IND vs PAK Highlights: సెంచరీతో కోహ్లీ తీన్‌మార్ ఇన్నింగ్స్.. కట్‌చేస్తే.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాక్ ఔట్
IND vs PAK, Champions Trophy 2025 Highlights in Telugu: 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేయడం ద్వారా టీమ్ ఇండియా సెమీఫైనల్లో తన స్థానాన్ని దాదాపుగా నిర్ధారించుకుంది. కాగా, టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించే దశలో ఉంది.

Champions Trophy, IND vs PAK Highlights: 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ప్రయాణం అజేయంగా కొనసాగుతోంది. తన రెండవ మ్యాచ్‌లో, టీం ఇండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. దీనితో సెమీ-ఫైనల్స్‌లో తన స్థానాన్ని దాదాపుగా నిర్ధారించుకుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో, టీం ఇండియా మరోసారి 242 పరుగుల లక్ష్యాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా అద్భుతంగా సాధించింది. టీం ఇండియా విజయంలో స్టార్ విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ సాధించి మిగతా జట్లకు హెచ్చరికలు జారీ చేశాడు. ఇదిలా ఉండగా, టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ సొంత మైదానంలో మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించే అవకాశం ఉంది.
LIVE Cricket Score & Updates
-
భారత్ ఘన విజయం
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో 180 పరుగుల ఓటమికి ఆ జట్టు ప్రతీకారం తీర్చుకుంది. ఆదివారం దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 241 పరుగులు చేసింది.
-
4 వికెట్లు కోల్పోయిన భారత్..
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై విజయానికి భారత్ ఇంకా 19 పరుగుల దూరంలో ఉంది. 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆ జట్టు 40.2 ఓవర్లలో 4 వికెట్లకు 224 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్ ఉన్నారు. శ్రేయాస్ అయ్యర్ 56 పరుగులు చేసి ఔటయ్యాడు.
-
-
ఐసీసీ వన్డే టోర్నమెంట్‌లో కోహ్లీ 23వ హాఫ్ సెంచరీ
27వ ఓవర్లో విరాట్ కోహ్లీ తన అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 62 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐసిసి టోర్నమెంట్‌లో కోహ్లీ తన 23వ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఇది విరాట్‌కు 74వ వన్డే అర్ధ సెంచరీ.
-
గిల్ ఔట్..
భారత జట్టు 17.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ 46 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
-
హాఫ్ సెంచరీ దాటిన భాగస్వామ్యం..
భారత జట్టు 13 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 84 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ క్రీజులో ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ (20 పరుగులు) షాహీన్ అఫ్రిది వేసిన యార్కర్‌కు బౌల్డ్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో తొలి పరుగు చేయడం ద్వారా రోహిత్ ఓపెనర్‌గా 9 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.
-
-
రోహిత్ ఔట్
5 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు ఒక వికెట్ కోల్పోయి 31 పరుగులు సాధించింది. రోహిత్ శర్మ 20 పరుగులు (3 ఫోర్లు, 1 సిక్స్) చేసి పెవిలియన్ చేరాడు.
-
టీమిండియా ఛేజింగ్ మొదలు..
242 పరుగుల టార్గెట్‌తో టీమిండియా ఛేజింగ్ మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ క్రీజులోకి వచ్చారు.
-
టీమిండియా టారెట్ 242
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ భారత్ కు 242 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ జట్టు తరఫున సౌద్ షకీల్ ఏకైక అర్ధశతకం సాధించాడు. అతను 62 పరుగులు చేసి, కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (46)తో కలిసి 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
-
8వ వికెట్ కోల్పోయిన పాక్
పాకిస్తాన్ 47 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. కుల్దీప్ 3 వికెట్లు పడగొట్టాడు.
-
2 వరుస బంతుల్లో 2 వికెట్లు
పాక్ జట్టు 43 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. కుల్దీప్ 43వ ఓవర్లో 2 వరుస బంతుల్లో 2 వికెట్లు పడగొట్టాడు.
-
తయ్యబ్‌ను బౌల్డ్ చేసిన జడేజా
పాకిస్తాన్ 36.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. 18 బంతుల్లోనే పాక్ జట్టు 3 వికెట్లు కోల్పోయింది. ఇప్పటివరకు 5 గురు బ్యాట్స్‌మెన్స్ అవుట్ అయ్యారు. సల్మాన్ ఆఘా, ఖుస్దిల్ షా క్రీజులో ఉన్నారు.
రవీంద్ర జడేజా తయ్యబ్ తాహిర్ (4 పరుగులు) ను బౌల్డ్ చేశాడు. అంతకుముందు హార్దిక్ పాండ్యా సౌద్ షకీల్ (62)ను అవుట్ చేయగా, అక్షర్ పటేల్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (46)ను అవుట్ చేశాడు.
