బాక్సింగ్ డే టెస్టులో 2015 నాటి సీన్ రిపీట్.. ధోని రిటైర్మెంట్ సిరీస్‌లో ఏం జరిగిందో తెలుసా?

|

Dec 26, 2024 | 1:51 PM

Melbourne Boxing Day Test Australia vs India: మెల్‌బోర్న్‌లో భారత్‌తో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్ అద్భుతం చేశారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లోని నాలుగో టెస్టు తొలి రోజున, ఆతిథ్య జట్టులోని టాప్ ఫోర్ బ్యాట్స్‌మెన్లు 50 ప్లస్ స్కోర్లు చేశారు. ఈ క్రమంలో 2015 నాటి ధోని రిటైర్మెంట్ సిరీస్‌లా మారేలా కనిపిస్తోంది.

బాక్సింగ్ డే టెస్టులో 2015 నాటి సీన్ రిపీట్.. ధోని రిటైర్మెంట్ సిరీస్‌లో ఏం జరిగిందో తెలుసా?
Ind Vs Aus 2015 Test
Follow us on

Melbourne Boxing Day Test Australia vs India: మెల్‌బోర్న్‌లో భారత్‌తో జరుగుతున్న టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్ అద్భుత ప్రదర్శన చేశారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లోని నాలుగో టెస్టు తొలి రోజున, ఆతిథ్య జట్టులోని టాప్ నలుగురు బ్యాట్స్‌మెన్లు 50 ప్లస్ స్కోర్లు చేశారు. భారత్‌తో జరిగిన టెస్టులో సామ్ కాన్స్టాస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవ్ స్మిత్ అర్ధశతకాలు సాధించారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా జట్టు నుంచి సొంతగడ్డపై ఇలాంటి అద్భుతం జరిగింది. ఆసక్తికరంగా, చివరిసారి కూడా ఈ అద్భుతం భారత్‌పై మాత్రమే జరగడం గమనార్హం. 2015లో, సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా టాప్ ఆరు బ్యాటర్స్ 50 ప్లస్ స్కోర్ చేశారు. ఆ సిరీస్‌లో ఎంఎస్ ధోని రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుత సిరీస్‌లో ఆర్‌ అశ్విన్‌ రిటైరయ్యాడు.

మెల్‌బోర్న్ టెస్టులో భారత్‌పై ఆస్ట్రేలియా తరపున కాన్స్టాస్ తొలిసారి హాఫ్ సెంచరీ సాధించాడు. అతను తన అరంగేట్రం టెస్టులో 60 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. రవీంద్ర జడేజా వేసిన బంతికి అతను ఔటయ్యాడు. ఖవాజా 121 బంతులు ఆడి 57 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు ఉన్నాయి. లాబుషాగ్నే 72 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో రెండోసారి అర్ధ సెంచరీ సాధించాడు. అతను 145 బంతులు ఆడి ఏడు ఫోర్లు కొట్టి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 50 పరుగుల మార్కును దాటిన నాలుగో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌గా స్టీవ్ స్మిత్ నిలిచాడు. ఈ సిరీస్‌లో రెండోసారి 50కిపైగా పరుగులు కూడా చేశాడు.

2015లో 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఆస్ట్రేలియా టాప్-6 ప్లేయర్స్..

2015లో భారత్‌తో స్వదేశంలో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా టాప్‌ ఫోర్‌ బ్యాట్స్‌మెన్స్ 50కిపైగా స్కోరు చేశారు. దీంతో మ్యాచ్‌ డ్రా అయింది. ఆపై స్టీవ్ స్మిత్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. అతను 117, 71 పరుగుల ఇన్నింగ్స్‌లు ఆడాడు. 2015 సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో క్రిస్ రోజర్స్ 95, డేవిడ్ వార్నర్ 101, షేన్ వాట్సన్ 81, స్మిత్ 117, షాన్ మార్ష్ 73, జో బర్న్స్ 58 పరుగులు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..