AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SL Vs BAN: ‘నాగిని’ డ్యాన్స్ ఎవరిది.? నేడే శ్రీలంక, బంగ్లాదేశ్ ఫైట్.. పదేళ్ల తర్వాత తొలిసారిగా.!

ఆసియా కప్ ప్రారంభ మ్యాచ్‌లో నేపాల్‌పై పాకిస్తాన్ భారీ విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది. టోర్నీలోని రెండో మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్‌ తలబడనున్నాయి. మరి వీరిద్దరిలో ఎవరు గెలుస్తారు.? 'నాగిని' డ్యాన్స్ ఎవరిదవుతుందో చూడాలి.

SL Vs BAN: 'నాగిని' డ్యాన్స్ ఎవరిది.? నేడే శ్రీలంక, బంగ్లాదేశ్ ఫైట్.. పదేళ్ల తర్వాత తొలిసారిగా.!
Sl Vs Ban
Ravi Kiran
|

Updated on: Aug 31, 2023 | 11:17 AM

Share

ఆసియా కప్ ప్రారంభ మ్యాచ్‌లో నేపాల్‌పై పాకిస్తాన్ భారీ విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది. టోర్నీలోని రెండో మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్‌ తలబడనున్నాయి. మరి వీరిద్దరిలో ఎవరు గెలుస్తారు.? ‘నాగిని’ డ్యాన్స్ ఎవరిదవుతుందో చూడాలి. ప్రస్తుతం ఈ రెండు జట్ల మధ్య లెక్కలు చూస్తే.. బంగ్లాదేశ్ ఒకటి.. శ్రీలంక ఒకటితో సమానంగా ఉన్నాయ్. మరి పల్లెకెలెలో అధిపత్యం ఎవరిదో వేచి చూడాలి.

శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్లకు గాయాల బెడద వెంటాడుతోంది. ఇరు జట్లకు చెందిన కొందరు బడా ప్లేయర్లు ఇప్పటికే ఆసియా కప్‌కు దూరమయ్యారు. గాయాల కారణంగా బౌలింగ్ లైనప్ బలహీనంగా మారిపోయి.. కష్టాల్లో పడింది శ్రీలంక. అదే సమయంలో తమీమ్ ఇక్బాల్, లిటన్ దాస్ వంటి స్టార్ ప్లేయర్లు లేకపోవడంతో బంగ్లాదేశ్ బ్యాటింగ్ స్వల్పంగా బలహీనపడింది. ఇక ఆసియా కప్‌లో ఈ రెండు జట్ల చరిత్ర ఒకసారి పరిశీలిస్తే..

2018లో బంగ్లాదేశ్, 2022లో శ్రీలంక..

2018 నిదాహాస్ ట్రోఫీ ఫైనల్‌లో బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మ్యాచ్ సందర్భంగా ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తోపులాటలు కూడా జరిగాయి. అయితే చివరకు బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో గెలుపొందటంతో.. ఆ జట్టు ప్లేయర్స్ మైదానంలో నాగిని డ్యాన్స్ చేసి.. గెలుపును ఆస్వాదించారు. ఇక 2022లో బంగ్లాదేశ్‌ను ఓడించి శ్రీలంక అద్భుత విజయాన్ని అందుకుంది. ఆ జట్టు ప్లేయర్స్ నాగిని డ్యాన్స్ చేసి.. బంగ్లాదేశ్‌పై రివెంజ్‌ తీసుకున్నారు.

పదేళ్ల తర్వాత పల్లెకెలెలో..

2023 ఆసియా కప్‌లో బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య పల్లెకెలెలో మ్యాచ్ జరగనుంది. పదేళ్ల తర్వాత ఈ మైదానంలో ఇరు జట్లు తలపడనున్నాయి. 2013లో ఇక్కడ వీరి మధ్య మ్యాచ్ జరగ్గా అందులో బంగ్లాదేశ్ విజయం సాధించింది. శ్రీలంక విషయానికి వస్తే.. పాకిస్థాన్ తర్వాత బంగ్లాదేశ్‌పై అత్యధిక శాతం మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా ఉంది. బంగ్లాదేశ్‌తో గత 10 వన్డేల్లో శ్రీలంక 4 మాత్రమే ఓడిపోయింది. దీంతో ఇరు జట్ల మధ్య పోటీ దాదాపు సమంగా సాగినట్లు స్పష్టమవుతోంది. అటువంటి పరిస్థితిలో, 2023 ఆసియా కప్‌ రెండో మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు.! ‘నాగిని’ డ్యాన్స్ ఎవరు చేస్తారన్నది ఆసక్తికరంగా ఉంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..