భారత్ తరపున హార్దిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టాడు. అతను బాబర్ అజామ్ (23), సౌద్ షకీల్ (62) లను అవుట్ చేశాడు. అక్షర్ పటేల్ డైరెక్ట్ హిట్ తో ఇమామ్ (10) ను రనౌట్ చేశాడు.
-
4 వికెట్లు కోల్పోయిన పాక్
పాకిస్తాన్ 35 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. జట్టులోని టాప్-4 బ్యాట్స్‌మెన్ అవుట్ అయ్యారు.
-
3 వికెట్ కోల్పోయిన పాక్
పాకిస్తాన్ 33.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ 46 పరుగులు చేసి ఔటయ్యాడు. క్రీజులో సౌద్ షకీల్ (57 పరుగులు) ఉన్నాడు. రిజ్వాన్‌ను ఔట్ చేయడం ద్వారా అక్షర్ పటేల్ 104 పరుగుల భాగస్వామ్యాన్ని బద్దలు కొట్టాడు.
-
వేగం పెంచిన పాక్
30 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ 2 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. జట్టు రన్ రేట్ 5 కంటే తక్కువగా ఉంది. సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ క్రీజులో ఉన్నారు. వారిద్దరి మధ్య యాభై పరుగుల భాగస్వామ్యం ఉంది. సౌద్ షకీల్, రిజ్వాల్ యాభైకి దగ్గరగా ఉన్నారు.
-
53 బంతుల్లో ఒక్క బౌండరీ కూడా రాలే..
అక్షర్ పటేల్ వేసిన 16వ ఓవర్ మొదటి బంతికే పాకిస్తాన్ తమ చివరి బౌండరీని కొట్టింది. ఆ తర్వాత, 24 ఓవర్లు ముగిసిన తర్వాత కూడా బౌండరీ కొట్టలేదు.
-
పవర్ ప్లే-2లో తగ్గిన పాకిస్తాన్ రన్ రేట్..
పవర్ ప్లే-2లో పాకిస్తాన్ రన్ రేట్ పడిపోయింది. 20 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 79/2. కెప్టెన్ రిజ్వాన్, సౌద్ షకీల్ 11 నుంచి 20 ఓవర్ల మధ్య 27 పరుగులు చేశారు.
-
నెమ్మదించిన స్కోర్ బోర్డ్
20 ఓవర్లలో పాకిస్తాన్ రెండు వికెట్లకు 79 పరుగులు చేసింది. సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ క్రీజులో ఉన్నారు. ఇమామ్ ఉల్ హక్ 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయ్యాడు. అక్షర్ పటేల్ డైరెక్ట్ త్రో ద్వారా అవుట్ అయ్యాడు.
-
రెండో వికెట్ కోల్పోయిన పాక్
బాబర్ ఔటయ్యాక ఊపిరిపీల్చుకున్న భారత జట్టు.. ఇదే క్రమంలో అద్భుత ఫీల్డింగ్‌తో పాక్ మరో వికెట్ పడగొట్టింది. కుల్డీప్ బౌలింగ్ అక్షర్ పటేల్ ఇమామ్ (10)ను పెవిలియన్ చేర్చాడు.
-
బాబార్ ఔట్..
8.2 ఓవర్లలో పాకిస్తాన్ ఒక వికెట్ కోల్పోయి 41 పరుగులు చేసింది. ఇమామ్ ఉల్ హక్, సౌద్ షకీల్ క్రీజులో ఉన్నారు. బాబర్ అజామ్ 23 పరుగులు చేసి ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ చేతికి చిక్కాడు. 5 ఫోర్లు కొట్టిన తర్వాత బాబాజ్ ఔటయ్యాడు.
-
వైడ్లతో విసుగెత్తించిన షమీ
పాకిస్తాన్ ఒక ఓవర్లో వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. బాబర్ అజామ్, ఇమామ్ ఉల్ హక్ క్రీజులో ఉన్నారు. మొదటి ఓవర్‌ను మహ్మద్ షమీ వేశాడు. అతను 5 వైడ్లు బౌలింగ్ చేశాడు.
-
భారత జట్టు:
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.
-
పాకిస్తాన్ జట్టు:
పాకిస్తాన్ (ప్లేయింగ్ XI): ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(కీపర్, కెప్టెన్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.
-
టాస్ గెలిచిన పాకిస్తాన్
దుబాయ్‌లో జరుగుతోన్న కీలక మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు టాస్ గెలిచింది. దీంతో ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
-
పాకిస్థాన్‌పై అత్యధిక పరుగులు
ఐసీసీ వన్డే టోర్నమెంట్‌లో పాకిస్థాన్‌పై రోహిత్ శర్మ అత్యధిక పరుగులు (350) చేశాడు. 400 పరుగులు పూర్తి చేయడానికి అతనికి ఇంకా 50 పరుగులు అవసరం. విరాట్ 333 పరుగులతో రెండవ స్థానంలో ఉన్నాడు. దీనికి అతనికి 67 పరుగులు అవసరం. అగ్రస్థానంలో ఉండేందుకు ఇద్దరి మధ్య పోటీ నెలకొంది.
