పాక్‌పై కోహ్లీసేన కుట్ర.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
దాయాదులతో క్రికెట్ సమరమంటే ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. గ్రౌండ్‌లో మాత్రమే కాదు బయట కూడా ఆ పోరుపై భావోద్వేగాలు తారాస్థాయిలో ఉంటాయి. ఇక సమరం అన్నాక గెలుపోటములు సహజమే. అదీ కూడా మనదే బలమైన జట్టని రెండు దేశాల అభిమానులు భావిస్తారు. ఇక ఒకరి విజయాన్ని తట్టుకోలేక కొంతమంది మాజీలు కొన్ని ‘కుట్ర సిద్ధాంతాలను’ లేవనెత్తుతారు. సరిగ్గా ఇలాంటి సిద్ధాంతాన్ని ఒకటి పాక్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ తనదైన శైలిలో వివరిస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. కానీ […]

దాయాదులతో క్రికెట్ సమరమంటే ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. గ్రౌండ్‌లో మాత్రమే కాదు బయట కూడా ఆ పోరుపై భావోద్వేగాలు తారాస్థాయిలో ఉంటాయి. ఇక సమరం అన్నాక గెలుపోటములు సహజమే. అదీ కూడా మనదే బలమైన జట్టని రెండు దేశాల అభిమానులు భావిస్తారు. ఇక ఒకరి విజయాన్ని తట్టుకోలేక కొంతమంది మాజీలు కొన్ని ‘కుట్ర సిద్ధాంతాలను’ లేవనెత్తుతారు. సరిగ్గా ఇలాంటి సిద్ధాంతాన్ని ఒకటి పాక్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ తనదైన శైలిలో వివరిస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. కానీ ఆ కుట్ర సిద్ధాంతం మాత్రం అతగాడి సొంత దేశస్థులు కూడా నమ్మేలా కనిపించడం లేదు.
వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌ను సెమీస్‌కు రానివ్వకుండా కోహ్లీసేన కుట్ర చేస్తోందని ఆయన అన్నాడు. దాయాదుల సెమీస్ అవకాశాలను దెబ్బతీయడానికి భారత్ తమ మిగతా మ్యాచుల్లో పేలవంగా ఆడుతుందన్నారు. ఆయన ఉద్దేశంలో భారత్‌కు గెలిచే అవకాశాలు ఉన్నా కావాలని ఓడిపోతుందట. పాక్‌లోని ఏఆర్‌వై అనే ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో బాసిత్ అలీ ఈ సంచలన వ్యాఖ్యలను మాట్లాడాడు. ఇక బాసిత్ అలీ పాక్ తరఫున 1993-1996 మధ్య కాలంలో 19 టెస్టులు, 50 వన్డేలు ఆడాడు.
మరోవైపు భారత్ ఇప్పటివరకు ప్రపంచకప్‌లో 6 మ్యాచులు ఆడగా.. వాటిల్లో ఐదు మ్యాచులు గెలిచి 11 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, వెస్టిండీస్‌పై సునాయాసంగా విజయాలు సాధించిన భారత్.. కేవలం ఆఫ్ఘనిస్తాన్‌పై మాత్రం ఇబ్బంది పడింది. బ్యాటింగ్‌లో కోహ్లీ, రోహిత్ శర్మ, ధోనీలు రాణిస్తుండగా.. బౌలింగ్‌లో బుమ్రా, షమీ, చాహల్ భారత్‌కు విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే జరగబోయే మ్యాచ్‌లలో పాక్ సెమీస్ రాకుండా అడ్డుకొనేందుకు భారత్ కావాలనే ఓడిపోవచ్చు’ అని బాసిల్ అలీ అంటున్నాడు. కాగా అతడు చేసిన వ్యాఖ్యలపై భారత్ అభిమానులు ట్విట్టర్ వేదికగా భారీ జోకులు పేలుస్తున్నారు.
Basit Ali reckons India will not want Pakistan to qualify for the semi-finals and may play poorly in their matches against Sri Lanka and Bangladesh ? #CWC19 pic.twitter.com/vwg3oFnnpl
— Saj Sadiq (@Saj_PakPassion) June 26, 2019
