ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు 2-1 తేడాతో ఓటమి పాలైంది. ముంబైలో విజయంతో ఆరంభించిన రోహిత్ సేన గత రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో సిరీస్ కూడా చేజారిపోయింది. చెన్నైలో జరిగిన మూడో, చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీం ఇండియా విజయానికి 270 పరుగులు మాత్రమే చేయాల్సి ఉండగా.. 49.1 ఓవర్లలో కేవలం 248 పరుగులకే ఆలౌటైంది. ఈ ఓటమితో సిరీస్‌ను ఆసీస్‌కు అప్పగించేసింది టీమ్ ఇండియా. దీంతో పాటు వన్డేల్లో నంబర్ వన్ ర్యాంక్‌ను కూడా కంగారూలకు ఇచ్చేసింది. వన్డే సిరీస్ ముందు భారత క్రికెట్ జట్టు నంబర్ 1 జట్టుగా బరిలోకి దిగింది. అయితే సిరీస్ కోల్పోయిన వెంటనే ఆ కిరీటాన్ని కోల్పోయింది. ఆస్ట్రేలియా ఇప్పుడు ప్రపంచంలోనే నంబర్ 1 వన్డే జట్టుగా అవతరించింది. టీమిండియా, ఆస్ట్రేలియా సమానంగా రేటింగ్ పాయింట్లు ఉన్నప్పటికీ, ఆస్ట్రేలియా దశాంశ పాయింట్ల తేడాతో ముందంజలో ఉంది. ఒకవేళ ఆస్ట్రేలియా ఈ సిరీస్‌ను 2-1తో ఓడిపోయి ఉంటే, ఆ జట్టు నాలుగో ర్యాంక్‌కు పడిపోయేది. న్యూజిలాండ్ రెండో స్థానానికి, ఇంగ్లండ్ మూడో స్థానానికి చేరుకునేవి. అయితే ఆస్ట్రేలియా భారత్‌ను తన సొంత మైదానంలో ఓడించింది.
కాగా భారత్‌లో ఆడిన చివరి 3 వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు 2 సిరీసుల్లో విజయం సాధించింది. 2019 సంవత్సరంలో, ఆస్ట్రేలియా 0-2 వెనుకబడినప్పటికీ వరుసగా మూడు మ్యాచ్‌లను గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈసారి కూడా ఆస్ట్రేలియా 0-1తో వెనుకబడి, మరోసారి వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. కాగా సిరీస్ ఓటమిపై స్పందించిన రోహిత్.. పరాజయానికి ఒకరిద్దరు ఆటగాళ్లను నిందించలేనని, ఈ ఓటమి మొత్తం జట్టుకే చెందుతుందన్నాడు. మరో ఐదు నెలల్లో ప్రపంచకప్ ఆడాల్సి ఉందని, అప్పటిలోపు అన్ని లోటుపాట్లను సరిచేసుకుంటామని హిట్‌మ్యాన్ చెప్పుకొచ్చాడు.
We have a new World No.1 ?
Australia climb to the top of the @MRFWorldwide ICC Men’s ODI Team Rankings after the series victory against India ?
?: https://t.co/CXyR2x0PJJ pic.twitter.com/Ujz1xrWpw0
— ICC (@ICC) March 22, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి.