Viral Video : చెన్నై వదిలేసి కేరళ వస్తున్న బ్రో.. సంజూ శాంసన్, అశ్విన్ ఫన్నీ వీడియో వైరల్
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు ట్రేడింగ్, ఆటగాళ్ల మార్పులు వంటి వార్తలు జోరందుకున్నాయి. ఈ చర్చల్లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సంజూ శాంసన్ రాజస్థాన్ యాజమాన్యంపై అసంతృప్తిగా ఉన్నారని, అందుకే ట్రేడ్ లేదా రిలీజ్ చేయమని కోరినట్లు వార్తలు వస్తున్నాయి.

Viral Video : ఐపీఎల్ 2026కు ముందు ఆటగాళ్ల ట్రేడింగ్‌పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌లపై ఎక్కువ వార్తలు వచ్చాయి. అశ్విన్ సీఎస్కేను వీడబోతున్నాడనే వార్తలపై అతను సరదాగా స్పందించాడు. సంజూ శాంసన్ హోస్ట్ చేసిన ఒక షోలో ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎల్‌లో ట్రేడింగ్ వార్తలు జోరుగా వినిపిస్తున్న నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్ ఒక ఆసక్తికరమైన వీడియోతో ముందుకు వచ్చాడు. అశ్విన్ హోస్ట్ చేసే యూట్యూబ్ షో కుట్టి స్టోరీస్ విత్ యాష్ టీజర్‌లో సంజూ శాంసన్ గెస్టుగా వచ్చాడు. ఈ టీజర్‌లో అశ్విన్ తన ట్రేడింగ్ వార్తలపై సరదాగా మాట్లాడాడు.
అశ్విన్ ఏమన్నారంటే.. “నన్ను అడగడానికి మీకు చాలా ప్రశ్నలున్నాయి. కానీ, అంతకంటే ముందు నేను నేరుగా ట్రేడ్ అయిపోదాం అనుకుంటున్నాను. నేను కేరళలో ఉండటానికి చాలా సంతోషంగా ఉన్నాను. చాలా పుకార్లు వస్తున్నాయి. నాకేం తెలియడం లేదు. అందుకే మిమ్మల్నే అడుగుదామని వచ్చాను. నేను కేరళలో ఉంటాను, మీరు చెన్నైకి తిరిగి వెళ్లగలరా?” అని అశ్విన్ అనగా, సంజూ శాంసన్ నవ్వడం ఆపలేకపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Sanju on #KuttiStoriesWithAsh, powered by @PeterEngland_. Drops tomorrow afternoon. pic.twitter.com/J2QQ5Ia5eZ
— Kutti Stories with Ash (@crikipidea) August 8, 2025
సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ టీం మేనేజ్‌మెంట్‌పై అసంతృప్తిగా ఉన్నాడని, అందుకే ట్రేడ్ లేదా రిలీజ్ చేయమని కోరాడని వార్తలు వచ్చాయి. గత సీజన్‌లో గాయం కారణంగా అతను ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. అయినా, రాజస్థాన్ అతన్ని రూ.18 కోట్లకు రిటైన్ చేసింది. మరోవైపు, అశ్విన్‌ను సీఎస్కే రూ.9.75 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ, అతను 9 మ్యాచ్‌లలో కేవలం 7 వికెట్లు మాత్రమే తీశాడు. అందుకే అశ్విన్ సీఎస్కేను వీడి, గతంలో అద్భుత ప్రదర్శన చేసిన రాజస్థాన్ రాయల్స్‌లోకి తిరిగి వెళ్తాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఐపీఎల్ ట్రేడ్ విండో అంటే ఏమిటి?
ఐపీఎల్ ట్రేడ్ విండో అంటే, రెండు ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను పరస్పరం మార్చుకోవడం. ఇది సాధారణంగా ఆక్షన్ ముందు ఓపెన్ అవుతుంది. ట్రేడింగ్ విండో సీజన్ ముగిసిన 7 రోజుల నుంచి ఆక్షన్ కు 7 రోజుల ముందు వరకు ఓపెన్ గా ఉంటుంది. ఒకవేళ ఇద్దరు ఆటగాళ్లను వేర్వేరు జీతాలతో మార్చుకుంటే, ఎక్కువ జీతం ఉన్న ఆటగాడిని తీసుకునే టీం మిగిలిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి….




