Team India: రోహిత్ సేనపై కాసుల వర్షం.. టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఏకంగా ఎన్ని కోట్లో తెలుసా?

|

Jun 30, 2024 | 9:15 PM

ప్రతిష్ఠాత్మక 9వ ఎడిషన్ టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుని భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి రోహిత్ సేన రికార్డు స్థాయిలో రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఈ ఛాంపియన్ ప్రదర్శనకు గానూ టీమ్ ఇండియా ఐసీసీ నుంచి మొత్తం రూ.22.76 కోట్లు ప్రైజ్ మనీగా అందుకుంది.

Team India: రోహిత్ సేనపై కాసుల వర్షం.. టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఏకంగా ఎన్ని కోట్లో తెలుసా?
Team India
Follow us on

ప్రతిష్ఠాత్మక 9వ ఎడిషన్ టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుని భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి రోహిత్ సేన రికార్డు స్థాయిలో రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఈ ఛాంపియన్ ప్రదర్శనకు గానూ టీమ్ ఇండియా ఐసీసీ నుంచి మొత్తం రూ.22.76 కోట్లు ప్రైజ్ మనీగా అందుకుంది. ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌కు బిగ్ బాస్ అయిన బీసీసీఐ.. తన ఛాంపియన్ టీమ్‌కి భారీ నజరానా ప్రకటించి యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. రోహిత్ సేనకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.125 కోట్లు బహుమతిగా ప్రకటించింది బీసీసీఐ. దీనికి సంబంధించిన సమాచారాన్ని బీసీసీఐ సెక్రెటరీ జైషా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు .. ‘9వ టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమ్ ఇండియాకు రికార్డు స్థాయిలో 125 కోట్ల బహుమతి ప్రకటించడం ఆనందంగా ఉంది. టోర్నమెంట్‌లో భారత జట్టు అద్భుతమై ప్రతిభ, పట్టుదల, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించింది. అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లు, కోచ్‌లు, అభిమానులందరికీ అభినందనలు’ అని జైషా ట్వీట్ చేశారు.

టీ20 ప్రపంచకప్‌ చాంపియన్‌గా నిలిచిన టీమ్‌ఇండియాకు బీసీసీఐ రికార్డు మొత్తాన్ని బహుమతిగా ప్రకటించి యావత్ ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచింది. ఇంతకు ముందు ఏ ఛాంపియన్ జట్టు ఈ స్థాయిలో ప్రైజ్ మనీ అందుకోలేదు. భవిష్యత్తులో కూడ అందుకునే అవకాశం దాదాపు లేదు. టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైన టీమిండియా, జట్టు సహాయక సిబ్బందికి మొత్తం రూ.125 కోట్లు బహుమతిగా ప్రకటించారు. టీ20 ప్రపంచకప్ తొలి ఎడిషన్‌లో ఈ టీమ్ ఇండియా గెలిచినప్పుడు బీసీసీఐ ఇచ్చిన ప్రైజ్‌కి, ఇప్పుడు ఇస్తున్న ప్రైజ్‌కి మధ్య చాలా తేడా ఉంది. 2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో ధోనీ నాయకత్వంలో భారత్ విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించిన టీమిండియా ఒక్కో ఆటగాడికి బీసీసీఐ 2 కోట్ల రూపాయల నగదు బహుమతిని అందజేసింది.

ఇవి కూడా చదవండి

బీసీసీఐ ట్వీట్ ఇదిగో..

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..