IND vs BAN: టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. భారత్ ప్లేయింగ్ 11 నుంచి ఆ ముగ్గురు ఔట్..

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు ఈరోజు బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌తో తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. రెండు జట్లు గ్రూప్-ఎలో ఉన్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత జట్టు తొలుత బౌలింగ్ చేయనుంది.. ఈ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియాతో పాటు టీం ఇండియా అత్యంత విజయవంతమైన జట్టు. ఇద్దరూ చెరో 2 టైటిళ్లు గెలుచుకున్నారు. ఇంతలో, బంగ్లాదేశ్ తన తొలి టైటిల్ కోసం చూస్తోంది.

IND vs BAN: టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. భారత్ ప్లేయింగ్ 11 నుంచి ఆ ముగ్గురు ఔట్..
Bangladesh Vs India, 2nd Match, Group A

Updated on: Feb 20, 2025 | 2:21 PM

ఛాంపియన్స్ ట్రోఫీ-2025 రెండవ మ్యాచ్ దుబాయ్ క్రికెట్ స్టేడియంలో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హసన్ శాంటో బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ, ‘మేము ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాము. వికెట్ బాగుంది కాబ,ట్టి మేము పరుగులు స్కోర్ చేయాలనుకుంటున్నాము. మేము ఈరోజు మంచి క్రికెట్ ఆడతాం. అందరు ఆటగాళ్లు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు.

భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ- ‘నేను ముందుగా బౌలింగ్ చేసి ఉండేవాడిని. మేం కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఆడాం. కాబట్టి లైట్ల కింద బంతి బాగా వస్తుందని భావిస్తున్నాం. అంతా బాగుంది. అందరూ ఫిట్‌గా ఉన్నారు. ఆడటానికి సిద్ధంగా ఉన్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ గ్రూప్-ఎ మ్యాచ్‌తో, రెండు జట్లు ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తమ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాయి. ఈ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియాతో పాటు టీం ఇండియా అత్యంత విజయవంతమైన జట్టు. ఇద్దరూ చెరో 2 టైటిళ్లు గెలుచుకున్నారు. ఇంతలో, బంగ్లాదేశ్ తన తొలి టైటిల్ కోసం చూస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ టోర్నమెంట్ చరిత్రలో భారత్, బంగ్లాదేశ్ ఒక్కసారి మాత్రమే తలపడ్డాయి. ఈ మ్యాచ్ 2017 సీజన్‌లో జరిగింది. ఆ తర్వాత బర్మింగ్‌హామ్‌లో జరిగిన సెమీ-ఫైనల్లో భారత జట్టు బంగ్లాదేశ్‌ను 9 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్స్‌కు చేరుకుంది. ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ 123 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు.

ఇరుజట్ల ప్లేయింగ్ 11..

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.

బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): తాంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, రిషాద్ హొస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..