IND Vs PAK: కోహ్లీ, అయ్యర్ కాదు.. నంబర్ 4లో దిగేది ఆ ప్లేయరే.. రోహిత్ సంచలన నిర్ణయం.!
లంకలో దాయాదుల భీకర పోరుకు రంగం సిద్దమైంది. పల్లెకల్లె వేదికగా భారత్, పాకిస్తాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. సెప్టెంబర్ 2, అలాగే సెప్టెంబర్ 4న జరిగే మ్యాచ్‌ల్లో రాహుల్ ఆడే ఛాన్స్ లేకపోవడంతో.. ప్లేయింగ్11లో అతడి స్థానాన్ని ఇషాన్ కిషన్ రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

లంకలో దాయాదుల భీకర పోరుకు రంగం సిద్దమైంది. పల్లెకల్లె వేదికగా భారత్, పాకిస్తాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. సెప్టెంబర్ 2, అలాగే సెప్టెంబర్ 4న జరిగే మ్యాచ్‌ల్లో రాహుల్ ఆడే ఛాన్స్ లేకపోవడంతో.. ప్లేయింగ్11లో అతడి స్థానాన్ని ఇషాన్ కిషన్ రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇషాన్ ఏ నంబర్‌లో బ్యాటింగ్ చేస్తాడన్నది ఇప్పుడున్న ప్రశ్న. వెస్టిండీస్ పర్యటనలో ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించాడు. వన్డే సిరీస్‌లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించి దుమ్ముదులిపాడు. కానీ వన్డేల్లో భారత్ తరపున రాహుల్ మిడిలార్డర్‌లో బరిలోకి దిగుతుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇషాన్‌ను మిడిలార్డర్‌లో ఆడించడం.. టీమ్ మేనేజ్‌మెంట్‌కు కత్తి మీద సామే.
టీమ్ మేనేజ్‌మెంట్ ఏం చేస్తుంది.?
టీమ్ ఇండియా ఓపెనింగ్ జోడీ చూస్తే.. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగుతారు. ఒకవేళ ఇషాన్ జట్టులోకి వస్తే గిల్ లేదా రోహిత్ దిగువన ఆడక తప్పదని చర్చ సాగుతోంది. అలా కాకపోతే గిల్ నంబర్ 3లో, కోహ్లీ నంబర్ 4లో ఆడే అవకాశాలు లేకపోలేదు. కానీ జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం, టీమ్ మేనేజ్‌మెంట్ ఇషాన్‌ను నంబర్ 4 లేదా నంబర్ 5లో ఆడించాలని చూస్తోందట. అటు రోహిత్, ఇటు ద్రవిడ్ టాప్ 3 బ్యాటింగ్ లైనప్‌ను తారుమారు చేయకూడదని భావిస్తున్నారట.
ఇషాన్ సక్సెస్ అవుతాడా.?
వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా ఎన్నో ప్రయోగాలు చేయడంతో వన్డే సిరీస్‌లో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితిలో, ప్రపంచకప్‌కు దగ్గర పడుతున్న వేళ.. ఓపెనర్‌ను 4 లేదా అంతకంటే తక్కువ స్థానంలో ఆడించాలన్న నిర్ణయం.. టీమిండియాకు సరైనదేనా.? ఇషాన్ నంబర్ 4లో ఆడటం ఇదేం తొలిసారి కాదు.. ఇంతకుముందు కూడా ఈ నంబర్‌లో ఆడాడు. వన్డేల్లో ఇషాన్ నంబర్ 4లో ఆరు మ్యాచ్‌లలో 21.20 సగటుతో 106 పరుగులు చేశాడు. ఇందులో ఒక్క అర్ధ సెంచరీ కూడా లేదు. స్పిన్ పిచ్‌లలో ఇషాన్ తడబడటం ఖాయం అని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
🚨 Our squad for the Afghanistan series and Asia Cup 🚨
Read more: https://t.co/XtjcVAmDV7#AFGvPAK | #AsiaCup2023 pic.twitter.com/glpVWF6oWW
— Pakistan Cricket (@TheRealPCB) August 9, 2023
Here's the Rohit Sharma-led team for the upcoming #AsiaCup2023 🙌#TeamIndia pic.twitter.com/TdSyyChB0b
— BCCI (@BCCI) August 21, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
