T20I Rankings: ఆసియా కప్‌కు ముందు టీమిండియా నంబర్1.. మిగిలిన జట్లు ఎక్కడ ఉన్నాయంటే ?
ఐసీసీ టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్‌లో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. భారత్ కేవలం ఆసియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా టీ20 క్రికెట్‌లో నంబర్ వన్ స్థానంలో ఉంది. టీమిండియా 217 రేటింగ్ పాయింట్‌లతో ఐసీసీ టీ20 ఇంటర్నేషనల్ టీమ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉంది.

T20I Rankings: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న జరుగుతుంది. ఈసారి ఆసియా కప్‌లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటాయి. అందులో ఏడు దేశాలు ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి. యూఏఈ మాత్రమే ఇంకా తమ జట్టును ప్రకటించలేదు. ఈసారి ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. ఈ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు, ఐసీసీ టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో ఈ ఎనిమిది జట్లు ఏ స్థానంలో ఉన్నాయో, ఎవరు ముందున్నారో తెలుసుకుందాం.
టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో నంబర్1 ఎవరు?
ఐసీసీ టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. భారత జట్టు ఆసియాలో మాత్రమే కాకుండా, ప్రపంచంలోని అన్ని దేశాలలో టీ20 క్రికెట్‌లో నంబర్ వన్ స్థానంలో ఉంది. టీమిండియా 271 రేటింగ్ పాయింట్‌లతో ఐసీసీ టీ20 అంతర్జాతీయ జట్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉంది. 2024 టీ20 ప్రపంచ కప్ గెలిచి, టీమిండియా ఈ ఫార్మాట్‌లో ఛాంపియన్ అని ప్రపంచానికి చాటింది. ఈ ప్రపంచ కప్ తర్వాత రోహిత్ శర్మ రిటైర్ కావడంతో, సూర్యకుమార్ యాదవ్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు.
ఆసియా కప్ జట్ల ర్యాంకింగ్స్..
* భారత్: 271 రేటింగ్ పాయింట్‌లతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో ఉంది.
* శ్రీలంక: 232 రేటింగ్ పాయింట్‌లతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో 7వ స్థానంలో ఉంది.
* పాకిస్తాన్: 231 రేటింగ్ పాయింట్‌లతో టీ20 ర్యాంకింగ్స్‌లో 8వ స్థానంలో ఉంది.
* అఫ్గానిస్తాన్: 223 రేటింగ్ పాయింట్‌లతో 9వ స్థానంలో ఉంది.
* బంగ్లాదేశ్: 221 రేటింగ్ పాయింట్‌లతో ఐసీసీ టీ20 జట్టు ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో ఉంది.
* యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్: ఈ జాబితాలో 180 రేటింగ్ పాయింట్‌లతో 15వ స్థానంలో ఉంది.
* ఓమన్: 146 రేటింగ్ పాయింట్‌లతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో 20వ స్థానంలో ఉంది.
* హాంగ్‌కాంగ్: 128 రేటింగ్ పాయింట్‌లతో ఐసీసీ టీ20 జట్టు ర్యాంకింగ్స్‌లో 24వ స్థానంలో ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




