్యాచ్‌లు ఆడింది.

ఐసీసీ తొలిసారిగా అండర్-19 మహిళల ప్రపంచకప్‌ను నిర్వహిస్తోంది. ఇందులో మొత్తం 16 జట్లు పాల్గొంటాయి. ఆతిథ్య దక్షిణాఫ్రికా, యూఏఈతో కలిసి భారత్‌ గ్రూప్‌-డిలో నిలిచింది. ప్రతి గ్రూప్‌ నుంచి టాప్‌-3 జట్లు సూపర్‌-6కి వెళ్తాయి. ఈ రౌండ్‌లో జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఇక్కడ నుంచి టాప్-4 జట్లు సెమీఫైనల్‌లో తలపడతాయి. జనవరి 29న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ ప్రపంచకప్‌కు ముందు భారత జట్టు డిసెంబర్ 27 నుంచి జనవరి 4 వరకు దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది.

ఇవి కూడా చదవండి

అండర్-19 మహిళల ప్రపంచకప్ జట్టు:

షెఫాలీ వర్మ (కెప్టెన్), శ్వేతా సెహ్రావత్ (వైస్ కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్) , జి త్రిష, సౌమ్య తివారీ, సోనియా మెహదియా, హర్లే గాలా (వికెట్ కీపర్), సోనమ్ యాదవ్, మన్నత్ కశ్యప్, అర్చన దేవి, ప్రశ్వి చోప్రా , టిటాస్ సాధు, ఫలక్ నాజ్, ఎండీ షబ్నమ్

దక్షిణాఫ్రికా సిరీస్ కోసం..

షెఫాలీ వర్మ (కెప్టెన్), శ్వేతా సెహ్రావత్ (వైస్ కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి. త్రిష, సౌమ్య తివారీ, సోనియా మెహదియా, హర్లే గాలా, రిషితా బసు (వికెట్ కీపర్), సోనమ్ యాదవ్, మన్నత్ కశ్యప్, అర్చన దేవి, ప్రశ్వి చోప్రా, టిటాస్ సాధు, ఫలక్ నాజ్, షబ్నమ్ MD, శిఖా నజ్లా, యశశ్రీ

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!