
ICC Men’s ODI world cup Australia vs Netherlands Playing XI: వన్డే ప్రపంచ కప్ 2023లో (ICC ODI World Cup) ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్స్ (Australia vs Netherlands) మధ్య మ్యాచ్ ఈరోజు అంటే అక్టోబర్ 25న జరుగుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది.
కాగా, ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో నెదర్లాండ్స్ ముందుగా బౌలింగ్ చేయనుంది.
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫేవరెట్‌గా బరిలోకి దిగనుండగా.. దక్షిణాఫ్రికాను ఓడించి నెదర్లాండ్స్ కూడా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో ఏ జట్టును తక్కువ అంచనా వేయలేం. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిస్తే సెమీఫైనల్‌కు చేరుకోవడం సులువవుతుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన ఆస్ట్రేలియా అద్భుతంగా పునరాగమనం చేసింది.
ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా నికర రన్ రేట్ (NRR) -0.193గా నిలిచింది. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న ట్రావిస్ హెడ్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. తద్వారా హెడ్ చేరిక మిచెల్ మార్ష్ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పుకు దారితీయవచ్చు. ప్రస్తుతం హెడ్ లేకపోవడంతో ఓపెనర్‌గా డేవిడ్ వార్నర్‌తో కలిసి మార్ష్ కనిపిస్తున్నాడు.
నెదర్లాండ్స్ (ప్లేయింగ్ XI): విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, బాస్ డి లీడే, తేజా నిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్(కీపర్/కెప్టెన్), సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దట్ట్, పాల్ వాన్ మీకెరెన్.
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుస్చాగ్నే, జోష్ ఇంగ్లిస్(కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, పాట్ కమ్మిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, ఆడమ్ జంపా.
నెదర్లాండ్స్ స్క్వాడ్: విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, బాస్ డి లీడే, తేజా నిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్(w/c), సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్, సాక్విబ్ ఆర్‌కిబ్, సాక్విబ్ క్లైన్, షరీజ్ అహ్మద్, వెస్లీ బరేసి.
ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, స్టీవెన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, జోష్ ఇంగ్లిస్(w), మార్నస్ లాబుస్‌చాగ్నే, పాట్ కమ్మిన్స్(సి), మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్ , సీన్ అబాట్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..