AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: రోహిత్ సేనకు అదిరిపోయే న్యూస్.. గబ్బాలో జీరోగా మారిన అడిలైడ్‌లో హీరో..

Travis Head: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ట్రావిస్ హెడ్ భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాడు. అడిలైడ్‌లో సెంచరీ సాధించిన అతను టీమిండియా ఓటమిలో కీలక పాత్ర పోషించాడు. కానీ, గబ్బా మైదానంలో గత మూడు ఇన్నింగ్స్‌ల్లో సున్నాకే ఔట్ కావడంతో రోహిత్ జట్టుకు కాస్త ఊరట లభించింది. అయితే, హెడ్ ఓవరాల్ ఫామ్ భారత్‌కు మాత్రం ఆందోళన కలిగిస్తోంది.

IND vs AUS: రోహిత్ సేనకు అదిరిపోయే న్యూస్.. గబ్బాలో జీరోగా మారిన అడిలైడ్‌లో హీరో..
Travis Head Century
Venkata Chari
|

Updated on: Dec 13, 2024 | 12:43 PM

Share

Travis Head: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో రోహిత్ జట్టుకు ట్రావిస్ హెడ్ అతిపెద్ద తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. అడిలైడ్‌లో తుఫాన్ సెంచరీతో చెలరేగిన హెడ్.. టీమిండియా ఓటమికి ప్రధాన కారణం. ఇలా బ్రిస్బేన్ టెస్టుకు ముందు హెడ్ ఫామ్ టీమ్ ఇండియాను ఆందోళనకు గురి చేసింది. అడిలైడ్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హెడ్ 141 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో టీమ్ ఇండియాకు చాలా నష్టం వాటిల్లింది. ఎట్టకేలకు అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ జట్టులో హెడ్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్లు భారత జట్టు ముందు బలహీనంగా ఉన్నారని రెండు టెస్టుల్లోనూ రుజువైంది.

దీంతో మూడో టెస్టులో తలపడేందుకు టీమిండియా చాలా వ్యూహాలు రచిస్తోంది. కాగా, మూడో టెస్టు జరగనున్న గబ్బా మైదానంలో హెడ్ ఆటతీరుతో రోహిత్ సేనకు కాస్త ఊరట లభించింది. ఎందుకంటే, ఈ గ్రౌండ్‌లో ఆడిన గత 3 ఇన్నింగ్స్‌ల్లో హెడ్ ఖాతా తెరవలేకపోయాడు.

ఈ విధంగా, ట్రావిస్ హెడ్ గత 724 రోజులుగా గబ్బా మైదానంలో ఖాతా తెరవలేదు. హెడ్ ​​ఈ ఏడాది జనవరిలో ఇదే మైదానంలో వెస్టిండీస్‌తో ఆడాడు. ఆశ్చర్యకరంగా అతను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఖాతా తెరవలేదు. ఇది అతని టెస్ట్ కెరీర్‌లో హెడ్‌కి తొలి జీరో ఔట్‌గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ రెండు ఇన్నింగ్స్‌లకు ముందు హెడ్ ఆడిన ఒక్క ఇన్నింగ్స్‌లో కూడా ఖాతా తెరవలేకపోయాడు. 2022లో శ్రీలంకపై ట్రావిస్ హెడ్ కూడా సున్నాకే పెవిలియన్ చేరాడు. అంటే, గబ్బాలో గత మూడు ఇన్నింగ్స్‌ల్లో హెడ్ నిల్ అవుట్ అయ్యాడు.

కానీ, హెడ్ బ్రిస్బేన్‌లో వరుసగా మూడు టెస్ట్ ఇన్నింగ్స్‌లలో 0 పరుగులకే అవుట్ అయ్యి ఉండవచ్చు. అయినప్పటికీ, ఈ మైదానంలో అతని సగటు 50 కంటే ఎక్కువగా నిలిచింది. గబ్బాలో ఇప్పటివరకు 7 ఇన్నింగ్స్‌లు ఆడిన హెడ్ 50.28 సగటుతో 352 పరుగులు చేశాడు. ఈ మైదానంలో ఒక సెంచరీ, 2 అర్ధసెంచరీలు చేశాడు.

ప్రస్తుతం ట్రావిస్ హెడ్ మంచి ఫామ్‌లో ఉండటం భారత్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ముందుగా పెవిలియన్‌కు పంపకపోతే టీమ్ ఇండియా గెలవడం కష్టమే. హెడ్ ​​మరో స్పెషాలిటీ ఏంటంటే.. అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ చేసిన ప్రతిసారీ ఆస్ట్రేలియా గెలుపొందింది. అందువల్ల గబ్బాలో హెడ్ సెంచరీతో చెలరేగకుండా భారత పేసర్లు అడ్డుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టూరిస్టులు ఎగిరి గంతేసే న్యూస్..! జనవరిలో విశాఖలో పండగే పండగ..
టూరిస్టులు ఎగిరి గంతేసే న్యూస్..! జనవరిలో విశాఖలో పండగే పండగ..
పగటి నిద్రతో కలిగే అద్భుత ప్రయోజనాలు!
పగటి నిద్రతో కలిగే అద్భుత ప్రయోజనాలు!
హైదరాబాద్‌లో తొలి తరహా లగ్జరీ మేకప్ స్టూడియో..
హైదరాబాద్‌లో తొలి తరహా లగ్జరీ మేకప్ స్టూడియో..
నెల్లూరు లేడీ డాన్‌ అరుణపై పీడీ యాక్ట్‌.. కడప జైలుకు తరలింపు
నెల్లూరు లేడీ డాన్‌ అరుణపై పీడీ యాక్ట్‌.. కడప జైలుకు తరలింపు
హృతిక్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. టీమిండియా తోపు క్రికెటర్ భార్య
హృతిక్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. టీమిండియా తోపు క్రికెటర్ భార్య
గుండెకు హాని చేసే ఆహారాలు.. ఈ 5 రకాల ఫుడ్స్‌కు దూరంగా ఉండండి!
గుండెకు హాని చేసే ఆహారాలు.. ఈ 5 రకాల ఫుడ్స్‌కు దూరంగా ఉండండి!
టేస్టీగా ఉన్నాయని ఆ ఫుడ్స్ అతిగా తినేశారంటే.. మీ కిడ్నీ షెడ్డుకే
టేస్టీగా ఉన్నాయని ఆ ఫుడ్స్ అతిగా తినేశారంటే.. మీ కిడ్నీ షెడ్డుకే
అఖండ 2 సినిమాలో బాలయ్య కూతురిగా నటించిన ఈ అమ్మాయి ఎవరంటే..
అఖండ 2 సినిమాలో బాలయ్య కూతురిగా నటించిన ఈ అమ్మాయి ఎవరంటే..
భారతీయులు 5201314 నంబర్‌ను ఎందుకు ఎక్కువ సెర్చ్‌ చేశారు?
భారతీయులు 5201314 నంబర్‌ను ఎందుకు ఎక్కువ సెర్చ్‌ చేశారు?
అనుష్కతో సినిమా చేస్తున్న డైరెక్టర్‌‌కు నాగార్జున వార్నింగ్
అనుష్కతో సినిమా చేస్తున్న డైరెక్టర్‌‌కు నాగార్జున వార్నింగ్