T20 Cricket: 5 ఫోర్లు, 6 సిక్సులు.. 33 బంతుల్లో 220పైగా స్ట్రైక్‌రేట్‌తో పరుగులు.. బౌలర్ల తాటతీసిన వికెట్ కీపర్..

|

Dec 24, 2022 | 2:30 PM

లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మెల్‌బోర్న్ స్టార్స్ ఒత్తిడికి లోనవడంతో జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. మిడిల్ ఆర్డర్‌లో బ్యూ వెబ్‌స్టర్ అత్యధికంగా 43 పరుగులు చేయగా..

T20 Cricket: 5 ఫోర్లు, 6 సిక్సులు.. 33 బంతుల్లో 220పైగా స్ట్రైక్‌రేట్‌తో పరుగులు.. బౌలర్ల తాటతీసిన వికెట్ కీపర్..
Josh Inglis Bbl 2022
Follow us on

కేఎఫ్‌సీ బిగ్ బాష్ లీగ్ 12వ సీజన్‌లో డిసెంబర్ 23 శుక్రవారం రెండు మ్యాచ్‌లు జరిగాయి. మొదటి మ్యాచ్‌లో, పెర్త్ స్కార్చర్స్ 61 పరుగుల తేడాతో మెల్‌బోర్న్ స్టార్స్‌ను ఓడించగా, రెండవ మ్యాచ్‌లో, బ్రిస్బేన్ హీట్ అడిలైడ్ స్ట్రైకర్స్‌పై 6 పరుగులతో విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ స్కోరు 33 పరుగుల వద్ద తొలి దెబ్బ తగిలింది. ఆడమ్ లిత్ 7 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక్కడ నుండి ఫాఫ్ డు ప్లెసిస్, నిక్ హాబ్సన్ మధ్య అర్ధ సెంచరీ భాగస్వామ్యంతో జట్టు స్కోరును 103కి తీసుకెళ్లారు. ఫాఫ్ 33 బంతుల్లో 68 పరుగులు చేయగా, హాబ్సన్ కూడా 46 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. మిడిలార్డర్‌లో జోష్ ఇంగ్లిస్ వేగంగా బ్యాటింగ్ చేసి 33 బంతుల్లో 6 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 73 పరుగులు చేశాడు. ఆరోన్ హార్డీ కూడా 30 పరుగులు చేశాడు. దీంతో ఆ జట్టు 20 ఓవర్లలో 229/7 స్కోరు చేసింది. మెల్‌బోర్న్ స్టార్స్‌లో ల్యూక్ వుడ్ ఐదు వికెట్లు తీశాడు.

లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మెల్‌బోర్న్ స్టార్స్ ఒత్తిడికి లోనవడంతో జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. మిడిల్ ఆర్డర్‌లో బ్యూ వెబ్‌స్టర్ అత్యధికంగా 43 పరుగులు చేయగా, నిక్ లార్కిన్ కూడా 34 పరుగులు చేశాడు. బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. దీంతో జట్టు 168/8లకే పరిమితమైంది.

బ్రిస్బేన్ హీట్ vs అడిలైడ్ స్ట్రైకర్స్..

తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ 20 ఓవర్లలో 166/9 పరుగులు చేసింది. జట్టు తరపున శామ్ బిల్లింగ్స్ 48 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేశాడు. మ్యాక్స్ బ్రయంట్ 46 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అడిలైడ్ స్ట్రైకర్స్ తరపున మాథ్యూ షార్ట్, వెస్ అగర్ చెరో మూడు వికెట్లు తీశారు.

ఇవి కూడా చదవండి

కౌంటర్ ఇన్నింగ్స్ ఆడుతూ జట్టు స్కోరు 14 పరుగుల వరకు ఓపెనర్లిద్దరూ వెనుదిరిగారు. క్రిస్ లిన్, ఆడమ్ హోస్ కూడా వరుసగా 12. 8 పరుగుల వద్ద ఔటయ్యారు. మిడిల్ ఆర్డర్‌లో థామస్ కెల్లీ, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ వరుసగా 43, 37 పరుగులు చేశారు. అయితే హ్యారీ నిల్సన్ 24 పరుగులతో ఆకట్టుకున్నా.. జట్టు 160/9 మాత్రమే చేయగలిగింది. దీంతో ప్రస్తుత సీజన్‌లో మొదటి ఓటమిని చవిచూసింది. బ్రిస్బేన్ హీట్ తరపున లెగ్ స్పిన్నర్ మార్క్ స్టెకెటీ అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..