CCL 2025: ఢీ అంటే ఢీ.. సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో వివాదం.. గొడవకు దిగిన స్టార్ హీరోలు.. వీడియో వైరల్
సినీ తారలు పాల్గొంటోన్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్- 2025 రసవత్తరంగా సాగుతోంది. ఈ ఎంటర్ టైన్మెంట్ క్రికెట్ లీగ్ లో తెలుగు వారియర్స్ తో పాటు కర్ణాటక బుల్డోజర్స్, చెన్నై రైనోస్, బెంగాల్ టైగర్స్, భోజ్ పురి దబంగ్, పంజాబ్ ది షేర్ జట్లు తలపడుతున్నాయి.

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్ లు హోరా హోరీగా సాగుతున్నాయి. రెగ్యులర్ క్రికెట్ మ్యాచ్ లకు ఏ మాత్రం తగ్గకుండా ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తున్నాయి. స్టార్ హీరోలు కూడా ఢీ అంటే ఢీ అని తలపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా సీసీఎల్ మ్యాచ్ లో వివాదం చోటు చేసుకుంది. గ్రౌండ్ లోనే ఆటగాళ్లు గొడవకు దిగారు. అయితే తోటి ఆటగాళ్లు, అంపైర్లు సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దు మణిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. సీసీఎల్ టోర్నీలో భాగంగా శనివారం (ఫిబ్రవరి 22) రాత్రి పంజాబ్ ది షేర్, కర్ణాటక బుల్డోజర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో కర్ణాటక జట్టు కేవలం 2 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో, సుదీప్ పంజాబ్ డి షేర్ జట్ల మధ్య గొడవ జరిగింది. పంజాబ్ తరఫున బ్యాటింగ్ చేస్తున్న నింజా ఎన్జే, కీపర్ సుదీప్ మధ్య మాటల తూటాలు పేలాయి. పరిస్థితి చేయి దాటిపోయేలా కనిపించడంతో అంపైర్లు సర్ది చెప్పారు. దీంతో సుదీప్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే కర్ణాటక బుల్డోజర్స్ ప్లేయర్లంరూ నింజా ఎన్జే ను చుట్టు ముట్టారు. దీంతో అంపైర్లు మరోసారి రంగంలోకి దిగి ఆటగాళ్లకు సర్ది చెప్పారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అయితే ఈ వీడియో చివరిలో కిచ్చా సుదీప్ స్వయంగా వెళ్లి నింజాతో చేతులు కలిపాడు. అతనిని హత్తుకుని చిరునవ్వుతో మాట్లాడాడు. అలాగే పంజాబ్ కు చెందిన ఇతర ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కాగా ఈ టోర్నీలో హాట్ ఫేవరేట్స్‌లో ఒకటిగా బరిలోకి దిగిన తెలుగు వారియర్స్ పెద్దగా ఆకట్టుకోవడం లేదు. అక్కినేని సారథ్యంలోని ఆ జట్టు ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు ఆడి కేవలం ఒక దానిలో మాత్రమే విజయం సాధించింది. ఆదివారం (ఫిబ్రవరి 23) తెలుగు వారియర్స్ టీమ్ బెంగాల్ టైగర్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తేనే అక్కినేని అఖిల్ టీమ్ సెమీస్ అవకాశాలు మెరుగవుతాయి. లేదంటే ఇంటి దారి పట్టాల్సిందే.
వీడియో ఇదిగో..
ಗೊತ್ತಲ್ಲ ಯಾರ್ ಹುಡುಗರು ಅಂತ 😎 ಪ್ರೀತಿ ಇಂದ ಬಂದ್ರೆ ಮಾಣಿಕ್ಯ 💎
ಮುಟ್ಟೋಕೆ ಬಂದ್ರೆ ಬಚ್ಚನ್ 🤙🏻 ಬಂದ್ವ ಹೋದ್ವ ಅಷ್ಟೇ ಇಟ್ಕೋ ಬೇಕು 🤫@ccl @Karbulldozers @KicchaSudeep #Karnatakabulldozers pic.twitter.com/AMVuktCt1r
— 𝗸𝗮𝗿𝘂𝗻𝗮𝗮𝗱𝗮-𝓴𝓲𝓬𝓬𝓱𝓪👑 (@kiladi46441) February 22, 2025








