బ్రిస్బేన్ మైదానంలో వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో విజయానికి 156 పరుగుల దూరంలో ఉంది ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా. పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లో మూడో రోజు వెస్టిండీస్ తన రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకు ఆలౌటైంది. దీంతో నాలుగో ఇన్నింగ్స్‌లో 216 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూ జట్టు రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. విజయానికి ఆసీస్ ఇంకా 156 పరుగులు చేయాల్సి ఉంది. అయితే వెస్టిండీస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ విసిరిన ఓ డెడ్లీ యార్కర్ కు కరేబియన్ ఆటగాడు షమర్ జోసెఫ్ బొటనవేలు విరిగింది. ఫలితంగా, షమర్ జోసెఫ్ బ్యాటింగ్ చేయలేకపోయాడు. వెంటనే రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని విడిచిపెట్టాడు.
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 73వ ఓవర్ బౌలింగ్ చేయడానికి స్టార్క్ వచ్చాడు. అప్పటికి వెస్టిండీస్ జట్టు స్కోరు 9 వికెట్ల నష్టానికి 193 పరుగులు. విండీస్ తరఫున షామర్ జోసెఫ్ స్ట్రైక్‌లో ఉన్నాడు. ఓవర్ నాలుగో బంతికి స్టార్క్ బౌలింగ్ లో ఇన్స్వింగ్ యార్కర్ వేశాడు. బంతి నేరుగా జోసెఫ్ కాలి బొటనవేలను తాకింది. దీంతో పాటు ఆస్ట్రేలియా జట్టు కూడా ఎల్బీడబ్ల్యూకి అప్పీల్ చేసింది. కానీ స్టార్క్ నో బాల్ వేయడంతో షమర్ ఔట్ నుంచి తప్పించుకున్నాడు. కానీ బంతి జోసెఫ్ బొటన వేలికి బలంగా తాకడంతో అతను నొప్పితో విలవిల్లాడిపోయాడు.షమర్ జోసెఫ్ వెంటనే షూస్ తీసేసి మైదానంలో పడిపోయాడు. ఫిజియో వెంటనే డ్రెస్సింగ్ రూమ్ నుండి వచ్చి ప్రథమ చికిత్స అందించాడు. దీంతో షామర్ లేచి నిలబడేందుకు ప్రయత్నించాడు. కానీ లేచి నడవలేకపోయాడు. అతను రిటైర్డ్ హర్ట్ గా మైదానాన్ని వీడాల్సి వచ్చింది. దీంతో వెస్టిండీస్ జట్టు రెండో ఇన్నింగ్స్ కూడా 193 పరుగులకే ముగిసింది.
Shamar Joseph has to retire hurt after this toe-crusher from Mitch Starc!
Australia need 216 to win #AUSvWI pic.twitter.com/3gAucaEfwg
— cricket.com.au (@cricketcomau) January 27, 2024
ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో క్రిక్ మెకెంజీ జట్టు తరపున అత్యధిక ఇన్నింగ్స్‌లో 41 పరుగులు చేశాడు. అలిక్ అథానాజే 35 పరుగులు, జస్టిన్ గ్రీవ్స్ 33 పరుగులు అందించారు. అతను మినహా మిగిలిన జట్టులో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడ లేదు. దీంతో ఆ జట్టు 193 పరుగులకే ఆలౌటైంది. బౌలింగ్‌లో ఆస్ట్రేలియా తరఫున జోష్ హేజిల్‌వుడ్, నాథన్ లియాన్ చెరో 3 వికెట్లు తీయగా, మిచెల్ స్టార్క్, కెమరూన్ గ్రీన్ చెరో వికెట్ తీశారు.
Hope this isn’t how Shamar Joseph’s series comes to an end. But after being able to ground that foot for a couple of yards, you could see him give up on putting any pressure on it. Good to see the Gabba crowd clap him off #AusvWI pic.twitter.com/mV5wGmubjY
— Bharat Sundaresan (@beastieboy07) January 27, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..