AUS vs IND Highlights, WTC Final 2023 Day 2: ముగిసిన రెండో రోజు ఆట.. టీమిండియా స్కోరు ఎంతంటే?
Australia vs India Highlights: ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా జట్టులో ట్రావిస్ హెడ్ (163 పరుగులు), స్టీవ్ స్మిత్ (121 పరుగులు) సెంచరీ ఇన్నింగ్స్ ఆడారు. డేవిడ్ వార్నర్ 43, అలెక్స్ కారీ 42 పరుగులు చేశారు.
Australia vs India Highlights in Telugu: ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా జట్టులో ట్రావిస్ హెడ్ (163 పరుగులు), స్టీవ్ స్మిత్ (121 పరుగులు) సెంచరీ ఇన్నింగ్స్ ఆడారు. డేవిడ్ వార్నర్ 43, అలెక్స్ కారీ 42 పరుగులు చేశారు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC)లో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇంగ్లండ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. లండన్‌లోని ఓవల్ మైదానంలో తొలిరోజు భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలిరోజు ఆటముగిసే సమయానికి ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో ఉంది. ఆ జట్టు 3 వికెట్లకు 327 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 146, స్టీవ్ స్మిత్ 95 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. రెండో రోజు వీరిద్దరూ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కు నాయకత్వం వహించనున్నారు. భారత్ నుంచి మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ మాత్రమే వికెట్లు తీయగలిగారు. నేడు రెండో రోజు ఆట మధ్యాహ్నం 3 గంటల నుంచి జరగనుంది.
ఇరుజట్లు:
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ(కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, శ్రీకర్ భరత్(కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
LIVE Cricket Score & Updates
-
రెండోరోజు ఆట పూర్తి.. ఆసీస్ దే ఆధిపత్యం
డబ్ల్యూటీసీ ఫైనల్లో రెండో రోజు ఆట పూర్తయింది. ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 5 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రహానె (29), శ్రీకర్ భరత్ (5) కొనసాగుతున్నారు. అంతకుముందు ఆసీస్ 469 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ ఇంకా 318 పరుగుల వెనుకంజలో ఉంది.
-
ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా.. క్రీజులోకి తెలుగబ్బాయి..
రవీంద్ర జడేజా (48) ఔటయ్యాడు. నిలకడగా ఆడుతున్న అతను నాథన్ లయోన్ బౌలింగ్ లో స్లిప్ లో స్మిత్ కు దొరికిపోయాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు. రహానే 29 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
-
-
100 పరుగులకు చేరిన టీమిండియా..
భారత్ 4 వికెట్లకు 100 పరుగులు చేసింది. అజింక్యా రహానే 17, రవీంద్ర జడేజా 20 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
కోహ్లీ వికెట్ డౌన్..
టీమిండియా కష్టాల్లో కూరుకపోయింది. వరుసగా వికెట్లు కోల్పోతోంది. తాజాగా విరాట్ కోహ్లీ (14) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలోకి జారుకుంటోంది. రోహిత్ 15, గిల్ 13, పుజరా14 పరుగుల వద్ద పెవిలియన్ చేరారు.
-
టీ విరామ సమయానికి 2 వికెట్లు కోల్పోయిన భారత్..
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో టీ విరామ సమయానికి రెండు వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది. ఛెతేశ్వర్ పుజారా 3, విరాట్ కోహ్లీ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.
13 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ ఔటయ్యాడు. అతను స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అంతకుముందు 15 పరుగుల వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ ఔటయ్యాడు. అతన్ని పాట్ కమిన్స్ ఎల్‌బీడబ్ల్యూ చేశాడు.
-
-
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా..
టీమిండియా కష్టాల్లో కూరుకపోయింది. వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. రోహిత్ 15, గిల్ 13 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం భారత్ 2 వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసింది.
-
రోహిత్ ఔట్..
రోహిత్ శర్మ బ్యాడ్ ఫాం కొనసాగుతూనే ఉంది. కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో సత్తా చాటకుండానే 15 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో 30 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది.
-
469 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్..
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా మధ్య లండన్‌లోని ఓవల్ మైదానంలో జరుగుతోంది. నేడు రెండో రోజు మ్యాచ్‌లో రెండో సెషన్ కొనసాగుతోంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌట్ అయింది. మహ్మద్ సిరాజ్ 4 వికెట్లతో మెరిశాడు.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో అలెక్స్ కారీ 42 పరుగులు, స్టీవ్ స్మిత్ 121, ట్రావిస్ హెడ్ 163 ఆకట్టుకున్నారు.
ఇక భారత్ తరపున మహ్మద్ సిరాజ్ 4, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ తలో రెండు వికెట్లు తీశారు. జడేజాకు ఒక వికెట్ దక్కింది.
-
9 వికెట్లు డౌన్..
లంచ్ తర్వాత రెండు కోల్పోయిన ఆస్ట్రేలియా.. ప్రస్తుతం 9 వికెట్లకు 468 పరుగులతో నిలిచింది. క్రీజులో పాట్ కమ్మిన్స్ 9, బోలాండ్ 0 ఉన్నారు. సిరాజ్ 3, జడేజా 1, షమీ, శార్దుల్ తలో 2 వికెట్లు పడగొట్టారు.