-
భారత జట్టుతో చేరిన బుమ్రా
టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా దుబాయ్ చేరుకున్నాడు. కానీ, మ్యాచ్ ఆడడం లేదు. భారత్, పాక్ మధ్య జరిగే మ్యాచ్ చూసేందుకు ఆయన దుబాయ్ చేరుకున్నాడు.
JASPRIT BUMRAH AT DUBAI…!!!!
– Bumrah will be watching India vs Pakistan at the Ground. [📸: Sahil Malhotra] pic.twitter.com/r1jp57ylTN
— Johns. (@CricCrazyJohns) February 23, 2025
-
గిల్-రోహిత్ జోడీ 2000 పరుగులు?
వన్డేల్లో భారత్ తరపున ఓపెనర్లుగా బరిలోకి దిగిన శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ 28 ఇన్నింగ్స్‌ల్లో 71.96 సగటుతో 1943 పరుగులు చేశారు. 2000 పరుగులు పూర్తి చేయాలంటే, వారిద్దరికీ 57 పరుగుల భాగస్వామ్యం అవసరం.
-
బాబర్ ఆజం ఆడటంపై సస్పెన్స్
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌తో జరగనున్న మ్యాచ్‌కు ఒక రోజు ముందు జట్టు చివరి ప్రాక్టీస్ సెషన్‌లో బాబర్ అజామ్ కనిపించలేదు. పాకిస్తాన్ జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ ఇలా ప్రాక్టీస్ సెషన్‌కు దూరమవ్వడంతో.. ఆయన ఆడడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాబర్ ఆజం భారత్‌తో జరిగే మ్యాచ్ ఆడటం లేదా? బాబర్ ఆజం అంత ముఖ్యమైన మ్యాచ్ కు ముందు ప్రాక్టీస్ చేయకపోవడానికి కారణం ఏమిటి? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
-
పిచ్ ఎలా ఉంటుంది, టాస్ ఎంత ముఖ్యం?
దుబాయ్‌లో పిచ్ నెమ్మదిగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రారంభంలో పిచ్ బ్యాటింగ్‌కు కాస్త తేలికగా ఉంటుంది. అదే సమయంలో, ఫాస్ట్ బౌలర్లకు కూడా ప్రారంభ ఓవర్లలో సహాయం లభిస్తుంది. ఆట ముందుకు సాగుతున్న కొద్దీ, మధ్య ఓవర్లలో టర్న్ కనిపించడం ప్రారంభమవుతుంది. స్పిన్నర్ల పాత్ర కీలకంగా మారుతుంది.
సాయంత్రం వేళల్లో, గత మ్యాచ్ లాగే, దాదాపు మంచు కురవదు. లైట్ల కింద బ్యాటింగ్ చేయడం కష్టం కావచ్చు. దీని అర్థం భారతదేశం-పాకిస్తాన్ మ్యాచ్‌లో టాస్ చాలా ముఖ్యమైనది కానుంది. ఇక్కడ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయడం మంచి నిర్ణయం కావచ్చు.
-
భారత్, పాక్ మ్యాచ్‌లో యాడ్స్ రేట్స్ చూస్తే షాక్..
- 10 సెకన్ల యాడ్‌కు రూ.50 లక్షలు బ్రాడ్‌కాస్టర్ డిమాండ్ చేస్తున్నారు.
- నిమిషానికి రూ.3 కోట్లు
- 50 ఓవర్ల ఇన్నింగ్స్‌కు రూ.225 కోట్లు
- రెండు ఇన్నింగ్స్‌లు కలిపితే రూ.450 కోట్లు
- ఓవరాల్ మ్యాచ్‌కు రూ.700 కోట్లు
- ఇక ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లు రూ.2500 కోట్లు
-
పాకిస్థాన్‌పై భారత్‌కు అత్యంత చెత్త రికార్డు
ఛాంపియన్స్ ట్రోఫీలో ఉన్న అన్ని జట్లలో టీమిండియా అత్యంత చెత్త రికార్డు ఉన్న ఏకైక జట్టు పాకిస్తాన్. భారత జట్టు 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయి, 2 మ్యాచ్‌ల్లో గెలిచింది.
-
వన్డే రికార్డు ఎలా ఉందంటే?
ఇప్పటివరకు భారత్, పాకిస్తాన్ మధ్య 135 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఈ కాలంలో, భారత జట్టు 57 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, పాకిస్తాన్ జట్టు 73 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అంటే మొత్తం వన్డే రికార్డులో పాకిస్తాన్ పైచేయి సాధించిందన్నమాట.
Published On - Feb 23,2025 1:28 PM




