AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Azadi Ka Amrit Mahotsav: ప్రపంచ క్రికెట్‌లో భారత ఆటగాళ్ల భారీ రికార్డులు.. వీటిని బ్రేక్ చేయడం అసాధ్యమే..!

ఈ 75 ఏళ్ల ప్రయాణంలో క్రీడా ప్రపంచంలో కూడా భారత క్రీడాకారులు తమ ఆటతీరుతో దేశం పేరును చాటిచెప్పారు. క్రికెట్‌లో భారత జట్టు విభిన్న ఎత్తులకు చేరుకుంది. ఈ సమయంలో, భారత ఆటగాళ్లు బద్దలు కొట్టడం దాదాపు అసాధ్యమైన అనేక రికార్డులను సృష్టించారు.

Azadi Ka Amrit Mahotsav: ప్రపంచ క్రికెట్‌లో భారత ఆటగాళ్ల భారీ రికార్డులు.. వీటిని బ్రేక్ చేయడం అసాధ్యమే..!
Indian Cricket Team
Venkata Chari
|

Updated on: Aug 15, 2022 | 6:55 AM

Share

Azadi Ka Amrit Mahotsav: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతాయి. ఈ ప్రత్యేక సందర్భాన్ని చిరస్మరణీయం చేసేందుకు దేశవ్యాప్తంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ 75 ఏళ్ల ప్రయాణంలో క్రీడా ప్రపంచంలో కూడా భారత క్రీడాకారులు తమ ఆటతీరుతో దేశం పేరును చాటిచెప్పారు. క్రికెట్‌లో భారత జట్టు విభిన్న ఎత్తులకు చేరుకుంది. ఈ సమయంలో, భారత ఆటగాళ్లు బద్దలు కొట్టడం దాదాపు అసాధ్యమైన అనేక రికార్డులను సృష్టించారు. అలాంటి కొన్ని రికార్డుల గురించి తెలుసుకుందాం..

  1. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు – అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు సాధించడం ఏ బ్యాట్స్‌మెన్‌కైనా చాలా కష్టం. అయితే, భారత దిగ్గజ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ మాత్రం 100 సెంచరీలు పూర్తి చేసి, భారత్ పేరును ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పారు. అయితే, ఈ రికార్డ్‌ను విరాట్‌ కోహ్లి బద్దలు కొట్టే అవకాశం ఉందని ముందుగా అనుకున్నారు. అయితే ప్రస్తుతం విరాట్ పాత ఫామ్‌తో ఇబ్బందులు పడడం చూస్తే.. ఈ రికార్డ్‌ను బ్రేక్ చేసే అవకాశం లేదు. దాదాపు వెయ్యి రోజుల పాటు 70 సెంచరీల ఫిగర్‌లోనే నెట్టుకొస్తున్నాడు.
  2. వన్డేల్లో అత్యుత్తమ స్కోరు – భారత కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే ఇంటర్నేషనల్‌లో అత్యధిక స్కోరు చేసిన రికార్డును కలిగి ఉన్నాడు. 2014లో ఈడెన్ గార్డెన్స్ మైదానంలో శ్రీలంకపై రోహిత్ 264 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ స్కోరును చేరుకోవడం ఏ బ్యాట్స్‌మెన్‌కైనా కష్టమే. ఈ విషయంలో రోహిత్ తర్వాత న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గప్టిల్ 243 పరుగుల వ్యక్తిగత స్కోరుతో రెండో స్థానంలో ఉన్నాడు.
  3. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు – అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డు సృష్టించాడు. టెండూల్కర్ 664 మ్యాచ్‌ల్లో 34357 పరుగులు చేశాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర 28016 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ యాక్టివ్ ప్లేయర్స్ పేరిట 23726 పరుగులు చేశాడు. అయితే సచిన్ రికార్డును చేరుకోవడం కోహ్లీకి చాలా అసాధ్యంగా మారింది.
  4. వరుసగా మెయిడిన్ ఓవర్ల రికార్డు – టెస్టు క్రికెట్ చరిత్రలో భారత బౌలర్ బాపు నాదకర్ణికి అద్భుతమైన రికార్డు ఉంది. ఒక టెస్టులో వరుసగా 131 బంతుల్లో ఒక్క పరుగు కూడా ఇవ్వని రికార్డు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ బాపు పేరిట ఉంది. ఈ సమయంలో అతను వరుసగా 21 మెయిడిన్లు బౌలింగ్ చేశాడు. 1964లో ఇంగ్లండ్‌తో జరిగిన మద్రాస్ టెస్టు మ్యాచ్‌లో బాపు నాదకర్ణి ఈ ఘనత సాధించారు. ప్రస్తుత టెస్ట్ క్రికెట్ తీరు చూస్తుంటే, బాపు నాదకర్ణి రికార్డును ఏ ఆటగాడు బద్దలు కొట్టలేడు.
  5. ఇవి కూడా చదవండి
  6. టెస్టు కెరీర్‌లో అత్యధిక బంతులు ఆడిన రికార్డు – టీమ్ ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను ‘ది వాల్’ అని పిలుస్తుంటారు. రాహుల్ ద్రవిడ్ తన 16 ఏళ్ల టెస్టు కెరీర్‌లో 164 మ్యాచ్‌ల్లో 31258 బంతులు ఎదుర్కొన్నాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక బంతులు ఆడిన ఆటగాడిగా రాహుల్ ద్రవిడ్ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో ద్రవిడ్ సహచరుడు సచిన్ టెండూల్కర్ 29437 బంతులతో రెండో స్థానంలో ఉన్నాడు.
  7. అత్యధిక స్టంపింగ్‌లు- అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక స్టంపింగ్‌లు చేసిన ఆటగాడిగా భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డు సృష్టించాడు. ధోనీ 538 మ్యాచ్‌ల్లో మొత్తం 195 స్టంపింగ్స్ చేశాడు. శ్రీలంక మాజీ ఆటగాళ్లు కుమార సంగక్కర (139), రొమేష్ కలువితర్ణ (101) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.