AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MI vs GT: రోహిత్‌, బుమ్రాలే కాదు.. ముంబై ఇండియన్స్‌ గెలుపు వెనుక అసలైన హీరోలు ఈ ఇద్దరే!

ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ ని ఓడించింది. రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన ప్రదర్శనతో ముంబై విజయానికి కారణమయ్యారు. అయితే, హార్దిక్ పాండ్యా, అశ్వినీ కుమార్ కూడా ముంబై విజయంలో కీలక పాత్ర పోషించారు.

MI vs GT: రోహిత్‌, బుమ్రాలే కాదు.. ముంబై ఇండియన్స్‌ గెలుపు వెనుక అసలైన హీరోలు ఈ ఇద్దరే!
Mumbai Indians
SN Pasha
|

Updated on: May 31, 2025 | 7:14 PM

Share

ఐపీఎల్‌ 2025లో సీజన్‌ మొత్తం అద్భుత ప్రదర్శన కనబర్చిన గుజరాత్‌ టైటాన్స్ ఎలిమినేటర్‌లో ఓడిపోయింది. శుక్రవారం ముల్లాన్‌పూర్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్‌ అండ్‌ కో.. ఎలిమినేటర్‌ గండాన్ని దాటలేకపోయింది. మరోవైపు ప్లే ఆఫ్స్‌కు చేరిన నాలుగు జట్లలో చివరి స్థానంలో నిలిచిన ముంబై మాత్రం ఈ ఎలిమినేటర్‌లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. జట్టు మొత్తం సమిష్టి కృషితో జూన్‌ 1న అహ్మదాబాద్‌లో పంజాబ్‌ కింగ్స్‌తో క్వాలిఫైయర్‌ 2 ఆడేందుకు రెడీ అయిపోయింది. కాగా, గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ విజయంలో అంతా జస్ప్రీత్‌ బుమ్రా, రోహిత్‌ శర్మ పాత్ర గురించి మాట్లాడుతున్నారు. ఎస్‌.. వాళ్లిద్దరూ అద్భుతంగా ఆడారు. రోహిత్‌ బ్యాట్‌తో గుజరాత్‌పై విరుచుకుపడితే, బుమ్రా బాల్‌తో జీటీ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఆల్‌మోస్ట్‌ గుజరాతే గెలుస్తుందనే టైమ్‌లో రాకెట్‌ లాంటి యార్కర్‌తో వాషింగ్టన్‌ సుందర్‌ను అవుట్‌ చేసి.. మ్యాచ్‌ను ఒక్కసారిగా ములుపు తిప్పేశాడు. సో.. రోహిత్‌ అండ్‌ బుమ్రాకు కచ్చితంగా క్రెడిట్‌ ఇచ్చి తీరాల్సిందే.

అయితే.. వీళ్లిద్దరితో పాటు మరో ఇద్దరు అన్‌సంగ్‌ హీరోస్‌ ఉన్నారు. వారు లేకుంటే.. మ్యాచ్‌ ఫలితం కచ్చితంగా మరోలా ఉండేదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరంటే.. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్థిక్‌ పాండ్యా, యంగ్‌ బౌలర్‌ అశ్వినీ కుమార్‌. ఇద్దరు ముంబై ఇండియన్స్ కనిపించని మేలు చేశారు. బుమ్రా మాయలో అశ్వినీ కుమార్‌ చేసిన అద్భుతం కనిపించకుండా పోయింది. కానీ, కాస్త నిశితంగా పరిశీలిస్తే.. ముంబై విజయంలో అశ్వినీ కుమార్‌ పాత్ర ఎంతో ఉంది. పైగా మనోడు వచ్చింది ఇంప్యాక్ట్‌ సబ్‌గా బౌలింగ్‌ వేసేందుకు ఎంతో కఠినమైన, కీలకమైన టైమ్‌లో గ్రౌండ్‌లోకి వచ్చాడు. ఇన్‌ ఫ్యాక్ట్‌.. అగ్నికి వాయువు తోడైనట్లు బుమ్రాకు అశ్వినీ జతకట్టాడు. బుమ్రా తర్వాత అతి తక్కువ ఎకానమితో బౌలింగ్‌ చేసింది అశ్వినీనే. బుమ్రా నాలుగు ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీసుకుంటే.. అశ్వినీ 3.3 ఓవర్లు వేసి ఒక వికెట్‌ తీసుకున్నాడు. అంత ఒత్తిడిలో కూడా పెద్దగా అనుభవం లేకపోయినా చాలా బాగా, పొదుపుగా బౌలింగ్‌ వేశాడు.

