Viral Video: ఇదేం బ్యాటింగ్ సామీ.. ఏకంగా స్కై, డివిలియర్స్‌ను మించిపోయావుగా.. మీరూ చూసేయండి.!
స్విచ్ హిట్, పుల్ షాట్, స్కూప్ షాట్, స్క్వేర్ కట్, కవర్ డ్రైవ్.. ఇలా క్రికెట్ పుస్తకాల్లో ఉన్న షాట్లతో పాటు గ్రౌండ్‌కు నలువైపులా షాట్లు బాదేసే..

స్విచ్ హిట్, పుల్ షాట్, స్కూప్ షాట్, స్క్వేర్ కట్, కవర్ డ్రైవ్.. ఇలా క్రికెట్ పుస్తకాల్లో ఉన్న షాట్లతో పాటు గ్రౌండ్‌కు నలువైపులా షాట్లు బాదేసే ప్లేయర్స్ సూర్య కుమార్ యాదవ్, ఏబీ డివిలియర్స్. ఈ ఇద్దరు క్రికెటర్లను ఫ్యాన్స్ ముద్దుగా మిస్టర్ 360 అని పిలుచుకుంటుంటారు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో ఈ ఇద్దరి ఆటగాళ్ల షాట్స్‌కు పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఇప్పుడు మేము చెప్పబోతున్న ప్లేయర్.. ఏకంగా వీరిద్దరినే మించిపోయాడు. వికెట్ల వెనుక నుంచి అతడు స్కూప్ షాట్ ఆడాడంటే.. బంతి బౌండరీకి వెళ్లడం ఖాయం. మరి లేట్ ఎందుకు మీరూ వీడియో చూసేయండి.
సాధారణంగా క్రికెట్‌లో బ్యాటర్లందరూ వికెట్ల ముందు నుంచి ఆడతారు. అయితే ఇక్కడ కనిపిస్తున్న ప్లేయర్.. వికెట్ వెనకాల నుంచి స్కూప్ షాట్ ఆడటమే కాదు.. దాన్ని బౌండరీకి కూడా తరలించాడు. ఇంతకీ ఈ మ్యాచ్ ఎక్కడ జరిగిందనుకుంటున్నారా.? ఎక్కడో కాదండీ.. మన ఇండియాలోనే ఒక లోకల్ మ్యాచ్ దృశ్యం ఇది. బౌలర్ బంతి వేసే వరకు వెయిట్ చేసి.. ఆ తర్వాత వికెట్ల వెనక్కి వెళ్లి బౌండరీ బాదేశాడు బ్యాటర్. ఈ చర్య అభిమానులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. కాగా, ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘మిస్టర్ 1080’ అంటూ కొందరు అతడ్ని ప్రశంసిస్తుంటే.. మరికొందరు రూల్స్ అతిక్రమించి అడుతున్నాడంటూ తిట్టిపోస్తున్నారు.
— Out Of Context Cricket (@GemsOfCricket) June 28, 2023
Mr 1080 😵
Is that shot even legal?
— ವಿಕ್ರಮ್ ಪ್ರಭು | Vikram Prabhu (@TheLostIndian18) June 29, 2023
Should call batsman out. Because in cricket, batsman is not allow to play shot behind the wicket.
So obstructing in field, batsman is out.
— Sachin Sagar (@sachin_31sagar) June 28, 2023
Only shot SKY needs to learn
— Pichaa Paati (@Pichaa_paati) June 30, 2023




