AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eng vs SA : 49 పరుగులకే 8 వికెట్లా?.. క్రికెట్లో తోపులం అంటారు.. ఇదేం బ్యాటింగ్ రా బాబూ.. మొత్తానికి పరువు పోయిందిగా

దక్షిణాఫ్రికా జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బౌలర్లు చాలా బాగా బౌలింగ్ చేశారు. తమ బలమైన బ్యాటింగ్‌కు పేరుగాంచిన ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్‌లో తక్కువ పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లు పరుగులు చేయడానికి చాలా కష్టపడ్డారు.

Eng vs SA : 49 పరుగులకే 8 వికెట్లా?.. క్రికెట్లో తోపులం అంటారు.. ఇదేం బ్యాటింగ్ రా బాబూ.. మొత్తానికి పరువు పోయిందిగా
England Vs South Africa
Rakesh
|

Updated on: Sep 03, 2025 | 6:36 AM

Share

Eng vs SA : సౌతాఫ్రికా జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. రెండు జట్ల మధ్య 3 మ్యాచ్​ల వన్డే సిరీస్ జరుగుతోంది. సిరీస్‌లోని మొదటి మ్యాచ్​లో సౌతాఫ్రికా బౌలర్లు చాలా డేంజరస్‎గా బౌలింగ్ వేశారు. తమ పటిష్టమైన బ్యాటింగ్‌కు పేరుగాంచిన ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్‌లో అత్యంత తక్కువ స్కోరుకే ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లు పరుగుల కోసం చాలా కష్టపడ్డారు. దీనివల్ల 50 ఓవర్ల మ్యాచ్​లో 25 ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేకపోయారు.

ఇంగ్లాండ్ తక్కువ స్కోరుకే ఆలౌట్

లీడ్స్‌లోని హెడింగ్లే స్టేడియంలో సౌతాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. వారి ఈ నిర్ణయం చాలా సరైనదని బౌలర్లు నిరూపించారు. ఇంగ్లాండ్ తన మొదటి వికెట్‌ను 13 పరుగులకే కోల్పోయింది. బెన్ డకెట్ కేవలం 5 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత జో రూట్ కొన్ని మంచి షాట్లు కొట్టినా, అతను కూడా 14 పరుగులు చేసి అవుటయ్యాడు. జేమీ స్మిత్, హ్యారీ బ్రూక్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టడానికి ప్రయత్నించి జట్టు స్కోరును 82 పరుగులకు చేర్చారు. కానీ, ఆ తర్వాత ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోయింది.

రాషీద్ ఖాన్, జేమీ స్మిత్ ఆశలు నింపినా..

ఒకానొక సమయంలో 2 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసిన ఇంగ్లాండ్ జట్టు, 131 పరుగులకే ఆలౌట్ అయింది. హ్యారీ బ్రూక్‌ మూడవ వికెట్‌గా అవుటైన తర్వాత ఏ బ్యాట్స్‌మెన్ కూడా క్రీజులో ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. ఇంగ్లాండ్​కు చెందిన 7 మంది బ్యాట్స్‌మెన్‌లు రెండంకెల స్కోరు కూడా దాటలేకపోయారు. ఇంగ్లాండ్ తరపున జేమీ స్మిత్ అత్యధికంగా 54 పరుగులు చేశాడు. జోస్ బట్లర్ 15 పరుగులు మరియు హ్యారీ బ్రూక్ 12 పరుగులు చేశారు.

మహారాజ్​ మాయాజాలం..

ప్రపంచ నంబర్ 1 వన్డే బౌలర్ కేశవ్ మహారాజ్ మరోసారి తన మాయాజాలాన్ని చూపించాడు. కేశవ్ మహారాజ్ కేవలం 5.3 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. వైయాన్ ముల్డర్ కూడా చాలా విజయవంతమయ్యాడు. అతను 7 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. వీళ్లతో పాటు లుంగీ ఎన్గిడి, నాండ్రే బర్గర్ కూడా ఒక్కో వికెట్ పడగొట్టారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..