Champions Trophy: భారత్‌తో మ్యాచ్‌కి ముందు పాకిస్థాన్ టీమ్‌లో టెన్షన్! ఎక్కడికో వెళ్లిపోయిన బాబర్ ఆజమ్..!
భారత్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్టార్ ఆటగాడు బాబర్ అజం ప్రాక్టీస్‌కు హాజరు కాలేదు. ఇప్పటికే ఫకర్ జమాన్ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం కావడం పాకిస్థాన్కు పెద్ద ఎదురుదెబ్బ. ఇప్పడు బాబర్ అజం మ్యాచ్ ఆడతారా లేదా అన్నది అనిశ్చితంగా మారింది. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఆందోళన వ్యక్తం చేశారు.

మరికొద్ది సేపట్లో టీమిండియాతో మ్యాచ్ ఉండగా పాకిస్థాన్ టీమ్‌లో టెన్షన్ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అందుకు కారణం ఆ జట్టు స్టార్ ప్లేయర్ బాబర్ ఆజమ్ టీమ్‌తో లేకపోవడమే. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆదివారం భారత్-పాక్ జట్లు తలపడుతున్న విషయం తెలిసిందే. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ దాయాదుల పోరు జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నీలో నిలబడాలంటే పాకిస్థాన్ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో వాళ్లు ఈ మ్యాచ్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఓడిపోవడంతో వాళ్లుకు ఈ మ్యాచ్ డూ ఆర్ డైగా మారింది.
మరోవైపు బంగ్లాదేశ్‌పై గెలిచి, పాక్‌తో మ్యాచ్‌కు సిద్ధమైన టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో ఉంది. ఇంత కీలకమైన మ్యాచ్‌కి ముందు బాబర్ ఆజమ్ జట్టుకు దూరంగా ఉన్నాడు. శనివారం ప్రాక్టీస్‌కి రాకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు. అసలు టీమిండియాతో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది కూడా సందిగ్ధంగా మారింది. దీంతో పాకిస్థాన్ జట్టులో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇప్పటికే గాయంతో ఫకర్ జమాన్ జట్టుకు దూరం అయ్యాడు. ఇప్పడు బాబర్ ఇలా ప్రవర్తిస్తుండటంతో ఆ టీమ్ టెన్షన్‌లో ఉంది. శనివారం దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో పాకిస్థాన్ జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది. ఆ సమయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నఖ్వీ కూడా అక్కడికి వచ్చి జట్టు ఆటగాళ్లతో మాట్లాడారు.
ఎలాగైనా టీమిండియాపై గెలవాలని జట్టు ఆటగాళ్లను మోటివేట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ, బాబర్ ఆజమ్ అక్కడ లేకపోవడంతో ఆయన ఖంగుతిన్నాడు. జట్టులో కీలక ప్లేయర్ ప్రాక్టీస్‌కి రాకుండా ఎగ్గొట్టడంతో ఆయన షాక్ అయ్యారు. అసలు బాబర్ ప్రాక్టీస్‌కి రాకుండా ఎక్కడికి వెళ్లింది కూడా జట్టులోని మిగతా సభ్యులకు కానీ, టీమ్ మేనేజ్‌మెంట్‌కి గానీ తెలియదు. డే ఆఫ్ తీసుకొని.. బాబర్ ప్రాక్టీస్‌కూ దూరంగా ఉన్నాడు. మరి కనీసం మ్యాచ్ అయినా ఆడతాడా లేదా అని కూడా పీసీబీ ఛైర్మన్ నఖ్వీ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. సరైన కారణం చెప్పకపోతే.. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత బాబర్‌పై చర్యలు తీసుకోవాలని కూడా పీసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




