AUS Vs IND: మూడో టెస్టులో బుమ్రా ఆడతాడా? గాయం తీవ్రతపై ఫుల్ క్లారిటీ వచ్చేసిందిగా.. వీడియో

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2024లో భాగంగా మరో రెండు రోజుల్లో టీమిండియా మూడో టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఈ టెస్టులోపు టీమిండియాలో కొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే జస్ప్రీత్ బుమ్రా గాయానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది.

AUS Vs IND: మూడో టెస్టులో బుమ్రా ఆడతాడా? గాయం తీవ్రతపై ఫుల్ క్లారిటీ వచ్చేసిందిగా.. వీడియో
Team India

Updated on: Dec 12, 2024 | 6:43 PM

ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఇరు జట్ల మధ్య బోర్డర్-గవాస్కర్ సిరీస్ జరుగుతోంది. ఇప్పటివరకు రెండు టెస్టు మ్యాచ్‌లు జరగ్గా, ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. పెర్త్ టెస్టులో టీమిండియా విజయం సాధించగా, అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇప్పుడు మూడో టెస్టు మ్యాచ్‌కి ముందు జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్‌పై కొన్ని సందేహాలు ఉన్నాయి. అతను గాయంతో బాధపడుతున్నాడని ప్రచారం జరుగుతోంది. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్ అతని ఫిట్‌నెస్‌పై అనుమానాలు రేకెత్తించింది. ఈ క్రమంలో మూడో టెస్టులో బుమ్రా ఆడుతాడా?లేదా? అన్నది ఉత్కంఠగా మారింది. కాగా ఇరు జట్ల మూడో టెస్ట్ మ్యాచ్ గబ్బా వేదికగా శనివారం (డిసెంబర్ 14) నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బుమ్రా ఫిట్ నెస్ కు సంబంధించి ఓ వీడియో బయటకు వచ్చింది. నెట్స్ లో జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌గా కనిపిస్తున్నాడు. కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్‌లకు బౌలింగ్ చేశాడు. మొదట్లో బుమ్రా కాస్త లెగ్ బ్రేక్ బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత యథావిధిగా వేగంగా బౌలింగ్ చేశాడు. కాబట్టి బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ తోనే ఉన్నాడని, మూడో టెస్టులో బరిలోకి దిగుతాడని తెలుస్తోంది. అలాగే కేఎల్‌ రాహుల్‌ ఓపెనింగ్‌ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

డిసెంబర్ 14 నుంచి గబ్బా టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టెస్టు కోసం టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో కొన్ని మార్పులు చేయవచ్చు. బ్యాటింగ్ ఆర్డర్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు కానీ వాషింగ్టన్ సుందర్ మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశముంది. మహ్మద్ సిరాజ్ వికెట్లు తీసినా భారీగా పరుగులు ఇచ్చాడు. కాబట్టి సిరాజ్ స్థానంలో ఆకాష్ దీప్ లేదా ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి రావచ్చు.

ఇవి కూడా చదవండి

నెట్స్ లో బుమ్రా బౌలింగ్.. వీడియో..

ఒక దశలో రవీంద్ర జడేజాను టీమ్ మేనేజ్‌మెంట్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చే అవకాశం ఉందనే టాక్ కూడా ఉంది. గబ్బా పిచ్‌ను పరిగణనలోకి తీసుకుంటే, ఈ వికెట్ ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ బంతి బౌన్స్ అవుతుంది. ఫాస్ట్ బౌలర్లకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. రెండో టెస్టులో హర్షిత్ రాణా విఫలమయ్యాడు. కాబట్టి ఆకాశ్ దీప్, ప్రసిద్ధ కృష్ణ జట్టులోకి రావొచ్చు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆధిక్యం సాధించేందుకు టీమిండియా ప్రయత్నిస్తోంది. పెర్త్ టెస్టులో టీమిండియా, ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శన చేశాడు. కాబట్టి అతని ఫిట్‌నెస్ టీమ్ ఇండియాకు చాలా ముఖ్యం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..