అందుకే ఈ ఎలిమినేటర్‌ మ్యాచ్‌ విజయంలో కచ్చితంగా అశ్వినీ కుమార్‌కు క్రెడిట్‌ ఇచ్చి తీరాల్సిందే. ఇక పాండ్యా కాంట్రిబ్యూషన్‌ గురించి మాట్లాడుకుంటే.. ముంబై ఇండియన్స్‌కు లభించిన స్టార్ట్‌ని చూసి కచ్చితంగా 200 మార్క్‌ స్కోర్‌ను అందుకుంటుందని అంతా అనుకున్నారు. అనుకున్నట్లే ముంబై ఇండియన్స్‌ 200 ప్లస్‌ స్కోర్‌ చేసింది. అయితే.. 200 అనే సైకలాజికల్‌ మార్క్‌ దాటడంతో పాటు దాన్ని మరింత స్ట్రాంగ్‌ చేస్తూ.. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో ఎక్స్‌ట్రా 20 రన్స్‌ను తీసుకొచ్చింది మాత్రం పాండ్యా హిట్టింగే. చివరి ఓవర్‌లో ముంబైకి ఏకంగా 22 పరుగులు వచ్చాయి. అది చాలా గట్టి ఇంప్యాక్ట్‌ చూపించింది. ఆ ఓవర్‌లో పాండ్యా ఏకంగా 3 భారీ సిక్సులు కొట్టాడు. ఇన్నింగ్స్‌ ముగిసే సమయంలో అలాంటి ఫినిష్‌ లభిస్తే.. కచ్చితంగా ఆ టీమ్‌కు మూమెంటమ్‌ అనేది లభిస్తుంది. అది ముంబైకి పాండ్యా అందించాడు. పైగా ముంబై 20 రన్స్‌ తేడాతోనే గెలిచింది. సో.. చివరి ఓవర్‌లో పాండ్యా కొట్టిన ఆ మూడు సిక్సులే ముంబై ఇండియన్స్‌కు, గుజరాత్‌ టైటాన్స్‌కు మధ్య తేడాగా మిగిలాయి. అందుకే.. ఎలిమినేటర్‌లో హార్ధిక్‌ పాండ్యా, అశ్వినీ కుమార్‌లు అన్‌సంగ్‌ హీరోలు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఓజీ డైరెక్టర్‌కు కాస్ల్టీ గిఫ్ట్‌ ఇచ్చిన పవన్ బండ్ల గణేశ్ ట్వీట్
ఓజీ డైరెక్టర్‌కు కాస్ల్టీ గిఫ్ట్‌ ఇచ్చిన పవన్ బండ్ల గణేశ్ ట్వీట్
ఐదేళ్ల చిన్నారికి అరుదైన వ్యాధి.. గుండె రాయిలా మారింది..!
ఐదేళ్ల చిన్నారికి అరుదైన వ్యాధి.. గుండె రాయిలా మారింది..!
సినిమాల చుట్టూ వివాదాలు..! అయినా జైకొట్టిన ప్రేక్షకులు
సినిమాల చుట్టూ వివాదాలు..! అయినా జైకొట్టిన ప్రేక్షకులు
నిధికి సపోర్ట్‌గా ఫ్యాన్స్‌పై చిన్మయి ఆగ్రహం
నిధికి సపోర్ట్‌గా ఫ్యాన్స్‌పై చిన్మయి ఆగ్రహం
యంగ్ బ్యూటీ పేరు మర్చిపోయి.. స్టేజ్ మీద అడ్డంగా బుక్కైన రామ్‌చరణ్
యంగ్ బ్యూటీ పేరు మర్చిపోయి.. స్టేజ్ మీద అడ్డంగా బుక్కైన రామ్‌చరణ్
యంగ్ బ్యూటీలకు ఏ మాత్రం తక్కువ కాదంటున్న సీనియర్ హీరోయిన్
యంగ్ బ్యూటీలకు ఏ మాత్రం తక్కువ కాదంటున్న సీనియర్ హీరోయిన్
85 ఏళ్ల వయసులో జిమ్‌లో చెమటోడుస్తున్న సీనియర్ నటుడు
85 ఏళ్ల వయసులో జిమ్‌లో చెమటోడుస్తున్న సీనియర్ నటుడు
5 సినిమాలతో బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న స్టార్ హీరోయిన్
5 సినిమాలతో బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న స్టార్ హీరోయిన్
రాత్రి మెలకువగా ఉండేవాళ్లు జీనియస్‌లు! ఏది నిజం
రాత్రి మెలకువగా ఉండేవాళ్లు జీనియస్‌లు! ఏది నిజం
ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడానికి మళ్లీ రెడీ అవుతున్న బాలయ్య
ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడానికి మళ్లీ రెడీ అవుతున్న బాలయ్య