Ruturaj Gaikwad: సెంచరీ చేస్తే కంగ్రాట్స్ కూడా చెప్పలేకపోయా.. రుతురాజ్‌తో డేటింగ్‌ రూమర్లపై హీరోయిన్‌ ఎమోషనల్‌

రుతురాజ్‌కు సంబంధించి ఒక ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి సయాలీ సంజీవ్‌ అతను రిలేషన్‌షిప్‌లో ఉన్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Ruturaj Gaikwad: సెంచరీ చేస్తే కంగ్రాట్స్ కూడా చెప్పలేకపోయా.. రుతురాజ్‌తో డేటింగ్‌ రూమర్లపై హీరోయిన్‌ ఎమోషనల్‌
Ruturaj Gaikwad, Sayali
Follow us

|

Updated on: Dec 05, 2022 | 12:13 PM

టీమిండియా యంగ్‌ క్రికెటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. ఇటీవల ముగిసిన విజయ్‌ హజారే ట్రోఫీలో పరుగుల వర్షం కురిపించిన ఈ రైట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌ ..ఒకే ఓవర్లో ఏకంగా ఏడు సిక్స్‌లు కొట్టి సంచలనం సృష్టించాడు. అంతేకాదు వరుసగా డబుల్‌ సెంచరీ, సెంచరీ చేసి మరోసారి టీమిండియా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ ప్రదర్శనతో ధోని తర్వాత చెన్నై జట్టు కెప్టెన్‌ బాధ్యతలను రుతురాజ్‌కే అప్పగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే రుతురాజ్‌కు సంబంధించి ఒక ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి సయాలీ సంజీవ్‌ అతను రిలేషన్‌షిప్‌లో ఉన్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సయాలీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే ఫొటోలపై రుతురాజ్‌ తరచూ కామెంట్లు, లైక్‌లు చేయడంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారన్న రూమర్లకు మరింత బలం చేకూరింది. అయితే రుతురాజ్‌ తనకు మంచి స్నేహితుడని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఈ పుకార్లపై మరోసారి పెదవి విప్పింది.

మా మధ్య మాటల్లేవ్..

‘ఇక మా మధ్య ఏం లేదు.. ఈ రూమర్స్‌ వల్ల మా ఫ్రెండ్‌షిప్‌ కూడా దెబ్బతింది. కనీసం స్నేహితులుగా కూడా మేమిద్దరం మాట్లాడుకోవట్లేదు. మా మధ్య ప్రేమాదోమా ఏమీ లేదు. అయినా మమ్మల్ని ఎందుకు లింకప్‌ చేసి చూస్తున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. ఇలాంటి పుకార్ల వల్ల మా వ్యక్తిగత జీవితాల్లో కూడా కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఇది పుకార్లు పుట్టించేవాళ్లకు మాత్రం ఎందుకర్థమవట్లేదు. అతను (రుతురాజ్‌) ఓ మంచి క్రికెటర్‌. మేం క్రికెట్‌, సినిమాల గురించే ఎక్కువగా మాట్లాడుకునేవాళ్లం. ఇప్పుడు అది కూడా మానేశాం. మొదట మా గురించి వచ్చిన రూమర్స్‌ని పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పటికైనా మేము మంచి ఫ్రెండ్స్ అని అందరూ అర్థం చేసుకుంటారులే అనుకున్నాం. కానీ.. ఈ రూమర్స్ తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతూ వచ్చింది. దీంతో మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మా మధ్య ఏమీ లేదు. చివరికి అతను సెంచరీ సాధించినప్పుడు కంగ్రాట్స్ కూడా చెప్పలేకపోతున్నా. అతను కూడా నాతో ఏమీ మాట్లాడలేకపోతున్నాడు’ అని ఎమోషనల్‌ అయింది సయాలీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..