-
ముగిసిన తొలి సెషన్..
రెండో రోజు మ్యాచ్ తొలి సెషన్ ముగిసింది. లంచ్ సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లకు 422 పరుగులు చేసింది. అలెక్స్ కారీ 21, పాట్ కమిన్స్ 2 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.
మిచెల్ స్టార్క్ 5 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. అంతకుముందు స్టీవ్ స్మిత్ (121 పరుగులు) శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. కామెరాన్ గ్రీన్ 6, ట్రావిస్ హెడ్ 163 పరుగుల వద్ద ఔటయ్యారు.
భారత్ తరపున శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ తలో రెండు వికెట్లు తీశారు.
-
400 దాటిన స్కోర్..
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లకు 402 పరుగులు చేసింది. అలెక్స్ కారీ 13, పాట్ కమిన్స్ 0 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.
మిచెల్ స్టార్క్ 5 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. అంతకుముందు స్టీవ్ స్మిత్ (121 పరుగులు) శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. కామెరాన్ గ్రీన్ 6, ట్రావిస్ హెడ్ 163 పరుగుల వద్ద ఔటయ్యారు.
భారత్ తరఫున శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ తలో రెండు వికెట్లు తీశారు.
-
స్మిత్ ఔట్.. లార్డ్ శార్దుల్ చేతికి చిక్కిన డేంజరస్ ప్లేయర్..
స్టీవ్ స్మిత్ (121) సెంచరీ తర్వాత పెవిలియన్ చేరాడు. లార్డ్ శార్దుల్ అద్బుతమైన డెలివరీకి బౌల్డ్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా 387 పరుగుల వద్ద 6వ వికెట్ కోల్పోయింది.
-
5వ వికెట్ కోల్పోయిన ఆసీస్..
గ్రీన్ (6) రూపంలో ఆస్ట్రేలియా 5 వ వికెట్‌ను కోల్పోయింది. షమీ అద్భుతమైన బంతికి గ్రీన్ గిల్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు.
-
ఎట్టకేలకు భారీ భాగస్వామ్యానికి బ్రేకులు వేసిన సిరాజ్
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 361 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 110 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ట్రావిస్ హెడ్ 163 పరుగుల వద్ద ఔటయ్యాడు. మహ్మద్ సిరాజ్ బౌలింగ్ లో కేఎస్ భరత్ చేతికి చిక్కాడు. భారత్ తరపున మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీయగా, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్ ఒక్కో వికెట్ తీశారు.
స్టీవ్ స్మిత్ తన 31వ టెస్టు సెంచరీని నమోదు చేశాడు. భారత్‌పై స్మిత్ 9వ సెంచరీ చేశాడు. ఈ విషయంలో ఇంగ్లండ్‌కు చెందిన జో రూట్‌ను సమం చేశాడు.
-
భారీ స్కోర్ దిశగా ఆస్ట్రేలియా..
రెండో రోజు మ్యాచ్‌లో తొలి సెషన్ కొనసాగుతోంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లకు 345 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 153, స్టీవ్ స్మిత్ 105 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇద్దరి మధ్య 250+ భాగస్వామ్యం ఉంది.
స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ సెంచరీలు చేశారు. స్మిత్ టెస్టు కెరీర్‌లో 31వ సెంచరీ సాధించగా, హెడ్ 5వ సెంచరీ సాధించాడు.
-
స్మిత్ సెంచరీ..
రెండో రోజు ఆట మొదలైంది. తొలి ఓవర్ లోనే స్మిత్ వరుస ఫోర్లతో తన 31వ సెంచరీని పూర్తి చేశాడు. దీంతో నేడు కూడా ఆస్ట్రేలియా దూకుడు కొనసాగుతుందని హింట్ ఇచ్చేశారు.
-
WTC Final: ఆస్ట్రేలియా చరిత్రను భారత్ తిరగరాస్తుందా?
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఫైనల్ గెలవాలంటే.. ఆస్ట్రేలియాపై చరిత్ర తిరగరాయాల్సిందే. ట్రావిస్ హెడ్ సెంచరీ చేసినప్పుడల్లా ఆస్ట్రేలియా ఓడిపోలేదు. అలాగే ఆస్ట్రేలియా జట్టు వైపు 250 ప్లస్ పరుగుల భాగస్వామ్యం 32 సార్లు టెస్ట్ క్రికెట్‌లో కనిపించింది. ఈ 32 పర్యాయాలు కూడా ఆస్ట్రేలియా ఓడిపోలేదు. స్మిత్, హెడ్ మధ్య 251 పరుగుల భాగస్వామ్యం నెలకొన్న సంగతి తెలిసిందే.
-
IND vs AUS: మరికొద్ది సేపట్లో రెండో రోజు ఆట ప్రారంభం..
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో నేడు రెండో రోజు. రెండవ రోజు ఆట ప్రారంభం కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. పటిష్ట స్థితిలో కనిపిస్తోన్న ఆస్ట్రేలియాను నేడు టీమిండియా బౌలర్లు అడ్డుకుంటారా లేదా మరోసారి చెత్త ప్రదర్శనతో విఫలమవుతారా అనేది చూడాల్సి ఉంది.
Published On - Jun 08,2023 2:28 PM