బంగ్లాతో పోరు.. ఆ ముగ్గురు కీలక ఆటగాళ్లకు విశ్రాంతి.. జట్టులోకి టీ20 స్పెషలిస్ట్.!
ఆసియా కప్ 2023 తుది అంకానికి చేరుకుంది. గురువారం పాకిస్తాన్, శ్రీలంక మధ్య కీలక పోరు జరుగుతుండగా.. భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగే సూపర్ ఫోర్స్‌లోని ఆఖరి పోరుతో లీగ్ స్టేజి ముగియనుంది. పాకిస్తాన్, శ్రీలంక జట్లలో ఏది భారత్‌తో ఆసియా కప్ ఫైనల్‌లో తలబడనుందో.. మరికొద్ది గంటల్లో తేలనుంది. ఇదిలా ఉంటే..

ఆసియా కప్ 2023 తుది అంకానికి చేరుకుంది. గురువారం పాకిస్తాన్, శ్రీలంక మధ్య కీలక పోరు జరుగుతుండగా.. భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగే సూపర్ ఫోర్స్‌లోని ఆఖరి పోరుతో లీగ్ స్టేజి ముగియనుంది. పాకిస్తాన్, శ్రీలంక జట్లలో ఏది భారత్‌తో ఆసియా కప్ ఫైనల్‌లో తలబడనుందో.. మరికొద్ది గంటల్లో తేలనుంది. ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 15న బంగ్లాదేశ్‌తో జరగబోయే మ్యాచ్‌లో రోహిత్ సేన జట్టులో భారీ మార్పులు చేసే అవకాశముందని తెలుస్తోంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం జట్టులోని కీలక ప్లేయర్స్‌కు రెస్ట్ ఇవ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోందట. శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ద్ కృష్ణ, అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్ లాంటివారి బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌కు బరిలోకి దిగొచ్చునని ఇన్‌సైడ్ టాక్ వినిపిస్తోంది.
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా రెండు రోజులు జరగడం.. ఆ వెంటనే శ్రీలంకతో రోహిత్ సేన తలబడగా.. ఇలా వరుసగా మూడు రోజులు టీమిండియా క్రికెట్ ఆడటంతో పలువురు ప్లేయర్స్ ఫైనల్ మ్యాచ్‌కు ఇబ్బంది పడే అవకాశముందని కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ గ్రహించారు. వారిలో ముఖ్యంగా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వరుస మ్యాచ్‌లు ఆడటంతో.. అతడికి పని భారం ఎక్కువైందని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఇక మంచి ఫామ్ కనబరుస్తున్న కుల్దీప్ యాదవ్ మళ్ళీ గాయాల బారిన పడకుండా రెస్ట్ ఇవ్వాలని టీం చూస్తోంది. ఇక మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్‌కు విశ్రాంతినిచ్చి.. సూర్యకుమార్ యాదవ్‌ను అతడి స్థానంలో తీసుకునే ఛాన్స్ ఉంది. ఫైనల్‌గా పేస్ బౌలింగ్ విభాగంలో సిరాజ్‌కు రెస్ట్ ఇచ్చి.. షమీ తుది జట్టులోకి రావచ్చు. ఎందుకంటే ఈ టోర్నీలో షమీ తక్కువ మ్యాచ్‌లే ఆడాడు.
కాగా, భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ మరో మూడు వారాల్లో మొదలుకానుండటంతో.. ప్రపంచకప్ జట్టులో ఎంపికైన ప్రతీ ప్లేయర్‌కు కావలసినన్ని అవకాశాలు ఇవ్వనుంది టీమిండియా మేనేజ్‌మెంట్. అటు ఆఫ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్‌పై కూడా టీమిండియా ప్రత్యేక దృష్టి సారించింది. జట్టులో కుల్దీప్ యాదవ్ పని భారాన్ని సమతుల్యం చేస్తే.. అటు అక్షర్ పటేల్‌ను కూడా అవసరమయ్యే మ్యాచ్‌లకు బరిలోకి దింపనుంది రోహిత్ సేన.
బంగ్లాదేశ్ మ్యాచ్‌కు టీమిండియా జట్టు(అంచనా):
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్/సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా/శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్/మహమ్మద్ షమీ




